DCW Chief Swati Maliwal (Photo Credit: Twitter/IANS)

Newdelhi, March 12: 8 ఏళ్ల వయసులోనే తాను తండ్రి నుంచి లైంగిక వేధింపులు ఎదుర్కొన్నట్టు ప్రముఖ నటి, జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలు ఖుష్బూ (Kushbu) ఇటీవల చెప్పారు. తనకు 15 ఏళ్ల వచ్చాక తండ్రిని ఎదిరించడం మొదలుపెట్టానని, ఆ తర్వాత ఏడాదికే ఆయన తమను వదిలేసి వెళ్లిపోయారని ఆమె తెలిపారు. మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆమె చేసిన ఈ వ్యాఖ్యలను మరిచిపోకముందే.. ఇలాంటి మరో ఘటన తాజాగా వెలుగు చూసింది. తన తండ్రి నుంచి లైంగిక వేధింపులు ఎదుర్కొన్నట్టు ఢిల్లీ మహిళా కమిషన్ (డీసీడబ్ల్యూ) చైర్ పర్సన్ స్వాతి మాలివాల్ (Swati Maliwal) తాజాగా వ్యాఖ్యానించారు. ‘తండ్రి ఇంటికి వస్తుంటే భయమేసేది. ఆయన వస్తున్నారంటే చాలు భయంతో మంచం కింద దాక్కునేదానిని’ అని ఆమె పేర్కొన్నారు. దేశ రాజధాని ఢిల్లీలో నిన్న నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ అవార్డుల ప్రదానోత్సవంలో ఆమె మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.

మళ్లీ మొదలైన ఆందోళన.. పెరుగుతున్న కొవిడ్, హెచ్3ఎన్2 కేసులు.. అప్రమత్తంగా ఉండాలంటూ రాష్ట్రాలకు కేంద్రం లేఖ.. మెడికల్ ఆక్సిజన్, టీకాలు సిద్ధంగా ఉంచుకోవాలని సూచన

తాను కూడా లైంగిక వేధింపుల బాధితురాలినేనని మాలివాల్ పేర్కొన్నారు. తాను నాలుగో తరగతి చదువుతున్న వరకు మేం ఆయనతో కలిసే ఉన్నామని చెప్పిన స్వాతి.. ఆయన తనను అకారణంగా కొట్టేవారని అన్నారు. కొన్నిసార్లు రక్తం కూడా వచ్చేదని గుర్తు చేసుకుని ఆవేదన వ్యక్తం చేశారు. తన తండ్రి ఇంట్లోకి వస్తున్నారంటే వణికిపోయేదానినని, ఆయన లైంగిక వేధింపులు భరించలేక చాలాసార్లు మంచం కింద దాక్కున్నానని మాలివాల్ అన్నారు.

ముగిసిన కవిత ఈడీ విచారణ, 9 గంటల పాటూ సుధీర్ఘంగా కొనసాగిన విచారణ, ఈ నెల 16న మళ్లీ రావాలంటూ సమన్లు