Coronavirus | Representational Image | (Photo Credits: ANI)

Newdelhi, March 12: మళ్లీ కలవరం మొదలైంది. దేశంలో కొవిడ్ తో (Covid-19) పాటు ఇన్‌ఫ్లుయెంజా ఉపరకం హెచ్3ఎన్2 కేసులు (H3N2 Influenza Cases) కూడా మళ్లీ పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. ఈ క్రమంలో కేంద్రం అప్రమత్తమైంది. జాగ్రత్తగా ఉండాలని రాష్ట్రాలకు సూచించింది. సమస్య మరింత ప్రమాదకరంగా మారకుండా  చూసుకోవాల్సిన అవసరం ఉందని, తక్షణమే పరిష్కరించాలని పేర్కొంది. ఇన్‌ఫ్లుయెంజా సంబంధిత వ్యాధికారకాలపై సమగ్ర నిఘా కోసం కార్యచరణ మార్గదర్శకాలను పాటించాలని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను కోరింది. ఆసుపత్రుల్లో మందులు, మెడికల్ ఆక్సిజన్, టీకాలను సిద్ధం చేసుకోవాలని సూచించింది.

ముగిసిన కవిత ఈడీ విచారణ, 9 గంటల పాటూ సుధీర్ఘంగా కొనసాగిన విచారణ, ఈ నెల 16న మళ్లీ రావాలంటూ సమన్లు

గత కొన్ని నెలలుగా దేశంలో కొవిడ్ వ్యాప్తి అదుపులోనే ఉందని, కానీ కొన్ని రాష్ట్రాల్లో కేసులు మళ్లీ పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోందని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు రాసిన లేఖలో కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్ పేర్కొన్నారు. ప్రస్తుతం కొత్త కేసులు, కొవిడ్ వ్యాప్తి అదుపులోనే ఉన్నప్పటికీ టెస్ట్, ట్రాక్, వ్యాక్సినేషన్, కొవిడ్ ప్రవర్తనకు కట్టుబడి ఉండడమే ఐదు పాయింట్లకు వ్యూహానికి కట్టుబడి అప్రమత్తంగా ఉండాలని ఆ లేఖలో పేర్కొన్నారు. కాగా, పలు రాష్ట్రాల్లో కొవిడ్ కేసులు, హెచ్3ఎన్2 కేసులు పెరుగుతుండటం తీవ్ర ఆందోళన కలిగిస్తున్నది.

వామ్మో చైనాలో మరో విచిత్రం, పురుగుల వర్షంతో ఉక్కిరిబిక్కిరైన బీజింగ్, వైరల్‌గా మారిన వీడియో, నిజమా? ఫేకా? అని నెటిజన్ల చర్చ