Nagpur, March 6: మహారాష్ట్రలోని (Maharastra) నాగ్‌పూర్‌లో (Nagpur) ఒళ్లు గగుర్పొడిచే షాకింగ్ ఘటన వెలుగు చూసింది. స్థానిక అంబజారీ ప్రాంతానికి చెందిన ఓ పదిహేనేండ్ల బాలికకు సోషల్ మీడియా (Social Media) ద్వారా ఓ వ్యక్తితో పరిచయం ఏర్పడింది. ఆకర్షణ మైకం కమ్మిన ఇద్దరూ శారీరకంగా దగ్గరయ్యారు. ఫలితంగా బాలిక గర్భం దాల్చింది. బిడ్డ పొట్ట పెరుగుతుండడంతో అనుమానించిన బాలిక తల్లి ప్రశ్నించగా ఏం లేదని.. ఒంట్లో బాగో లేకపోవడంతోనే ఇలా జరుగుతుందని బాలిక తల్లికి సర్దిచెప్పేది. నెలలు గడిచాయి. కాన్పుకు సమయం దగ్గర పడింధి. దీంతో ఇంట్లో ఎవరూ లేని సమయంలో సొంతగా కాన్పు చేసుకొన్న బాలిక ఆడబిడ్డకు జన్మనిచ్చింది.
దీని కోసం యూట్యూబ్‌లో కాన్పుకు సంబంధించిన వీడియోలను ముందే చూసిన బాలిక.. కాన్పు ఎలా చెయ్యాలో నేర్చుకుందని పోలీసులు తెలిపారు. కాన్పు అయిన వెంటనే పుట్టిన శిశువును బాలిక గొంతు నులిమి చంపేసింది. ఆ తర్వాత ఇంట్లోని పెట్టెలో శిశువు మృతదేహాన్ని దాచిపెట్టింది. బాలిక నీరసంగా ఉండటాన్ని గమనించిన తల్లి గట్టిగా ప్రశ్నించింది. దీంతో విషయం బయటకు వచ్చింది.
Teenage girl in Nagpur delivers baby at home after watching online videos, kills newborn: Police https://t.co/rQ3jQ0948l
— Newsd (@GetNewsd) March 5, 2023