Newdelhi, Nov 14: ఇప్పటికే కాలుష్య కోరల్లో చిక్కుకున్న దేశ రాజధాని ఢిల్లీని (New Delhi) దీపావళి (Diwali) వేడుకలు మరింత కష్టాల్లోకి నెట్టాయి. ప్రస్తుతం రాజధాని ప్రాంతంలో కాలుష్యం తీవ్ర స్థాయికి చేరింది. ప్రపంచంలోనే 10 అత్యంత కాలుష్య నగరాల జాబితాను (World Most Polluted Cities) స్విస్ గ్రూప్ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (Swiss group IQAir) తాజాగా విడుదల చేసింది. ఆ జాబితా ప్రకారం.. ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరాల్లో దేశరాజధాని ఢిల్లీ అగ్రస్థానంలో నిలిచింది. ఇక మరో రెండు భారతీయ నగరాలు కూడా టాప్ 10లో నిలిచాయి. దీపావళి కారణంగా పశ్చిమబెంగాల్ రాజధాని కోల్‌కతా (Kolkata), మహారాష్ట్ర రాజధాని ముంబై (Mumbai) నగరాలు కూడా తీవ్ర వాయుకాలుష్యంలో చిక్కుకున్నాయి.
Two Indian cities joined New Delhi to be among the world's worst 10 for pollution on Monday morning, with smoke heavy in the air a day after revelers let loose with firecrackers for Diwali - the annual Hindu festival of light https://t.co/8vqLtoHfpC
— Reuters (@Reuters) November 13, 2023
ఎయిర్ క్వాలిటీ ఇలా..
సోమవారం ఉదయం ఢిల్లీలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 420గా నమోదైంది. ఇది ప్రమాదకర కేటగిరీ కిందకి వస్తుంది. ఇక ఇదే జాబితాలో ఎయిర్ క్వాలిటీ సూచిక 196తో కోల్‌కతా నాలుగో స్థానంలో ఉంది. ఎయిర్ క్వాలిటీ సూచిక 163తో ముంబై 8వ స్థానంలో నిలిచింది.