download APAAR ID Card this way(X)

Hyd, March 07:  నూతన విద్యా విధానం (NEP) కింద కేంద్ర ప్రభుత్వం APAAR IDను ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. అపార్ అంటే Automated Permanent Academic Account Registry. ఇది విద్యార్థులకు ప్రత్యేకంగా ఇచ్చే యూనిక్ స్టూడెంట్ ఐడీ కార్డు. ఇందులో అకడమిక్ రికార్డులు డిజిటల్ రూపంలో భద్రంగా నిల్వ ఉంటాయి. ఈ ID ద్వారా విద్యార్థులు తమ సర్టిఫికేట్లను ఎక్కడికైనా తీసుకెళ్లాల్సిన అవసరం లేకుండా, ఒకే ఐడీలో రికార్డు పొందవచ్చు.

APAAR ID ద్వారా విద్యార్థుల అకడమిక్ రికార్డులు డిజిటల్ రూపంలో భద్రంగా ఉంటాయి. పాఠశాల నుండి పీజీ వరకు APAAR IDని ఇస్తారు. అపార్ ఐడీ (APAAR ID) విద్యార్థులకు మాత్రమే జారీ చేయబడుతుంది. మీరు APAAR ID కోసం ఇప్పటికే దరఖాస్తు చేసి ఉంటే, ఒక నిర్దిష్ట సమయానికి ఇది సిద్ధమవుతుంది.

 తమిళనాడులో బాల్యవివాహాం... కన్నీరు పెట్టిస్తున్న చిన్నారి పెళ్ళికూతురు రోదించే దృశ్యాలు.. అసలేం జరిగింది? (వీడియో)

అపార్ ఐడీని ఇలా డౌన్‌లో డ్ చేసుకోండి..ఈ స్టెప్స్ ఫాలో అవ్వండి:

()Academic Bank of Credits (ABC) వెబ్‌సైట్ను ఓపెన్ చేయండి.

()హోమ్‌స్క్రీన్‌లో డాష్‌బోర్డ్ లోకి వెళ్లండి.

()అక్కడ "Download APAAR Card" అనే ఆప్షన్ కనిపిస్తుంది, దాన్ని క్లిక్ చేయండి.

()"Download" లేదా "Print the Card" ఆప్షన్‌ను సెలెక్ట్ చేసి, డౌన్‌లోడ్ చేసుకోండి.

DigiLocker ద్వారా APAAR ID డౌన్‌లోడ్ చేయడం ఎలా?

మీరు DigiLocker యాప్‌ను ఉపయోగిస్తూ ABC వెబ్‌సైట్‌కు వెళ్లకుండా కూడా APAAR IDని డౌన్‌లోడ్ చేయవచ్చు.

()DigiLocker యాప్ ఓపెన్ చేయండి.

() "Education" అని సర్చ్ చేయండి (ఇంగ్లిష్‌లో టైప్ చేయాలి).

()**"Academic Bank of Credits"**ని సెలెక్ట్ చేయండి.

()"Create APAAR/ABC ID" పై క్లిక్ చేయండి.

()మీ స్కూల్ లేదా యూనివర్శిటీను ఎంపిక చేసి "Generate APAAR ID" పై క్లిక్ చేయండి.

()Documents సెక్షన్ లోకి వెళ్లి, మీ APAAR IDని డౌన్‌లోడ్ చేసుకోండి.

అపార్ కార్డుకు ఆధార్ కార్డుకు తేడా ఇదే.. ఆధార్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి ఇష్యూ చేయబడే ఓ గుర్తింపు కార్డు. APAAR ID: ఇది కేవలం విద్యార్థులకు మాత్రమే అందించబడే యూనిక్ స్టూడెంట్ ఐడి. ఆధార్‌ను ప్రధానంగా గుర్తింపు ధృవీకరణ కోసం ఉపయోగిస్తారు. అపార్ ఐడీని విద్యా సంబంధిత వివరాల కోసం ఉపయోగిస్తారు. అపార్ ఐడీ కార్డును విద్యార్థుల కోసం ప్రత్యేకంగా రూపొందించగా మీరు ఇప్పటికీ దరఖాస్తు చేసుకోని ఉంటే, ABC వెబ్‌సైట్ లేదా DigiLocker ద్వారా రిజిస్టర్ చేసుకోవచ్చు.