అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున పూణేలో రోడ్డుపై మద్యం మత్తులో యువకులు వీరంగం సృష్టించారు. బిఎండబ్ల్యూ కారు నుంచి మూత్ర విసర్జన చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది(Pune Viral Video).

ఈ వీడియోలో, యువకులలో ఒకరు రోడ్డుమధ్యే మూత్ర విసర్జన చేయగా, మరో వ్యక్తి కారులో కూర్చొని బీర్ బాటిల్ పట్టుకుని ఉన్నాడు. ఈ సంఘటన జరిగినప్పుడు ఆ ప్రాంతంలో మహిళలు కూడా ఉండగా ఇది స్థానికులకు ఆగ్రహం తెప్పించింది(Viral Video).

ఉత్తరప్రదేశ్‌లో షాకింగ్ దొంగతనం.. సీసీటీవీ ద్వారా పోలీసులకు సమాచారం ఇచ్చిన యజమాని, పట్టకున్న పోలీసులు, వీడియో ఇదిగో

అక్కడున్న స్థానికులు అతనిని అడ్డుకునే ప్రయత్నం చేయగా, ఆ యువకుడు మరింత అసభ్యంగా ప్రవర్తించాడు. ఇందుకు సంబంధించిన వీడియోను స్థానికులు చిత్రీకరించగా ఇది వైరల్‌గా మారింది. ఈ వీడియో పోలీసుల దృష్టికి వెళ్లగా వెంటనే విచారణ ప్రారంభించారు. కారుకు సంబంధించిన నంబర్ ప్లేట్ ఆధారంగా నిందితులను గుర్తించే పనిలో ఉన్నారు. ఇలాంటి చెత్త పనులు చేసే వారిని ఉపేక్షించమని.. వారిని పట్టుకుని బుద్ది చెబుతామని పోలీసులు వెల్లడించారు.

Drunk Men Stop Car in Middle of Road to Urinate,  Video Goes Viral

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)