యెమెన్ (Yemen)‌, జిబౌటీ (Djibouti) తీరాల మధ్య సముద్రంలో ఘోర పడవ ప్రమాదం చోటు చేసుకుంది.పొట్టకూటి కోసం దేశ విడిచి వెళ్తున్న 188 మంది బతుకులు తెల్లారిపోయాయి. ఉపాధి కోసం వెళ్తున్న కూలీలను తీసుకెళ్తున్న నాలుగు పడవలు (Four boats) మార్గమధ్యలో మునిగిపోయాయి. దాంతో ఆ పడవల్లో ప్రయాణిస్తున్న 188 మంది గల్లంతయ్యారు.

ఈ విషయాన్ని ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్‌ ఫర్‌ మైగ్రేషన్‌ మీడియాకు తెలిపింది.సమాచారం అందిన వెంటనే రెస్క్యూ టీమ్స్‌ రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టాయి. గల్లంతైన వారి జాడ కోసం ముమ్మరంగా గాలిస్తున్నాయి.ఈ మార్గంలో గత జనవరిలో కూడా ఇదే తరహా ప్రమాదం జరిగింది. యెమెన్‌ తీరంలో పడవ మునిగి 20 మంది ఇథియోపియన్స్‌ ప్రాణాలు కోల్పోయారు. అదేవిధంగా 2024 ఏడాదిలో మొత్తం 558 మంది ఈ మార్గంలో మరణించారు.

ఎలాన్‌ మస్క్‌కు మరో షాక్.. పేలిన స్పేస్ ఎక్స్ స్టార్‌షిప్ రాకెట్, జనాలున్న స్థలాల్లోనే పడిన శకలాలు, వీడియో ఇదిగో

migrant boats capsize off Yemen and Djibouti

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)