గల్ఫ్ ఆఫ్ ఏడెన్‌లోని వాణిజ్య నౌకపై యెమెన్‌కు చెందిన హౌతీ తిరుగుబాటుదారులు బుధవారం జరిపిన క్షిపణి దాడిలో (Houthi missile) ముగ్గురు సిబ్బంది మరణించారు. ప్రాణాలతో బయటపడినవారు ఓడను విడిచిపెట్టవలసి వచ్చింది. వారిని కాపాడేందుకు అత్యంత క్లిష్టపరిస్థితుల్లో రెస్క్యూ ఆపరేషన్‌ (Indian Navy rescues) నిర్వహించి పలువురిని భారత యుద్ద నౌక కాపాడింది.

నౌకలపై హౌతీ రెబల్స్ దాడిలో ముగ్గురు మృతి, దాడులకు ప్రతీకారం తీర్చుకున్న అమెరికా, యెమెన్‌ భూభాగంపై క్షిపణులతో విరుచుకుపడిన అగ్రరాజ్యం

శరవేగంగా స్పందించిన ఐఎన్‌ఎస్‌ కోల్‌కతా.. 21 మందిని రక్షించడంతో పాటు వాళ్లకు అత్యవసర చికిత్సను సైతం అందించింది.వీరిలో ఒక భారతీయుడు కూడా ఉన్నారు. ఈ వివరాలను భారత నేవీ తన ఎక్స్‌ ఖాతాలో వెల్లడించింది.ఇందుకోసం ఐఎన్‌ఎస్‌లోని హెలికాప్టర్‌, బోట్ల సర్వీసులను ఉపయోగించినట్లు తెలిపింది. నేవీ రక్షించిన వాళ్లలో.. ఓ భారతీయుడు కూడా ఉన్నాడట. మరోవైపు గత కొన్నివారాలుగా పశ్చిమ హిందూ మహాసముద్రంలో భారత నావికా దళం వాణిజ్య నౌకలకు రక్షణగా తన వంతు పహరా కాస్తోంది.

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)