ఎర్ర సముద్రం (Red Sea) మీదుగా రాకపోకలు సాగించే వాణిజ్య నౌకలను టార్గెట్ చేస్తున్న యెమెన్‌ (Yemen)లోని హౌతీ (Houthis) తిరుగుబాటుదారులు మరో సారి రెచ్చిపోయారు. అగ్రరాజ్యం అమెరికాకు చెందిన రెండు నౌకలపై (two US warships) మంగళవారం డ్రోన్లతో దాడి (Drone Attacks) చేశారు. రెడ్‌ సీలో యూఎస్‌కు చెందిన రెండు నౌకలపై దాడి చేసినట్లు హౌతీ మిలిటరీ గ్రూప్‌ స్పోక్స్‌పర్సన్‌ యహ్యా సరెయ తెలిపారు. నావికాదళ క్షిపణులు, డ్రోన్ల (naval missiles drones) సాయంతో రెండు యూఎస్‌ వార్‌షిప్‌ డిస్ట్రాయర్‌లపై దాడులు చేసినట్లు ఓ టెలివిజన్‌ ఛానల్‌తో మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించారు.  విమానం గాల్లో ఉండగా ఉరుములు మెరుపులు దాడి, సోషల్ మీడియాలో వీడియో వైరల్

Here's ANI News

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)