Red Sea Crisis (Photo Credit- ANI)

దుబాయ్, మార్చి 7: గల్ఫ్ ఆఫ్ ఏడెన్‌లోని వాణిజ్య నౌకపై యెమెన్‌కు చెందిన హౌతీ తిరుగుబాటుదారులు బుధవారం జరిపిన క్షిపణి దాడిలో ముగ్గురు సిబ్బంది మరణించారు. ప్రాణాలతో బయటపడినవారు ఓడను విడిచిపెట్టవలసి వచ్చింది. గాజా స్ట్రిప్‌లో హమాస్‌పై ఇజ్రాయెల్ చేస్తున్న యుద్ధంపై ఇరాన్-మద్దతుగల సమూహం చేసిన దాడుల ప్రచారంలో ఇది మొదటి ఘోరమైన దాడి.

గల్ఫ్‌ ఆఫ్‌ ఏడెన్‌లో బార్బడోస్‌కు చెందిన ట్రూ కాన్ఫిడెన్స్‌ అనే వాణిజ్య నౌకపై హౌతీలు దాడి జరిపారు. ముగ్గురు మరణించగా ఆరుగురు గాయపడ్డారు. నౌకలోని ఇతర సిబ్బంది నౌకను వదిలేసి లైఫ్‌ బోట్లలో పారిపోయారు. అంతకుముందు తమ నౌకలపై హౌతీలు ప్రయోగించిన డ్రోన్స్‌, మిస్సైల్స్‌ను యూఎస్‌ డిస్ట్రాయర్‌ కూల్చివేసింది. ఎర్ర సముద్రంలో రెండు అమెరికా నౌకలను డ్రోన్లతో పేల్చేసిన హౌతీ తిరుగుబాటు దారులు

తమ యుద్ధనౌకలపైకి హౌతీ రెబెల్స్‌ నౌక మిస్సైళ్లు, డ్రోన్లను ప్రయోగించడంతో అమెరికా విధ్వంసక నౌకలు రెచ్చిపోయాయి. హౌతీలు ఉంటున్న యెమెన్‌ భూభాగంపై దాడి చేసి హౌతీ క్షిపణులు, డ్రోన్లను ధ్వంసంచేసింది. హౌతీల దాడుల్లో మరణాలు నమోదవడంతో ఆసియా, మధ్యప్రాచ్యం, ఐరోపాల మధ్య సముద్ర రవాణా రంగంలో సంక్షోభం మరింత ముదిరింది. హౌతీలపై అమెరికా దాడులపై ఇరాన్‌ మండిపడింది. అమెరికా ఇంధన సంస్థ షెవ్రాన్‌ కార్ప్‌కు చేరాల్సిన కువైట్‌ చమురును తోడేస్తామని హెచ్చరించింది. రూ.414 కోట్ల విలువైన ఆ చమురును తీసుకెళ్తున్న నౌకను ఇరాన్‌ గతేడాది హైజాక్‌ చేసి తమ వద్దే ఉంచుకుంది. విమానం గాల్లో ఉండగా ఉరుములు మెరుపులు దాడి, సోషల్ మీడియాలో వీడియో వైరల్

క్షిపణి దాడుల తర్వాత గాయాలతో ఉన్నవారికి కాపాడేందుకు భారత యుద్ధనౌక ఐఎన్‌ఎస్‌ కోల్‌కతా శరవేగంగా స్పందించింది. 21 మందిని రక్షించడంతో పాటు వాళ్లకు అత్యవసర చికిత్సను సైతం అందించింది. ఈ వివరాలను భారత నేవీ తన ఎక్స్‌ ఖాతాలో వెల్లడించింది. ఇందుకోసం ఐఎన్‌ఎస్‌లోని హెలికాప్టర్‌, బోట్ల సర్వీసులను ఉపయోగించినట్లు తెలిపింది. నేవీ రక్షించిన వాళ్లలో.. ఓ భారతీయుడు కూడా ఉన్నాడట. మరోవైపు గత కొన్నివారాలుగా పశ్చిమ హిందూ మహాసముద్రంలో భారత నావికా దళం వాణిజ్య నౌకలకు రక్షణగా తన వంతు పహరా కాస్తోంది.