Child fallen (Image Credits: China Xinhua News)

Beijing, August 4: నడి రోడ్డుపై ఏం జరిగినా పట్టించుకునే వారే కరువయ్యారు ఈరోజుల్లో. యాక్సిడెంట్‌ (Accident) జరిగిన అదే దారిలో వచ్చే వాహనదారుడు ఆగడం గానీ సాయం కానీ చేయరు. పైగా పోలీసు (Police) కేసులు అవి ఉంటాయన్న భయంతో ముందుకు రావడానికే జంకుతారు. అయితే, చైనా (China)లో ఇటీవల జరిగిన ఓ ఘటన మానవత్వానికి మచ్చుతునకలా మారి.. నెటిజన్ల మనసును దోచుకుంటున్నది.

సీతారామం ఫంక్షన్ లో డార్లింగ్ ప్రభాస్ సందడి.. థియేటర్లను దేవాలయాలతో పోల్చిన బాహుబలి.. ఎందుకు?

చైనాలోని నిగ్‌బో ప్రాంతంలోని ఒక రద్దీ రోడ్డు పై ట్రాఫిక్‌ సిగ్నల్‌ (Traffic signal) పడటంతో పలు వాహానాలు ఒక్కసారిగా ఆగిపోతాయి. ఇంతలో ఒక చిన్నారి కారు విండోలోంచి అనుహ్యంగా జారి పడిపోతుంది. పాప కిందపడే సమయంలో సిగ్నల్‌ పడటంతో  వాహనాలన్ని కదిలిపోతాయి. పాప (Child) పడిపోయిన విషయాన్ని గమనించకుండా కుటుంబ సభ్యులు కూడా కారులో  అలాగే వెళ్తారు. కిందపడటంతో దెబ్బ తగిలి ఆ చిన్నారి రోడ్డుపైనే ఏడుస్తూ ఉంటుంది. ఇంతలో వెనుక నుంచి వేగంగా దూసుకువస్తున్నవాహానాలన్ని పాపను చూసి ఒక్కసారిగా ఆగిపోతాయి. అంతేకాదు ఇద్దరు ముగ్గురు వాహానదారులు సదరు చిన్నారి వద్దకు రావడానికి ప్రయత్నిస్తారు. అందులో ఒకతను పాపను ఎత్తకుని రోడ్డు పక్కకు తీసుకువచ్చి సపర్యలు  చేస్తాడు. ప్రస్తుతం ఈ వీడియో (Video) ఇంటర్నెట్ ను షేక్ చేస్తుంది. వాహనదారుల పెద్దమనసుకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు.