Newdelhi, Mar 24: సింధూరం (బొట్టు) పెట్టుకోవడం హిందూ వివాహిత బాధ్యత (Wearing 'Sindoor' Religious Duty) అని, అది పెట్టుకుంటే వివాహితగా సమాజానికి తెలుస్తుందని మధ్యప్రదేశ్‌లోని (Madhyapradesh) ఇండోర్ ఫ్యామిలీ కోర్టు పేర్కొన్నది. ఇండోర్ కు చెందిన దంపతులకు 2017లో వివాహం జరిగింది. వారికి ఐదేండ్ల కుమారుడు ఉన్నాడు. అయితే ఐదేండ్ల క్రితం తన భార్య తనను వదిలి వెళ్లిందని, ఆమె మళ్లీ తనతో కలిసి ఉండేలా ఆదేశాలు ఇవ్వాలని భర్త కోర్టుకెక్కాడు. ఈ పిటిషన్‌ను విచారించిన ఇండోర్ ఫ్యామిలీ కోర్టు.. మహిళ కోర్టులో స్టేట్‌మెంట్ ఇచ్చినప్పుడు సింధూరం పెట్టుకోవడం లేదని పేర్కొంటూ దానిపై అభ్యంతరం వ్యక్తం చేసింది. సింధూరం పెట్టుకోవడం హిందూ వివాహిత బాధ్యత అని గుర్తుచేసింది.
Wearing sindoor is duty of married Hindu women, says Madhya Pradesh court https://t.co/uWnKmq8Ghc
— Scroll.in (@scroll_in) March 24, 2024
భర్త దగ్గరికే వెళ్లాలి
తన భర్త కట్నం కోసం శారీరకంగా, మానసికంగా వేధిస్తున్నారని ఆమె ఆరోపించినప్పటికీ ఇందుకు ఆధారాలు లేవని కోర్టు తేల్చి చెప్పింది. దీంతో సదరు మహిళ వెంటనే తన భర్త ఇంటికి తిరిగి వెళ్లాలని తీర్పు చెప్పింది.