F-35B Plane Crash: విమానాన్ని హెలికాప్టర్‌లా ల్యాండ్ చేయాలనుకున్నాడు.. అయితే, అది కుప్పకూలి గింగిరాలు తిరిగింది.. వీడియో ఇదిగో!
విమానాన్ని హెలికాప్టర్‌లా ల్యాండ్ చేసేందుకు ఆ పైలెట్ ప్రయత్నించాడు. అయితే, చూస్తుండగానే ఆ ఫైటర్ జెట్ కుప్పకూలిపోయింది. దీంతో పైలట్ అప్రమత్తమై, చాకచక్యంగా తప్పించుకుని ప్రాణాలతో బయటపడ్డాడు. అమెరికాలోని టెక్సాస్‌లో జరిగిందీ ఘటన.
Newyork, Dec 17: విమానాన్ని (Plane) హెలికాప్టర్‌లా ల్యాండ్ (Helicopter Landing) చేసేందుకు ఆ పైలెట్ (Pilot) ప్రయత్నించాడు. అయితే, చూస్తుండగానే ఆ ఫైటర్ జెట్ (Fighter Jet) కుప్పకూలిపోయింది. దీంతో పైలట్ అప్రమత్తమై, చాకచక్యంగా తప్పించుకుని ప్రాణాలతో బయటపడ్డాడు. అమెరికాలోని (America) టెక్సాస్‌లో (Texas) జరిగిందీ ఘటన. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
వైరల్ అవుతున్న వీడియో ప్రకారం.. టెక్సాస్ ఎయిర్‌స్టేషన్‌లో రన్‌వేపై దిగేందుకు ఎఫ్ 35 బి విమానం సిద్ధమవుతోంది. నెమ్మదిగా ల్యాండ్ అవుతున్నట్టు కనిపిస్తున్న విమానాన్ని హెలికాప్టర్‌లా ల్యాండ్ చేసేందుకు పైలట్ ప్రయత్నించినట్టు వీడియోను బట్టి అర్థమవుతోంది. ఈ క్రమంలో విమానం చక్రాలు నేలను తాకడానికి ముందే అదుపుతప్పి ముందుభాగం నేలను ఢీకొని గింగిరాలు తిరిగింది. ప్రమాదాన్నిశంకించిన పైలట్ పారాచూట్ సాయంతో చాకచక్యంగా బయటపడ్డాడు.
FORT WORTH, Texas - An F-35B Lightning fighter jet from Lockheed Martin crashed during a test flight on Thursday morning.
The incident occurred around 10:15 a.m. on Naval Air Station Joint Reserve Base Fort Worth and Lockheed property. pic.twitter.com/OUihxqOKVu
— Denn Dunham (@DennD68) December 15, 2022
(The above story first appeared on LatestLY on Dec 17, 2022 09:18 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

