పవన్ కల్యాణ్‌ హీరోగా జ్యోతికృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో తెరకెక్కుతున్న కొత్త సినిమా 'హరిహర వీరమల్లు'. ప్ర‌స్తుతం ఈ సినిమా చివరి దశ షూటింగ్ జరుపుకుంటోంది. ఈ మూవీ కోసం ప‌వ‌న్‌ కళ్యాణ్ అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రం 2025 మార్చి 28న విడుదల చేస్తున్న‌ట్లు మేక‌ర్స్‌ ఇప్ప‌టికే ప్రకటించారు. అయితే మేకర్స్ నేడు బాలీవుట్ నటుడు బాబీ డియోల్ బర్త్ డే సందర్భంగా ఈ సినిమా నుంచి ఓ కొత్త పోస్టర్ రిలీజ్ చేశారు.

సింహాన్ని లాక్‌ చేశా.. మహేశ్‌తో మూవీపై అదిరే అప్‌డేట్ ఇచ్చిన రాజమౌళి.. ఒక్కసారి కమిట్‌ అయితే నా మాట నేనే విననన్న మహేశ్‌ బాబు

ఈ సినిమాలో విలన్ పాత్రలో నటిస్తున్న బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ పుట్టినరోజు సందర్భంగా, ఆయనకు బర్త్‌డే విషెస్‌ తెలియజేస్తూ ఫస్ట్ లుక్ పోస్ట‌ర్‌ను రిలీజ్‌ చేశారు. పోస్ట‌ర్‌లో బాబీ చూడ‌గానే ఆక‌ట్టుకునేలా క‌త్తిప‌ట్టుకుని గంభీరంగా క‌నిపిస్తున్నారు. కాగా, ఈ చిత్రం నుంచి ఇటీవ‌లే పవన్ కళ్యాణ్ స్వ‌యంగా ఆల‌పించిన 'మాట వినాలి' అంటూ సాగే పాట‌ను విడుద‌ల చేశారు మేక‌ర్స్‌. ఆస్కార్ అవార్డు విజేత ఎంఎం కీర‌వాణి సంగీతం అందిస్తున్న ఈ మూవీలో ప‌వ‌ర్ స్టార్ స‌ర‌స‌న క‌థానాయిక‌గా నిధి అగ‌ర్వాల్ న‌టిస్తున్నారు.

Hari Hara Veera Mallu New Poster

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)