అదానీ ఎక్స్ పోర్ట్స్ లిమిటెడ్ ఎండీ రాజేశ్ అదానీ, అదానీ పోర్ట్స్, సెజ్ లిమిటెడ్ ఎండీ కరణ్ అదానీ నేడు ఏపీ సీఎం చంద్రబాబును కలిశారు. ఏపీలో పెట్టుబడులకు గల అవకాశాలపై వారు చర్చించారు. పోర్టులు, మైనింగ్, రింగ్ రోడ్, ఐటీ, టూరిజం, ఏఐ వంటి కీలక రంగాల్లో రాష్ట్రవ్యాప్తంగా సమగ్ర అభివృద్ధికి తోడ్పాటు అందించే ప్రాజెక్టుల ఏర్పాటుపై వారు సీఎంకు ప్రజంటేషన్ ఇచ్చారు.
అంతేకాకుండా, అమరావతి పునర్ నిర్మాణానికి కట్టుబడి ఉంటామని, స్వర్ణాంధ్ర ప్రదేశ్ విజన్ సాకారం చేసేందుకు తమవంతు సహకారం అందిస్తామని వారు హామీ ఇచ్చారు. ఈ మేరకు అదానీలతో సమావేశంపై చంద్రబాబు సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.
Here's CM Chandrababu Tweet
Met with a delegation from the Adani Group led by the MD of Adani Exports Ltd., Mr Rajesh Adani, and the MD of Adani Ports and SEZ Ltd., Mr @AdaniKaran, to discuss a range of investment opportunities in Andhra Pradesh. Their presentation covered projects with the potential to…
— N Chandrababu Naidu (@ncbn) October 28, 2024
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)