ఉత్తరాఖండ్‌లో అల్మోరాలో ప్రయాణికులతో వెళ్తున్న బస్సు అదుపుతప్పి లోయలో పడింది. దీంతో 20మంది ప్రయాణికులు మృతిచెందగా, మరో 20మంది తీవ్రంగా గాయపడినట్లు పోలీసులు వెల్లడించారు. ఓవర్‌లోడ్‌ కారణంగా బస్సు లోయలో పడి ఉంటుందని పోలీసులు అనుమానం వ్యక్తంచేస్తున్నారు. సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయని, క్షతగాత్రులను ఆసుపత్రికి తరలిస్తున్నామని పేర్కొన్నారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ ఘటనపై ఉత్తరాఖండ్‌ సీఎం పుష్కర్‌ సింగ్‌ ధామి స్పందిస్తూ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. వేగంగా సహాయక చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. తీవ్రంగా గాయపడిన ప్రయాణికులను ఎయిర్‌లిఫ్ట్‌ చేయాలని సూచించారు.

 విద్యుత్ షాక్‌ తో న‌లుగురి మృతి.. ఫ్లెక్సీలు క‌డుతున్న స‌మ‌యంలో ఘటన.. ఏపీలోని తూర్పు గోదావ‌రి జిల్లాలో విషాద ఘ‌ట‌న‌

Death Toll Rises to 20 After Bus Plunges Into Gorge

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)