Image used for representational purpose | (Photo Credits: PTI)

Vijayawada, Nov 4: ఏపీలోని (AP) తూర్పు గోదావ‌రి జిల్లాలో ఘోరం జరిగింది. విద్యుత్ షాక్‌ తో (Electric Shock) న‌లుగురు యువకులు ప్రాణాలు కోల్పోయారు. జిల్లాలోని ఉండ్రాజ‌వ‌రం మండ‌లం తాడిప‌ర్రు గ్రామంలో పాప‌న్న గౌడ్ విగ్ర‌హావిష్క‌ర‌ణ కార్య‌క్ర‌మం కోసం ఫ్లెక్సీలు క‌డుతున్న స‌మ‌యంలో ఈ విషాద‌ ఘ‌ట‌న జ‌రిగింది. ఫ్లెక్సీలు క‌డుతున్న స‌మ‌యంలో న‌లుగురు యువ‌కులు కృష్ణ‌, నాగేంద్ర‌, మ‌ణికంఠ‌, వీర్రాజు షాక్ తగిలి మృతిచెంద‌గా.. మ‌రొక‌రి ప‌రిస్థితి అత్యంత విష‌మంగా ఉన్న‌ట్లు స‌మాచారం.

టెట్ కు సంబంధించి నేడు రెండు కీలక పరిణామాలు.. మరికాసేపట్లో ఏపీ టెట్‌ ఫలితాలు వచ్చేస్తున్నాయ్‌.. ఇక, నేడే తెలంగాణ టెట్‌ నోటిఫికేషన్‌ విడుదల

ప్రమాదం అలా..

స్థానికుల స‌మాచారంతో ఘ‌టనాస్థ‌లికి చేరుకున్న పోలీసులు మృత‌దేహాల‌ను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం కోసం స్థానికి ప్ర‌భుత్వ ఆసుప‌త్రికి త‌ర‌లించారు. ఫ్లెక్సీలు క‌డుతున్న స‌మ‌యంలో పైన ఉన్న‌ హైటెన్ష‌న్ వైర్లు త‌గులడంతో ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తున్నది.

శ్రీ‌న‌గ‌ర్ మార్కెట్లో ఉగ్ర‌వాదుల దుశ్చ‌ర్య‌, ప్ర‌జ‌ల పైకి గ్ర‌నేడ్ విసిరిన ఉగ్ర‌వాదులు, 12 మందికి గాయాలు