విజయవాడలో జరిగిన కొసరాజు వారి (Kosaraju vari) ఆత్మీయ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ మాజీ డీజీపీ ఏబీ వెంకటేశ్వరరావు (AB Venkateswara Rao) వైఎస్ జగన్ మీద సంచలన వ్యాఖ్యలు చేశారు. 2004లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి (YS Rajasekhar Reddy) అధికారంలోకి వచ్చి కమ్మ వ్యతిరేక పాలసీని తెచ్చి దాన్ని స్టేట్ పాలసీగా మార్చేశారన్నారు. 30 ఏళ్ల సర్వీసులో కేవలం 10 నుంచి 15 ఏళ్లు మాత్రమే సక్రమమైన పోస్టుల్లో పని చేసినట్లు తెలిపారు. వైఎస్ఆర్ నాటిన విత్తనం 2019 నాటికి విష వృక్షంగా మారిందని ఘాటు విమర్శలు చేశారు.

నారా లోకేశ్‌ని డిప్యూటీ సీఎం చేయాలని డిమాండ్, జనసేన ఎదురుదాడితో దిద్దుబాటు చర్యలకు దిగిన టీడీపీ అధిష్ఠానం, అధికార ప్రతినిధులకు కీలక ఆదేశాలు జారీ

అప్పటి నుంచి కమ్మ అధికారులను టార్గెట్ చేసి అణచివేతకు గురి చేశారంటూ ఆయన ఆరోపించారు. 2019లో అధికారంలోకి వచ్చిన మర్నాడే వైఎస్ జగన్ తనకు ఉద్యోగం లేకుండా చేశారని, పోస్టింగ్, జీతం అడిగితే సస్పెండ్ చేశారని అన్నారు. 2004 నుంచి రాజకీయాలు కమ్మవారిని కాపాడలేకపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కమ్మవారి పట్ల సానుభూతి, అభిమానం ఉన్నా.. కాపాడేందుకు రాజకీయ పార్టీలు ముందుకు రావని చెప్పుకొచ్చారు.

AB Venkateswara Rao Slams YS Jagan

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)