ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు న్యూఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, విదేశాంగ మంత్రి జైశంకర్‌తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారితో రాష్ట్రాభివృద్ధికి సంబంధించిన పలు కీలక అంశాలు చర్చించారు.ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో భేటీలో రాజధాని అమరావతికి ప్రపంచబ్యాంకు, ఏడీబీ ఇస్తున్న రూ.15వేల కోట్ల రుణం తదితర అంశాలపై చంద్రబాబు చర్చించినట్టు సమాచారం.
నిర్మలా సీతారామన్‌తో భేటీ ముగిసిన తర్వాత విదేశాంగశాఖ మంత్రి జై శంకర్‌తో సీఎం సమావేశమయ్యారు. ఈ సమావేశంలో గోదావరి-పెన్నార్ నదుల అనుసంధానం, అమరావతి రాజధాని నిర్మాణంలో సింగపూర్ భాగస్వామ్యాన్ని పునరుద్ధరించడం, పోలవరాన్ని శరవేగంగా పూర్తి చేయడంపై ప్రతిపాదన వంటివి చర్చకు వచ్చాయి. కేంద్రం ఆమోదం తెలిపినట్లుగా సమాచారం.
CM Chandrababu Delhi Tour
#AndhraPradesh-----
Centre has agreed with CM @ncbn's proposal on the interlinking of the Godavari and the Pennar rivers, reviving Singapore's partnership in the construction of the capital city of Amaravati and completing the Polavaram on a fast pace.
The Chief Minister… pic.twitter.com/Lx8ASA1FQE
— NewsMeter (@NewsMeter_In) November 15, 2024
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)