Nana Patole Resigns: మహారాష్ట్ర కాంగ్రెస్ పీసీసీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన నానా పటోలే, ఘోర ఓటమికి బాధ్యత వహిస్తూ తప్పుకుంటున్నట్లు వెల్లడి

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ (Congress) పార్టీ ఘోర పరాజయం నేపథ్యంలో మహారాష్ట్ర పీసీసీ చీఫ్‌ (Maharashtra Congress chief) నానా పటోల్‌ (Nana Patole) తన పదవికి రాజీనామా చేశారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఓటమికి బాధ్యత వహిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నారు.

Nana Patole Resigns: మహారాష్ట్ర కాంగ్రెస్ పీసీసీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన నానా పటోలే, ఘోర ఓటమికి బాధ్యత వహిస్తూ తప్పుకుంటున్నట్లు వెల్లడి
Maharashtra Congress President Nana Patole (Photo Credits: File Photo)

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ (Congress) పార్టీ ఘోర పరాజయం నేపథ్యంలో మహారాష్ట్ర పీసీసీ చీఫ్‌ (Maharashtra Congress chief) నానా పటోల్‌ (Nana Patole) తన పదవికి రాజీనామా చేశారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఓటమికి బాధ్యత వహిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు రాజీనామా పత్రాన్ని హైకమాండ్‌కు పంపారు.

మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలు, కాషాయ సునామిలో ప్రతిపక్ష హోదా కోల్పోయిన కాంగ్రెస్, ఏ పార్టీకి ఎన్ని సీట్లు వచ్చాయంటే..

2021లో నానా పటోల్‌ మహారాష్ట్ర కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. ఈ ఏడాది ప్రారంభంలో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఆయన నాయకత్వంలో కాంగ్రెస్ 17 స్థానాల్లో పోటీ చేసి ఏకంగా 13 స్థానాల్లో గెలుపొందిన విషయం తెలిసిందే.తాజా ఎన్నికల్లో ప్రతిపక్ష మహావికాస్‌ అఘాడీ (Maha Vikas Aghadi) కూటమి కేవలం 51 చోట్ల మాత్రమే విజయం సాధించింది. ఇక కూటమిలో భాగంగా 101 స్థానాల్లో పోటీ చేసిన కాంగ్రెస్‌ కేవలం 16 స్థానాల్లో మాత్రమే గెలుపొందింది.

Nana Patole Resigns As Maharashtra Congress President 

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on Nov 25, 2024 12:43 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).