కేరళలో ర్యాగింగ్ భూతం కలకలం రేపింది. కొట్టాయంలో ప్రభుత్వ నర్సింగ్ కాలేజీలో సీనియర్ విద్యార్థులు జూనియర్లపై దారుణంగా ర్యాగింగ్ కు పాల్పడ్డారు. బాధితుల్ని నగ్నంగా నిలబెట్టి గాయపరచడంతో పాటు వాటిపై కారం పూయడం వంటివి చేశారు. ఆ మంటలకు వారు విలవిల్లాడుతుంటే వీడియోలు తీసి పైశాచికానందం పొందారు. అంతర్గత అవయవాలకు డంబెల్స్‌ను వేలాడదీయడం వంటి వికృత చేష్టలకు దిగారు.
తాము ర్యాగింగ్ చేస్తున్నామని ఫిర్యాదు చేస్తే మీకు చదువును దూరం చేస్తామని బాధిత విద్యార్థుల్ని బెదిరింపులకు దిగారు. దాదాపు నాలుగు నెలల పాటు సీనియర్లు వేధింపులకు గురి చేశారు. అయితే దారుణం తట్టుకోలేక ఓ బాధిత విద్యార్థి ధైర్యం చేసి కాలేజీలో జరిగిన దారుణం తన తల్లిదండ్రులకు చెప్పడంతో వెలుగులోకి వచ్చింది. తండ్రి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు సీనియర్ విద్యార్థుల్ని అదుపులోకి తీసుకున్నారు.
పోలీసు కస్టడీలో ఉన్న విద్యార్థుల్ని మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. మందుకు డబ్బులు ఇవ్వలేదనే కోపంతోనే ఇలా అత్యంత కిరాతంగా ర్యాగింగ్ కు పాల్పడినట్లు తెలుస్తోంది. గతేడాది నవంబర్‌లో మూడో సంవత్సరం నర్సింగ్ చదువుతున్న ఐదుగురు విద్యార్థులు.. తిరువనంతపురంకు చెందిన ముగ్గురు విద్యార్థుల్ని ర్యాగింగ్ పేరుతో వేధింపులకు గురి చేశారు. ఇదితాజాగా వెలుగులోకి వచ్చింది.
Ragging Horror At Kerala Medical College
#WATCH | Kottayam, Kerala | The police have arrested five college students for allegedly ragging juniors at Kottayam Government Nursing College. All the students have been sent to 2 days police remand: Gandhinagar Police, Kottayam https://t.co/o1zmXJa9jF pic.twitter.com/g7MNAWKqnp
— ANI (@ANI) February 12, 2025
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)