సుప్రీంకోర్టు 51వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సంజీవ్ ఖన్నా నేడు ప్రమాణ స్వీకారం చేశారు. జస్టిస్ డీవై చంద్రచూడ్ పదవీ కాలం నిన్నటితో ముగిసిన విషయం తెలిసిందే. దీంతో తదుపరి సీజేఐగా సంజీవ్ ఖన్నా ఇవాళ ప్రమాణ స్వీకారం చేశారు. జస్టిస్ సంజీవ్ ఖన్నాతో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణం చేయించారు. ఈ ప్రమాణస్వీకార కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్, మాజీ సీజేఐ ఎన్వీరమణ తదితరులు పాల్గొన్నారు. వచ్చే ఏడాది మే 13వ తేదీ వరకు సీజేఐగా జస్టిస్ సంజీవ్ ఖన్నా కొనసాగనున్నారు. ఎన్నికల బాండ్లు, ఈవీఎంలు, ఆర్టికల్ 370 తదితర కేసుల్లో జస్టిస్ సంజీవ్ ఖన్నా కీలక తీర్పులిచ్చారు.
Sanjiv Khanna Becomes 51st CJI:
LIVE: Swearing-in-Ceremony of the Chief Justice of India Shri Justice Sanjiv Khanna at Rashtrapati Bhavan https://t.co/zC6Dj1gWS0
— President of India (@rashtrapatibhvn) November 11, 2024
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)