బోర్డ‌ర్‌-గ‌వాస్క‌ర్ ట్రోఫీ (బీజీటీ) సిరీస్‌లో భాగంగా సిడ్నీ వేదిక‌గా జ‌రుగుతున్న ఆఖ‌రిదైన ఐదో టెస్టులో టీమిండియా తొలి ఇన్నింగ్స్ లో 185 పరుగులకే ఆలౌట్ అయింది. ఈ రోజు మ్యాచ్‌లో రిష‌భ్ పంత్‌ 40 ప‌రుగుల‌తో మ‌నోడు టాప్ స్కోర‌ర్‌గా నిలిచాడు. ఆసీస్ బౌల‌ర్ల నుంచి దూసుకొచ్చిన ప‌దునైన బంతులు అత‌ని శ‌రీరానికి బ‌లంగా త‌గిలాయి. పేస‌ర్ మిచెల్ స్టార్క్ విసిరిన బంతి పంత్ మోచేతిపైన తాక‌డంతో వెంట‌నే వాపు వ‌చ్చేసింది. ఆ నొప్పితో పంత్ విల‌విల‌లాడాడు. బంతి తగిలిన చోట పెద్ద‌ మ‌చ్చ‌లా ఏర్ప‌డింది. వెంట‌నే సిబ్బంది వ‌చ్చి చికిత్స అందించారు. ఆ త‌ర్వాత పంత్ తిరిగి ఆట‌ను కొన‌సాగించాడు.

రిష‌భ్ పంత్‌ భారీ సిక్స్‌ వీడియో ఇదిగో, నిచ్చెనెక్కి బంతిని తీసిన గ్రౌండ్ స్టాఫ్, టీమిండియా తొలి ఇన్నింగ్స్ లో 185 పరుగులకే ఆలౌట్

Rishabh Pant Suffers Bruise On His Bicep After Being Hit by Mitchell Starc's Fiery Delivery 

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)