ఒడిశాలోని కేంద్రపడ జిల్లా పరిధిలోని గహీర్‌మఠ సముద్ర తీరానికి 12 రోజుల వ్యవధిలో సుమారు 7 లక్షల ఆలివ్‌ రిడ్లే తాబేళ్లు వచ్చాయి. గుడ్లు పెట్టే సీజన్ కావడంతో లక్షలాదిగా తాబేళ్లు Rushikulya Beach కు చేరుకున్నాయి. అట్లాంటిక్, పసిఫిక్, హిందూ మహాసముద్రాల నుంచి ఇవి వేల కిలోమీటర్ల ప్రయాణం చేసి ఏటా ఈ తీరానికి (Sea Turtles in Rushikulya Beach) వచ్చాయని భారత మత్స్య పరిశోధన సంస్థ(ఎఫ్‌ఎస్‌ఐ) శాస్త్రవేత్త జీవీఏ ప్రసాద్‌ వివరించారు.

హైదరాబాద్ కుషాయిగూడలో దారుణం.. కన్నతండ్రిని దారుణంగా హత్య చేసిన కొడుకు, 15 సార్లు కత్తితో పొడిచి కిరాతకంగా హతమార్చిన వైనం, వీడియో

గహీర్ మఠ తీరం సురక్షితమని భావించి ఇక్కడికి ఏటా వస్తాయన్నారు. వెన్నెల రాత్రుల్లో ఇవి తీరంలో గుడ్లు పెడతాయని చెప్పారు. ఒక్కో తాబేలు 50 నుంచి 100 గుడ్లు పెడుతుందని తెలిపారు. కాగా, ఏటా ఈ సీజన్ లో వచ్చే ఈ ప్రత్యేక అతిథుల కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేసిందని అధికారులు తెలిపారు. తీరంలో చేపల వేటను నిషేధించడంతో పాటు పర్యాటకులను నియంత్రిస్తున్నట్లు వివరించారు. తీరంలో తాబేళ్లు పెట్టే గుడ్లను పరిరక్షించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. నవంబరు నుంచి మార్చి నెలాఖరు వరకు తాబేళ్లు గుడ్లు పెట్టే సమయం. అందుకే అప్పుడు తీరంలో చేపల వేటను ప్రభుత్వం నిషేధించింది. మరో 3 లక్షల తాబేళ్లు రావచ్చు’ అని ప్రసాద్‌ వివరించారు.

Sea Turtles in Rushikulya Beach:

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)