T20 ప్రపంచ కప్ 2024 గెలిచిన తర్వాత T20 ఇంటర్నేషనల్స్ నుండి రిటైర్ అయిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ టెస్ట్ క్రికెట్ నుండి కూడా రిటైర్ అవుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. 2024-25 సిడ్నీలో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ఆఖరి టెస్ట్ తర్వాత ఈ ప్రకటన చేసే అవకాశం ఉంది. టైమ్స్ ఆఫ్ ఇండియా (TOI) నుండి వచ్చిన నివేదిక ప్రకారం, టెస్ట్ జట్టులో రోహిత్ శర్మ స్థానం గురించి క్రికెట్ కంట్రోల్ బోర్డ్ (BCCI) లో టాప్ అధికారులు, సెలెక్టర్ల మధ్య గొడవ జరుగుతున్నట్లుగా సమాచారం. ప్రస్తుతం జరుగుతున్న బోర్డర్ గవాస్కర్-ట్రోఫీలో ఆస్ట్రేలియాతో జరిగిన మెల్‌బోర్న్ టెస్టులో భారత్ 184 పరుగుల భారీ తేడాతో ఓడిపోయిన వెంటనే ఈ నివేదిక వచ్చింది.

రెండో ఇన్నింగ్స్‌లో 1 ప‌రుగుకే వెనుదిరిగిన నితీష్ రెడ్డి, బాక్సింగ్‌ డే టెస్టులో టీమిండియాపై 184 పరుగుల తేడాతో ఆస్ట్రేలియా ఘన విజయం

Rohit Sharma to retire from Tests after Sydney encounter - Report

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)