ఐసీసీ చాంపియన్స్‌ ట్రోఫీ-2025లో భాగంగా అఫ్గన్‌- ఆసీస్‌(Afghanistan vs Australia) శుక్రవారం లాహోర్‌ వేదికగా అమీతుమీ తేల్చుకుంటున్నాయి.ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా బౌలర్‌ స్పెన్సర్‌ జాన్సన్‌(Spencer Johnson) అద్బుతమైన యార్కర్ దెబ్బకు రహ్మనుల్లా గుర్బాజ్‌(Rahmanullah Gurbaz) క్లీన్ బౌల్డ్ అయ్యాడు.

గడాఫీ స్టేడియంలో టాస్‌ గెలిచిన అఫ్గనిస్తాన్‌ తొలుత బ్యాటింగ్‌ ఎంచుకోగా.. ఆసీస్‌ లెఫ్టార్మ్‌ పేసర్‌ స్పెన్సర్‌ జాన్సన్‌ బౌలింగ్‌ ఎటాక్‌ ఆరంభించాడు.తొలి ఓవర్లో ఐదో బంతికే జాన్సన్‌ అద్బుత రీతిలో రహ్మనుల్లా గుర్బాజ్‌ను బౌల్డ్‌ చేశాడు. గంటకు 140.7 కిలోమీటర్ల వేగంతో జాన్సన్‌ సంధించిన బంతి నేరుగా వికెట్లను గిరాటేసింది. గుర్బాజ్‌.. ‘‘ఏంటిది? నేను అవుటయ్యానా?.. నమ్మలేకపోతున్నా’’ అన్నట్లుగా ఇచ్చిన షాకింగ్‌ రియాక్షన్‌ వైరల్‌ అయింది.

సెమీ ఫైనల్‌లో భారత్ ప్రత్యర్థి ఎవరో తెలుసుకోవాలనుకుంటున్నారా, దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియాలు తమ మ్యాచ్‌ల్లో ఓడితే భారత్, అఫ్గాన్‌ల మధ్య తొలి సెమీ ఫైనల్, పూర్తి వివరాలు ఇవిగో..

Spencer Johnson Nails Mitchell Starc-Like Yorker

 

 

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)