ఐసీసీ చాంపియన్స్‌ ట్రోఫీలో భాగంగా ఆతిథ్య పాకిస్థాన్‌, న్యూజిలాండ్‌ మధ్య కరాచీ వేదికగా తొలి మ్యాచ్‌ (ICC Champions Trophy 2025) జరుగుతున్నది. ఈ మ్యాచ్‌లో టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్‌ భారీ స్కోరు సాధించింది.న్యూజిలాండ్‌ నిర్ణీత 50 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 320 పరుగులు భారీ స్కోరును సాధించింది.ఈ మ్యాచ్ లో విల్ యంగ్ బౌండరీల మీద బౌండరీలు కొడుతూ పాక్ బౌలర్లకు నరకం చూపించాడు.

కేన్ విలియమ్సన్ వికెట్ వీడియో ఇదిగో, నసీమ్ షా అద్భుతమైన డెలివరీకి కీపర్ చేతికి చిక్కిన మాజీ కెప్టెన్

యంగ్ 113 బంతుల్లో 12 ఫోర్లు, ఒక సిక్సర్ సహాయంతో 107 పరుగులు చేసిన తర్వాత ఔటయ్యాడు. కాగా ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో తొలి మ్యాచ్‌లోనే సెంచరీతో అలరించాడు.ఇక లాథమ్‌ 103 బంతుల్లో పది ఫోర్లు, మూడు సిక్సర్ల సహాయంతో 104 పరుగులు చేసి 118 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. యంగ్-లాథమ్ జోడీ నాలుగో వికెట్‌కు 118 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఆ తర్వాత లాథమ్‌-ఫిలిప్‌ జోడీ సైతం ఐదో వికెట్‌కు సెంచరీ భాగస్వామ్యాన్ని నమోదు చేసింది.

Tom Latham Century Video:

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)