తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్, సినీ నిర్మాత దిల్ రాజు సికింద్రాబాద్‌లోని కిమ్స్ ఆసుపత్రికి వెళ్లి శ్రీతేజ్ ను పరామర్శించారు. వైద్యులను అడిగి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు.అనంతరం దిల్ రాజు మాట్లాడుతూ... రేవంత్ రెడ్డి తనను ఎఫ్డీసీ చైర్మన్‌గా నియమించారని, అమెరికాలో ఉన్నందున ఇన్ని రోజులు ఆయనను కలవలేకపోయానన్నారు. అమెరికా నుంచి రాగానే సీఎంను కలిసినట్లు చెప్పారు. అల్లు అర్జున్ సహా సినిమా పెద్దలను కలుస్తానని... అనంతరం పరిశ్రమ అభిప్రాయాన్ని రేవంత్ రెడ్డికి చెబుతానన్నారు. ఇందుకోసం రేపు లేదా ఎల్లుండి సీఎంను మరోసారి కలుస్తానన్నారు. తాను ప్రభుత్వాన్ని, సినీ పరిశ్రమను సమన్వయం చేస్తానన్నారు.
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో రేవతి మృతి చెందడం బాధాకరమన్నారు. ఆమె కుటుంబానికి చిత్ర పరిశ్రమ, ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఈ ఘటనను ఎవరైనా కావాలని చేస్తారా? రేవతి కుటుంబం వినోదం కోసం సినిమాకు వెళితే ప్రమాదవశాత్తు ఇలా జరిగిందని ఆవేదన చెందారు. రేవతి భర్త భాస్కర్‌కు శాశ్వత ఉపాధిని కల్పించేందుకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు. సినిమా పరిశ్రమలో శాశ్వత ఉద్యోగం కల్పిస్తామని హామీ ఇచ్చారు.ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజ్ వేగంగా రికవరీ అవుతున్నాడని తెలిపారు.
Dil Raju on Sandhya Theatre Stampede Case
#WATCH | Hyderabad, Telangana: Film producer and Chairman of the Telangana Film Development Corporation, Dil Raju says, "He (child injured in the Sandhya Theatre incident during the premier show of 'Pushpa 2') is responding and is recovering...He was taken off the ventilator two… pic.twitter.com/VIl2z2mSQF
— ANI (@ANI) December 24, 2024
(ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)