హైదరాబాద్ లో కోడి పందాలు(Hyderabad Cockfight), క్యాసినో కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి(MLC Pochampally Srinivas Reddy)కి నోటీసులు జారీ చేశారు పోలీసులు. మొయినాబాద్ ఫామ్‌హౌస్‌లో కోడిపందాల కేసులో నోటీసులు ఇచ్చారు. ఫామ్‌హౌస్‌ నిర్వహణపై విచారించనున్నారు పోలీసులు.ఈ ఫామ్‌హౌస్‌ యజమానిగా ఉన్నారు ఎమ్మెల్సీ పోచంపల్లి.

ఫామ్‌హౌస్‌ కేంద్రంగా కోడిపందాలు.. క్యాసినో నిర్వహణ హైదరాబాద్‌లో వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఫామ్‌హౌస్‌లో (Farm House) క్యాసినో(Casino) నిర్వహిస్తున్న వారిపై దాడి చేసి పట్టుకున్నారు పోలీసులు. క్యాసినోతో పాటు కోడి పందాలు నిర్వహిస్తోంది ముఠా.

విలేఖరుల ముసుగులో అక్రమ దందా.. ఏడుగురిపై కేసు నమోదు, కారు సీజ్.. బెదిరింపులకు పాల్పడితే సమాచారం ఇవ్వాలని పోలీసుల సూచన

ఫామ్‌హౌస్‌పై దాడి చేసి 64 మందిని పట్టుకుంది రాజేంద్రనగర్ డీసీపీ బృందం(Cockfighting at Hyderabad farmhouse). రూ. 30 లక్షల నగదు, 55 లగ్జరీ కార్లు సీజ్ చేశారు అధికారులు. 86 పందెం కోళ్లు, పెద్ద మొత్తంలో బెట్టింగ్ కాయిన్స్, పేకాట స్వాధీనం చేసుకున్నారు. నగరంలోని ప్రముఖులు కలిసి కోడిపందాలు, క్యాసినో నిర్వహిస్తున్నట్లుగా గుర్తించారు.

Hyderabad cock fight, police notices to BRS MLC Pochampally Srinivas Reddy

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)