![](https://test1.latestly.com/uploads/images/2025/02/ap-police.jpg?width=380&height=214)
Vjy, Feb 13: డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని అయినవిల్లి మండలానికి చెందిన యువకుడు ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్య చేసుకోవాలనుకుని.. ఓ గదిలో ఉరివేసుకునేందుకు సిద్ధమవుతూ సెల్ఫీ వీడియోను కుటుంబ సభ్యులకు పంపించాడు. అయితే 11.21 గంటలకు పి.గన్నవరం సీఐకు కుటుంబ సభ్యులు సమాచారం అందించడంతో పాటు వీడియోను సైతం షేర్ చేశారు
వెంటనే ఐటీ కోర్ కానిస్టేబుల్ సహాయంతో లోకేషన్‌ను కనిపెట్టారు కానీ యువకుని ఫోన్ స్విచ్చాఫ్ వచ్చింది.. దీంతో ఫోన్ ఐఎంఈఐ ద్వారా సుమారు 106 కి.మీ. దూరంలో ఉన్న అన్నవరంలో ఉన్నట్టు గుర్తించారు. అన్నవరం ఎస్సై శ్రీహరిబాబుకు సీఐ భీమరాజు ఫోన్లో సమాచారం అందించి వీడియోతో పాటు లోకేషన్‌ను షేర్ చేసి.. ఫోన్లో మాట్లాడుతూనే లోకేషన్ ట్రేస్ చేయాలని సూచించారు
ఇంతలో ఎస్సై సిబ్బందిని అప్రమత్తం చేస్తుండటంతో పాటు వీడియోను స్థానిక లాడ్జిలకు వాట్సాప్ గ్రూప్‌లో పోస్ట్ చేయడంతో.. దీన్ని చూసిన ఓ లాడ్జి యజమాని ఎస్సైకు సమాచారం ఇచ్చారు. 11.27 గంటలకు హుటాహుటిన లాడ్జికి వెళ్లిన ఎస్సై తలుపులను బద్దలకొట్టి ఉరివేసుకోబొయే యువకుడిని అడ్డుకుని ప్రాణాలను కాపాడి.. కౌన్సెలింగ్ ఇచ్చి కుటుంబ సభ్యులకు అప్పగించారు