ఆదాయ పన్ను బిల్లు 2025 (Income Tax Bill)ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నేడు లోక్‌సభలో ప్రవేశపెట్టారు. ఆ బిల్లును హౌజ్ కమిటీకి సిఫారసు చేయాలని ఆర్థిక మంత్రి.. స్పీకర్ ఓం బిర్లాను కోరారు. అయితే కొత్త ఆదాయ పన్ను బిల్లును ప్రతిపక్షాలు వ్యతిరేకించాయి. అయినప్పటికీ మూజువాణి ఓటు ద్వారా బిల్లు తీర్మానాన్ని సభ్యులు ఆమోదించారు. హౌజ్ సెలెక్ట్ కమిటీకి ఆదాయ పన్ను ముసాయిదా తీర్మానాన్ని రిఫర్ చేయాలని మంత్రి సీతారామన్ కోరారు. అయితే వచ్చే సెషన్ తొలి రోజున ఆ సెలెక్ట్ కమిటీ కొత్త బిల్లుపై తమ నివేదికను ఇవ్వనున్నది. చాలా సరళమైన రీతిలో పన్ను బిల్లు రూపొందించినట్లు మంత్రి వెల్లడించారు.
New Income Tax Bill in Parliament:
FM Nirmala Sitharaman introduces The Income-Tax Bill, 2025 in Lok Sabha@nsitharaman | @FinMinIndia | @ombirlakota | @LokSabhaSectt pic.twitter.com/zuz0ZVOYdo
— All India Radio News (@airnewsalerts) February 13, 2025
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)