ఢిల్లీలోని పార్లమెంట్‌ భవనం సమీపంలో సూసైడ్ ఘటన కలకలం రేగింది. ఓ వ్యక్తి ఒంటిపై కిరోసిన్‌ పోసుకుని నిప్పంటించుకున్నాడు. లోకల్‌ పోలీసులు, రైల్వే పోలీసులు, స్థానికులు తక్షణమే స్పందించి మంటలను ఆర్పేశారు. బాధితుడిని రామ్‌ మనోహర్‌ లోహియా ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఢిల్లీ పోలీసులు తెలిపారు.ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన వ్యక్తిని ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రం, బాగ్‌పట్‌ జిల్లాకు చెందిన జితేంద్రగా గుర్తించారు. పార్లమెంట్‌ సమీపంలోని రైల్వే భవన్‌ ఆవరణలో బుధవారం సాయంత్రం ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ఆత్మహత్య ఘటనపై మరిన్ని  వివరాలు తెలియాల్సి ఉంది.

నాలుగు నెలల క్రితం పెళ్లి, అదనపు కట్నం తేవాలని అత్తింటి వేధింపులు తట్టుకోలేక ఉరి వేసుకుని ఇల్లాలు ఆత్మహత్య, వీడియో ఇదిగో..

Man tries to burn himself near new Parliament building

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)