సర్పంచుల బిల్లులు పెండింగ్‌పై జరిగిన చర్చలో భాగంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చేసిన విమర్శలకు మంత్రి సీతక్క స్టాంగ్‌గా కౌంటర్ ఇచ్చారు. సర్పంచుల బిల్లులు పెండింగ్ పెట్టిందే బీఆర్ఎస్ ప్రభుత్వమని, ఆ పెండింగ్ బిల్లుల బరువు మేం మోస్తున్నామన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అన్ని అబద్ధాలు చెబుతున్నారని విమర్శించారు. ఆ ఎమ్మెల్యేలు ఒక్కొక్కరు రూ.1000 కోట్లు సంపాదించుకున్నారని ఆరోపించారు.

సంక్రాంతి తర్వాత కొత్త స్మార్ట్ రేషన్ కార్డులు, అసెంబ్లీలో కీలక ప్రకటన చేసిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, వీడియో ఇదిగో

సర్పంచ్‌ల పదవి కాలం ఫిబ్రవరిలో ముగిసిందని, ఇప్పుడున్న పెండింగ్ బిల్లులు బీఆర్ఎస్ నుంచి వారసత్వంగా వచ్చినవేనని మంత్రి సీతక్క అన్నారు. హరీష్ రావు ఫైనాన్స్ మంత్రిగా ఆనాడు సంతకం పెడితే బిల్లులు క్లియర్ అయ్యేవికదా అని అన్నారు. కేంద్రం 15వ ఆర్థిక సంఘం నిధులు ఇవ్వలేదని, తాము పెండింగ్ బిల్లులు చెల్లించం అనడం లేదని చెప్పారు. కచ్చితంగా బీఆర్ఎస్ వారసత్వంగా ఇచ్చిన బకాయిలు, పెండింగ్ బిల్లులు చెల్లిస్తామని సీతక్క స్పష్టం చేశారు. బీఆర్‌ఎస్ అంటే బకాయిల రాష్ట్ర సమితి అని మంత్రి సీతక్క అన్నారు.

 

We will clear the bills says Minister seethakka

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)