నల్గొండ జిల్లా నిడమనూరుకు చెందిన కాంగ్రెస్ నాయకుడు రంగసాయి రెడ్డి కుమారుడు వల్లబ్ రెడ్డి (30) అతని భార్య లహరి (27) హిమాయత్ నగర్లో నివాసం ఉంటున్నారు. కొంత కాలంగా భార్య భర్తల మధ్య కొన్నిరోజులుగా మనస్పర్థలు జరుగుతున్నాయి. వీరి పెళ్లి జరిగి ఏడాది కాగా ఈ నెల 13న రాత్రి లహరిని తీవ్రంగా కొట్టిన వల్లబ్ రెడ్డి. లహరి తలను గోడకు, తలుపుకు బాదిన వల్లబ్, లహరి పొట్టలో కాలుతో బలంగా తన్నడంతో పొట్టలో రెండున్నర లీటర్ల బ్లడ్ బ్లీడింగ్ జరిగింది.
ఎవరికీ అనుమానం రాకుండా హార్ట్ ఎటాక్ పేరుతో ఆస్పత్రిలో అడ్మిట్ చేసిన వల్లబ్ రెడ్డి. గుండె పోటుతో చనిపోయినట్లుగా అందరిని నమ్మించాడు. వల్లబ్ రెడ్డి 24న భార్య దినకర్మ కు 10వేల మందికి భోజనాలు పెట్టి ఏమీ తెలియనట్లు నటించాడు. పోస్టుమార్టం రిపోర్టులో మర్డర్ వ్యవహారం తేలింది. వల్లబ్ కొట్టడంతోనే లహరి చనిపోయినట్లు కేసు తేలింది. లహరి తలపై గాయాలు ఉన్నట్లు కనిపిస్తున్నా లహరి తల్లితండ్రులు అనుమానం వ్యక్తం చేయడం లేదు. లహరి తల్లితండ్రులను వల్లబ్ బెదిరించినట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. వల్లబ్ నిందితుడుగా తేలడంతో అతనిపై సెక్షన్ 302 మర్డర్, 201 సాక్షాల తారుమారు కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేసి రిమాండుకు తరలించామని నారాయణగూడ స్టేషన్ హౌజ్ ఆఫీసర్ శ్రీనివాస్ తెలిపారు.

లహరి రెడ్డి తలను గోడకు, తలుపుకు గట్టిగా బాది పొట్టలో కాలుతో వల్లభ్ రెడ్డి బలంగా తన్నడంతో మృతి - పోలీసులు
నల్గొండ జిల్లా నిడమనూరుకు చెందిన కాంగ్రెస్ నాయకుడు రంగసాయి రెడ్డి కుమారుడు వల్లబ్ రెడ్డి (30) అతని భార్య లహరిb(27) హిమాయత్ నగర్లో నివాసం ఉంటున్నారు. కొంత కాలంగా భార్య భర్తల… pic.twitter.com/NXIDVoaQes
— Telugu Scribe (@TeluguScribe) July 29, 2023
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)