యూపీఐ లావాదేవీలు జనవరి 2025లో రికార్డు స్థాయిలో 16.99 బిలియన్(1,699 కోట్లు)లకు చేరుకున్నాయి. వీటి మొత్తం విలువ రూ.23.48 లక్షల కోట్లు దాటింది. దేశవ్యాప్తంగా జరిగే మొత్తం రిటైల్‌ చెల్లింపుల్లో యూపీఐ ద్వారా జరిగే లావాదేవీలే 80 శాతానికిపైగా ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. 641 బ్యాంకులు, 80 యూపీఐ యాప్‌లు ఈ వ్యవస్థలో భాగస్వామ్యం అయ్యాయి.యూపీఐ లావాదేవీలు పెరగడం భారత ఆర్థిక వ్యవస్థపై సానుకూల ప్రభావాన్ని చూపుతోంది. ఇది అంతరాయం లేని ఆర్థిక లావాదేవీలను సులభతరం చేసింది. నగదుపై ఆధారపడటాన్ని తగ్గించింది.ప్రభుత్వం, ఆర్థిక సంస్థలు, టెక్నాలజీ ప్రొవైడర్ల నిరంతర మద్దతుతో భారత డిజిటల్ చెల్లింపు వ్యవస్థకు యూపీఐ దన్నుగా నిలుస్తోంది.

రూ. 25 వేల పరిహారం ఇచ్చి 700 మంది ఫ్రెషర్లను తొలగించిన ఇన్ఫోసిస్, వెంటనే క్యాంపస్ ఖాళీ చేసి వెళ్లిపోవాలని ఆదేశాలు, బలవంతంగా సంతకాలు..

UPI Transactions Hit Record 16.99 Billion in January

 

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)