వినడానికి ఆసక్తికరంగా ఉన్నా పిల్లి - గొర్రె కలిసి ఉత్త జంటగా ఎంపికైన సంఘటన ఉక్రెయిన్‌లో జరిగింది(Viral News). ఈ టైటిల్‌లో పోరులో మిగితా జంతువులతో పోటీ పడి గెలుపొందడం విశేషం. పిల్లి, గొర్రె(Couple of the Year)..జూకు వచ్చే సందర్శకుల హృదయాలను గెలుచుకుని ఉత్తమ జంటగా ఎంపిక కాగా సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

ఈ మేరకు జూ నిర్వాహకులు పేస్ బుక్ ద్వారా అఫిషియల్‌గా(Ukraine zoo) ప్రకటించింది. జంతువుల మధ్య నిర్వహించిన ఈ పోటీలో గొర్రె- పిల్లి ఉత్తమ జంటగా ఎంపికైందని తెలిపారు.

అక్రమ వలసదారులకు సంకెళ్లు.. వీడియో పోస్ట్ చేసిన వైట్ హౌస్, తీవ్ర విమర్శలు చేస్తున్న నెటిజన్లు, వీడియో ఇదిగో 

విభిన్న జంతువుల మధ్య ఇలాంటి మిత్ర సంబంధం ఓడెస్సా జూలో మాత్రమే సాధ్యమవుతుందని నిర్వాహకులు తెలిపారు. అంతేగాదు విజేతల అవార్డు వేడుకకు అందరినీ ఆహ్వానిస్తున్నాము అని తెలిపారు.

Cat and sheep are Couple of the Year 2025.. 

మసాజిక్ జూలో చాలా సుపరిచితమైనది. గొర్రెపై హాయిగా నిద్రపోతూ కనిపించగా ఇది సందర్శకులను విపరీతంగా ఆకట్టుకుంది. ప్రేమికుల దినోత్సవం ఫిబ్రవరి 14న ఈ వేడుక జరుగగా విజేతగా నిలిచి అందరిని ఆశ్చర్యపరిచాయి. ఇక గత ఏడాది ఈ టైటిల్‌ను గొర్రెల జంట గెలుచుకున్నాయి.ఈ పోటీ జంతు ప్రేమికులను విపరీతంగా ఆకట్టుకుంటుండగా సోషల్ మీడియాలో ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)