
Hyderabad, FEB 20: ఇల్లు లేని కుటుంబాలకు ఇండ్లు (Indiramma Houses) మంజూరు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది. మొదటి విడుతలో మంజూరు చేసిన 72,045 ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. అందులో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) నారాయణపేట జిల్లా నారాయణపేట మండలం అప్పకపల్లె గ్రామంలో ఇందిరమ్మ ఇండ్లకు శుక్రవారం శంకుస్థాపన చేయనున్నారు. మొదటి విడుతలో మంజూరు చేసిన 72,045 ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాన్ని రాష్ట్ర ప్రభుత్వం చేపట్టనున్నది.
ఇల్లు లేని కుటుంబాలందరికీ ఇండ్లు మంజూరు చేయాలని ప్రభుత్వం సంకల్పించింది. లబ్దిదారులు స్వంతంగా ఇల్లు కట్టుకునే అవకాశం కల్పిస్తోంది. ఇంటి నిర్మాణానికి రూ.5.00 లక్షల పూర్తి సబ్సిడీతో ఆర్థిక సహాయం అందజేయనున్నది. బేస్‌మెంట్ నిర్మాణం పూర్తి కాగానే లబ్ధిదారుల ఖాతాలో రూ.లక్ష నేరుగా విడుదల చేయనున్నది.