
Hyd, Feb 20: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు మార్చి మొదటి వారంలో జరగనున్నట్లు తెలుస్తోంది(Telangana Assembly Sessions). 5 రోజుల పాటు అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు జరిగే అవకాశం ఉండగా బీసీ, ఎస్సీ రిజర్వేషన్లపై చట్టాలు చేయనుంది ప్రభుత్వం. ఆ తర్వాత మార్చి 10 వ తేదీన ఢిల్లీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బృందం వెళ్లనుంది.
మార్చి 1 నుంచి 5 వరకు అసెంబ్లీ సమావేశం జరుగనుండగా 2025-26 ఆర్థిక సంవత్సరానికి(Telangana Assembly) వార్షిక బడ్జెట్‌ను రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క సభలో ప్రవేశపెట్టనున్నారు. అనంతరం బడ్జెట్‌కు అసెంబ్లీ ఆమోదం తెలుపనుంది. మార్చి 31వ తేదీలోపు బడ్జెట్‌కు అసెంబ్లీ ఆమోదం తప్పనిసరి కావడంతో ఆలోపే బడ్జెట్ సమావేశాలు నిర్వహించాల్సి ఉంటుంది.
మిస్ వరల్డ్ పోటీలకు ఆతిథ్యం ఇవ్వనున్న హైదరాబాద్, మే 7 నుంచి ప్రారంభం కానున్న పోటీలు
ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం ఈ మూడు బిల్లులను రూపొందించే పనిలో ఉంది. ఎస్సీ ఉప వర్గీకరణకు(Telangana Assembly) చట్టబద్ధతపై ఒక బిల్లు, బీసీలకు స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్లపై ఒక బిల్లు, విద్య, ఉపాధి రంగాల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను అమలు చేసేలా మరో బిల్లు.. ఇలా మూడు బిల్లులను ప్రభుత్వం సిద్దం చేయనున్నట్టుగా తెలుస్తోంది.
ఇక అసెంబ్లీలో కాంగ్రెస్ ప్రభుత్వ తీరును ఎండగట్టనుంది బీఆర్ఎస్. రైతు, గురుకులాల సమస్యలతో పాటు కులగణన తప్పుల తడకగా ఉందని బీఆర్ఎస్ ఇప్పటికే పెద్ద ఎత్తున పోరాటం చేస్తున్న నేపథ్యంలో అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగా జరగనున్నాయి.