క్రీడలు
India vs New Zealand, 1st ODI: ఇండియా-న్యూజిలాండ్ తొలి వన్డేకు సర్వం సిద్ధం, ఉప్పల్‌ స్టేడియంలోకి వీటిని మాత్రమే అనుమతిస్తారు, టీమిండియా జట్టులో మార్పులివి
VNSనేడు ఇండియా-న్యూజిలాండ్ తొలి వన్డే క్రికెట్ మ్యాచ్ జరుగనుంది. హైదరాబాద్ లోని ఉప్పల్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో మ్యాచ్ జరుగనుంది. బుధవారం మధ్యాహ్నం 1.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. మూడు మ్యాచుల సిరీస్ లో భాగంగా భారత్, న్యూజిలాండ్మధ్య తొలి వన్డే మ్యాచ్ (1st ODI) జరుగనుంది. దాదాపు నాలుగేళ్ల తర్వాత ఉప్పల్ స్టేడియంలో వన్డే క్రికెట్ మ్యాచ్ జరుగనుంది.
India vs New Zealand ODI Series: ఉప్పల్ స్టేడియం పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు, భారత్, న్యూజిలాండ్ వన్డే మ్యాచ్‌కు 2500 మందితో భద్రత, వివరాలను వెల్లడించిన రాచకొండ సీపీ డీసీ చౌహన్
Hazarath Reddyహైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య బుధవారం జరిగే వన్డే మ్యాచ్ కు (New Zealand vs India ODI) పోలీసులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు.
Lalit Modi Health Update: వెంటిలేటర్‌పై ఆక్సిజన్ సపోర్టుతో లలిత్ మోడి, న్యూమోనియా కూడా అటాక్ చేయడంతో విషమించిన ఆరోగ్యం, రెండు వారాల్లో రెండు సార్లు కరోనా
Hazarath Reddyఐపీఎల్ వ్యవస్థాపకుడు, మాజీ ఛైర్మన్ లలిత్‌ మోడీ ఆరోగ్యం (Lalit Modi Health Update) క్షీణించింది. గత రెండు వారాల్లో రెండుసార్లు కరోనా బారిన పడిన ఆయన ప్రస్తుతం న్యుమోనియాతో బాధపడుతున్నారు.
Team India With Jr. NTR: టాలీవుడ్ నటుడు జూనియర్ ఎన్టీఆర్ ను కలిసిన టీమిండియా క్రికెటర్లు
Rudraన్యూజిలాండ్ తో ఓడీఐ సిరీస్ కు ముందు టీమిండియా క్రికెటర్లు టాలీవుడ్ నటుడు జూనియర్ ఎన్టీఆర్ ను కలిశారు. ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ గా మారాయి.
Rishabh Pant Health Update: క్రికెట్ అభిమానులకు షాకింగ్ న్యూస్, ప్రపంచకప్‌కి దూరం కానున్న రిషభ్‌ పంత్‌, మరో ఆరు వారాల్లో మరో కీలక సర్జరీ
Hazarath Reddyకారు ప్రమాదానికి గురైన భారత వికెట్‌ కీపర్‌ రిషభ్‌ పంత్‌ సాధారణ స్థితికి రావడానికే కనీసం ఆరు నెలల సమయం పడుతుందని వైద్యులు తెలిపారు. ఈ నేపథ్యంలో పంత్‌ స్వదేశంలో అక్టోబర్‌–నవంబర్‌లలో జరిగే వన్డే ప్రపంచకప్‌ టోర్నీతోపాటు 2023 మొత్తం సీజన్‌కు దూరమయ్యే చాన్స్‌ ఉందని తెలుస్తోంది.
Babar Azam Honey-Trapped?: పాక్ కెప్టెన్ బాబర్ ఆజం సెక్స్ వీడియో లీక్, మరొక పాకిస్తానీ క్రికెటర్ స్నేహితురాలితో సెక్స్‌టింగ్ చేశాడంటూ క్లిప్ వైరల్
Hazarath Reddyపాక్ కెప్టెన్ బాబర్ ఆజం లేటెస్ట్ సెక్స్‌టింగ్ వీడియో వైరల్ అవుతోంది. పాక్ కెప్టెన్ వేరే మహిళతో సెక్స్ ఛాటింగ్ చేసినట్లుగా సోషల్ మీడియాలో క్లిప్స్ వైరల్ అవుతున్నాయి. ఇంగ్లండ్‌తో టెస్ట్ సిరీస్ ఓటమి తర్వాత, అతని నాయకత్వంలోని పాకిస్తాన్ న్యూజిలాండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌ను కూడా కోల్పోయింది.
Women's IPL 2023: రూ.951 కోట్లకు మహిళల IPL మీడియా హక్కులను సొంతం చేసుకున్న Viacom18, అధికారికంగా వెల్లడించిన బీసీసీఐ
Hazarath Reddyఈ సంవత్సరం జరగనున్న మహిళల IPL మీడియా హక్కులను Viacom18 చేజిక్కించుకుంది. బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా (బిసిసిఐ) కార్యదర్శి జే షా అధికారిక ప్రకటన ప్రకారం.. వయాకామ్ మొత్తం ఐదేళ్లకు రూ. 951 కోట్ల భారీ మొత్తాన్ని వెచ్చించి కొనుగోలు చేసింది. భారతదేశంలో మహిళా క్రికెట్ వృద్ధిలో ఇది నిజంగా చారిత్రాత్మక పరిణామంగా చెప్పవచ్చు.
Lalit Modi: లలిత్ మోడీ సంచలన నిర్ణయం, తన కుటుంబ బాధ్యతలను కొడుకు రుచిర్ మోడీకి అప్పగించిన IPL మాజీ ఛైర్మన్, ఆదేశాలు వెంటనే అమల్లోకి వచ్చేలా ప్రకటన
Hazarath ReddyIPL మాజీ ఛైర్మన్, KK మోడీ ఫ్యామిలీ ట్రస్ట్ సభ్యుడు లలిత్ మోడీ, ఆదివారం తన కుమారుడు రుచిర్ మోడీని తన కుటుంబం నుండి తన వారసుడిగా ప్రకటించాడు. ఈ ఆదేశాలు వెంటనే అమలులోకి వచ్చేలా ఆయన ప్రకటన చేశారు.
Virat Kohli: ప్రత్యర్థి జట్టుపై అత్యధిక సెంచరీలు బాదిన క్రికెటర్‌గా రికార్డు నమోదు చేసిన కోహ్లీ, ప్రపంచ క్రికెట్‌లో ఏకైక ఆటగాడిగా గుర్తింపు
Hazarath Reddyటీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ మరో అరుదైన ఘనతను సాధించాడు. శ్రీలంకతో జరిగిన మూడో వన్డేలో విశ్వరూపం చూపించిన సంగతి విదితమే. మొత్తం 167 పరుగులతో శ్రీలంక బౌలర్లను ఊచకోత కోశాడు. ఈ మ్యాచ్‌లో విరాట్‌ కోహ్లి 110 బంతులు ఎదుర్కొని 13 ఫోర్లు, 8 సిక్స్‌లతో 166 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు.
Kohli Helicopter Shot Video: విరాట్ కోహ్లీ హెలికాప్టర్ షాట్, 97 మీటర్ల భారీ సిక్స్‌తో ధోనిని గుర్తు చేసిన కోహ్లీ, సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారిన వీడియో
Hazarath Reddyతిరువనంతపురం వేదికగా శ్రీలంకతో జరిగిన మూడో వన్డేలో భారత్ ఘన విజయం సాధించి మూడు వన్డేల సిరీస్‌ను 3-0తో క్లీన్‌ స్వీప్‌ చేసిన సంగతి విదితమే. ఈ మ్యాచ్‌లో విరాట్‌ కోహ్లి 110 బంతులు ఎదుర్కొని 13 ఫోర్లు, 8 సిక్స్‌లతో 166 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు.
IND Vs Sl 3rd ODI: వన్డేల్లో చరిత్ర సృష్టించిన భారత్, భారీ తేడాతో శ్రీలంకపై విజయం, మూడో వన్డేలో దుమ్మురేపిన టీమిండియా బ్యాట్స్ మెన్, బౌలర్లు
VNSమూడో వ‌న్డేలో భార‌త (India) జ‌ట్టు భారీ విజ‌యం సాధించింది. ఆల్‌రౌండ్ ప్ర‌ద‌ర్శ‌న‌తో అద‌ర‌గొట్టిన ఇండియా 317 ప‌రుగుల తేడాతో శ్రీ‌లంక‌ను చిత్తుగా ఓడిచింది. పేస‌ర్ మ‌హమ్మ‌ద్ సిరాజ్ ధాటికి శ్రీ‌లంక (Sri Lanka) టాపార్డ‌ర్ కుప్ప‌కూలింది. కీల‌క‌మైన న‌వ‌నిదు ఫెర్నాండో (19), కుశాల్ మెండిస్ (4), ఆవిష్క ఫెర్నాండో (1) చ‌రిత అస‌లంక (1)ల‌ను సిరాజ్ అవుట్ చేయ‌డంతో లంక కోలుకోలేక‌పోయింది.
IND vs SL 3rd ODI: 3వ వన్డేలో శ్రీలంకకు ఘోర పరాజయం, 317 పరుగుల తేడాతో లంకను చిత్తు చేసిన టీమిండియా, 3-0తో సిరీస్ క్లీన్ స్వీప్
kanhaతిరువనంతపురం వన్డేలో భారత జట్టు 317 పరుగుల తేడాతో శ్రీలంకపై భారీ విజయాన్ని నమోదు చేసి చరిత్ర సృష్టించింది. అత్యంత అధిక పరుగుల తేడాతో వన్డే క్రికెట్‌లో ఇదే అతిపెద్ద విజయం. దీంతో మూడు వన్డేల సిరీస్‌ను భారత్ 3-0తో కైవసం చేసుకుంది.
Khashaba Dadasaheb Jadhav: ఖషబా దాదాసాహెబ్ జాదవ్ కు గూగుల్ నివాళి.. ప్రత్యేక డూడుల్
Rudraఖషబా దాదాసాహెబ్ జాదవ్ 97వ పుట్టినరోజు సందర్భంగా గూగుల్ ప్రత్యేక డూడుల్ రూపొందించి నివాళులు అర్పించింది. 1952లో సమ్మర్ ఒలింపిక్స్ లో ఈ భారత రెజ్లర్ కాంస్య పతకాన్ని గెలుచుకొన్నారు.
IND Vs NZ ODI Tickets : ఉప్పల్ మ్యాచ్‌ టికెట్లు విడదల, తొలిరోజు అందుబాటులోకి కేవలం 6వేల టికెట్లు, ఎక్కడ బుక్ చేసుకోవాలి? ఎప్పటివరకు అమ్ముతారంటే?
VNSఈ నెల 16, సోమవారం వరకు టిక్కెట్లు ఆన్‌లైన్‌లో ఉంటాయి. ఇటీవల ఉప్పల్‌లో జరిగిన టీ20 మ్యాచ్ సందర్భంగా జింఖానా గ్రౌండ్ వద్ద తొక్కిసలాట జరిగిన సంగతి తెలిసిందే. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని, వచ్చే వారం జరగబోయే మ్యాచ్‌కు సంబంధించిన టిక్కెట్లను కేవలం ఆన్‌లైన్‌లోనే విక్రయిస్తున్నారు.
India Squad for Australia Test Series: లాంగ్ గ్యాప్‌ తర్వాత టీమిండియాలోకి రవీంద్ర జడేజా, ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్ కోసం టీమ్ ప్రకటించిన బీసీసీఐ, రిషబ్ పంత్ ప్లేస్‌లో ఎవరిని తీసుకున్నారంటే?
VNSగాయం కారణంగా చాలాకాలంగా ఆటకు దూరంగా ఉన్న రవీంద్ర జడేజా (Ravindra Jadeja) ఈ జట్టులో చోటు దక్కించుకున్నాడు. అంతేకాదు ఈ మధ్య చెలరేగి ఆడుతున్న సూర్యకుమార్ యాదవ్ కూడా తొలి రెండు టెస్టుల్లో ఆడే టీమ్‌ లో చోటు సంపాదించాడు. ఇక రిషబ్ పంత్ యాక్సిడెంట్ కారణంగా దూరం అవ్వడంతో ఇషాన్ కిషన్, కేఎస్ భరత్ లకు స్థానం దక్కింది. ఫాస్ట్ బౌలర్ జస్ప్రిత్ బుమ్రాకు ఈ జట్టులో ప్లేస్ దక్కలేదు.
Sania Mirza Retirement: టెన్నిస్‌ కు సానియా మీర్జా గుడ్ బై, ఆ రెండు ట్రోఫీల తర్వాత రిటైర్మెంట్ అంటూ ప్రకటన
VNSభారత టెన్నిస్‌ స్టార్‌ సానియా మీర్జా రిటైర్మెంట్‌ (Sania Mirza Retirement) ప్రకటించింది. ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ ఆడేందుకు చేరుకున్న సానియా ఆస్ట్రేలియాకు చేరుకుంది. ఏడాది ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ (Australian Open), ఫిబ్రవరిలో జరిగే దుబాయి ఓపెన్‌ (Dubai Open) తర్వాత టెన్నిస్‌కు (Tennis) వీడ్కోలు పలుకనున్నట్లు ప్రకటించింది. ఈ రెండు టోర్నీలు తనకు చివరివని వెల్లడించింది.
Himachal Cricketer Dies: అనారోగ్యంతో భారత క్రికెటర్ మృతి, 28 ఏళ్లకే అనారోగ్యంతో కన్నుమూసిన సిద్ధార్ధ్ శర్మ, షాక్‌ లో అభిమానులు
VNSహిమాచ‌ల్ ప్రదేశ్ క్రికెట్‌లో విషాదం నిండింది. అనారోగ్యంతో ఫాస్ట్ బౌల‌ర్ సిద్ధార్థ్ శ‌ర్మ గురువారం రాత్రి 9 గంట‌ల‌కు మ‌ర‌ణించాడు. రంజీ ట్రోఫీ కోసం గుజ‌రాత్‌లో జ‌ట్టుతో ఉన్న అతను అనారోగ్యానికి గురయ్యాడు. దాంతో, వ‌డోద‌ర‌లోని ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. రెండు వారాలుగా వైద్యులు అత‌డికి వెంటిలేట‌ర్ మీద చికిత్స అందించారు. అయినా కూడా అత‌ని శ‌రీరం స్పదించ‌లేదు.
Odisha: అడవిలో చెట్టుకు ఉరి వేసుకున్న వర్ధమాన మహిళా క్రికెటర్, ఒడిషాలో విషాదకర ఘటన, ఒడిశా క్రికెట్ అసోసియేషన్ వల్లే మృతి చెందిందని కుటుంబ సభ్యుల ఆరోపణ
Hazarath Reddyఒడిశా మహిళా క్రికెటర్ రాజశ్రీ స్వైన్ గురుడిఝాటియా అటవీ ప్రాంతంలో చెట్టుకు ఉరి వేసుకుని కనిపించింది. ఒడిశా క్రికెట్ అసోసియేషన్ (ఓసీఏ), మహిళా జట్టు కోచ్ పుష్పాంజలి బెనర్జీపై మృతురాలి కుటుంబ సభ్యులు ఆరోపణలు చేశారు. వారి వల్లే తమ కూతురు ఆత్మహత్య చేసుకుందని ఆరోపించారు.
IND vs SL 2nd ODI: వీడియో ఇదే, సిరాజ్‌ అద్బుతమైన ఇన్‌స్వింగర్‌తో క్లీన్‌ బౌల్డ్‌ అయిన ఫెర్నాండో, బంతి స్వింగ్‌ అయ్యి మిడిల్‌ స్టం‍ప్‌ను గిరాటేయడంతో ఎగిరిపోయిన స్టంప్
Hazarath Reddyతొలి వన్డేలో అదరగొట్టిన టీమిండియా పేసర్‌ మహ్మద్‌ సిరాజ్‌ రెండో వన్డేలో కూడా మెరుపులు మెరిపించాడు. ఈ మ్యాచ్‌లో 5.4 ఓవర్లు బౌలింగ్‌ చేసిన సిరాజ్‌ 30 పరుగులిచ్చి మూడు వికెట్లు పడగొట్టాడు. కాగా ఈ మ్యాచ్‌లో ఫెర్నాండోను సిరాజ్‌ అద్బుతమైన ఇన్‌స్వింగర్‌తో క్లీన్‌ బౌల్డ్‌ చేశాడు