క్రీడలు
India vs South Africa 2022: జై శ్రీ రామ్ అంటూ దక్షిణాఫ్రికా క్రికెటర్ కేశవ్ మహారాజ్ ట్వీట్, సఫారీలతో మూడు వన్డేల సీరిస్ ని కోల్పోయిన ఇండియా
Hazarath Reddyభారత్ మూడు వన్గేల సీరిస్ కోల్పోయిన సంగతి విదితమే. సఫారీలు వైట్ వాష్ చేశారు. దీనిపై దక్షిణాఫ్రికా ఆటగాడు keshavmaharaj ట్వీట్ చేశాడు, ఇది అద్భుతమైప సీరిస్ అని, భారత్ ఓడిపోవడం చాలా ఆశ్చర్యపరిచిందని అన్నాడు. మేము రీఛార్జ్ చేయడానికి తదుపరి దాని కోసం సిద్ధం చేయడానికి సమయం ఆసన్నమైంది. భారత్ కూడా అదే స్థాయిలో పుంజుకుంటుందని ఆశిస్తున్నాం జై శ్రీ రామ్ అని తెలిపాడు.
Pushpa Movie Fever In Bangladesh: బంగ్లాదేశ్‌ను తాకిన పుష్ప ఫీవర్, క్రికెట్ మ్యాచులో తగ్గేదేలే మ్యానరిజంతో అదరగొట్టిన బంగ్లా బౌలర్..
Krishnaబంగ్లాదేశ్ క్రికెటర్ సైతం పుష్ప రాజ్ మేనరిజంకు ఫిదా అయ్యాడు. ప్రస్తుతం జరుగుతున్న బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో ఓ బౌలర్ వికెట్ తీసిన ఆనందంలో నీ అవ్వ తగ్గేదే లే అంటూ అల్లు అర్జున్ మేనరిజాన్ని ప్రదర్శిస్తూ సంబరాలు చేసుకున్నాడు.
Taylor and Spot Fixing Approach: ఇండియా వ్యాపారవేత్త మ్యాచ్ ఫిక్సింగ్ చేయమని బెదిరించాడు, సంచలన వ్యాఖ్యలు చేసిన జింబాబ్వే మాజీ క్రికెటర్‌ బ్రెండన్‌ టేలర్‌
Hazarath Reddyజింబాబ్వే మాజీ క్రికెటర్‌ బ్రెండన్‌ టేలర్‌ షాకింగ్‌ విషయం వెల్లడించాడు. 2019లో ఓ భారత వ్యాపారవేత్త, తనను మ్యాచ్ ఫిక్సింగ్ చేయమని బెదిరించినట్టు, అతని నుంచి కొంత నగదు కూడా తీసుకున్నట్టుగా సోషల్ మీడియా ద్వారా స్టేట్‌మెంట్ విడుదల చేశాడు బ్రెండన్ టేలర్.
Ind vs SA, 3rd ODI 2022: టీమిండియాను వైట్‌వాష్ చేసిన సఫారీలు, చివరి వన్డేలోనూ టీమిండియాకు తప్పని ఓటమి, వన్డే సిరీస్ ను 3-0తో కైవసం చేసుకున్న దక్షిణాఫ్రికా
Hazarath Reddyదక్షిణాఫ్రికాతో మూడు వన్డేల సిరీస్ ను టీమిండియా ఒక్క విజయం లేకుండా ముగించింది. కేప్ టౌన్ లో జరిగిన చివరి వన్డేలోనూ టీమిండియాకు ఓటమి తప్పలేదు. 288 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో చివరి వరకు పోరాడినా, 4 పరుగుల తేడాతో పరాజయం చవిచూసింది. 49.2 ఓవర్లలో 283 పరుగులకు ఆలౌట్ అయింది.
Virat Kohli Viral Video: విరాట్ కోహ్లీ చేసిన పనికి షాక్ లో ఫ్యాన్స్, ఇదేం పని అంటూ సోషల్ మీడియాలో దుమ్మెత్తి పోస్తున్న నెటిజన్లు, వైరల్ వీడియో ఏంటో చూసేయండి..
Krishnaటీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ వరుస వివాదాల్లో ఇరుక్కుంటున్నాడు. తాజాగా సౌతాఫ్రికా(South Africa)తో మూడో వన్డేకు ముందు జాతీయ గీతం జనగణమన(Jana Gana Mana) ఆలపిస్తుండగా విరాట్ కోహ్లీ చూయింగ్ గమ్ నములుతూ కనిపించాడు.
ICC T20 World Cup 2022 Schedule: భారత్ ఈ సారి కసి తీర్చుకుంటుందా, అక్టోబర్ 23న టీమిండియా- పాకిస్తాన్ తొలిపోరు, టీ20 ప్రపంచకప్‌ 2022 షెడ్యూల్‌ ఇదే
Hazarath Reddyఆస్ట్రేలియా ఆతిథ్యమిస్తున్న టీ20 ప్రపంచకప్‌ 2022 షెడ్యూల్‌ వచ్చేసింది.ఐసీసీ ఈ టోర్నీ షెడ్యూల్‌ను విడుదల చేసింది. అక్టోబర్‌ 16 నుంచి నవంబర్‌ 13 వరకు టోర్నీ జరగనుంది. 16 నుంచి 21 వరకు ఫస్ట్ రౌండ్(క్వాలిఫైయింగ్) మ్యాచులు జరగుతాయి. అసలు మ్యాచ్‌లు అక్టోబర్ 22 నుంచి ప్రారంభమవుతాయి.
ICC Men’s ODI Team 2021: ఒక్క భారత క్రికెటర్ కూడా లేడు, మెన్స్ వన్డే టీమ్ 2021 ను ప్రకటించిన ఐసీసీ, పాక్ కెప్టెన్ బాబర్ ఆజంను కెప్టెన్ గా సెలక్ట్ చేసిన అంతర్జాతీయ క్రికెట్ మండలి
Hazarath Reddy2021కి సంబంధించి అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) 11 మంది సభ్యులతో మెన్స్ వన్డే టీమ్ ను (ICC Men’s ODI Team) ప్రకటించింది. అయితే ఐసీసీ వన్డే టీమ్ లో ఒక్క టీమిండియా ఆటగాడికీ చోటు దక్కలేదు. రోహిత్ శర్్మ, కెఎల్ రాహుల్, కోహ్లీ, అశ్విన్ ఇలా ఎవ్వరూ (no Indian player included Team) ఇందులో చోటు దక్కించుకోలేదు.
IND vs SA 1st ODI 2022: తొలి వన్డేలో భారత్ ఓటమి, 31 పరుగుల తేడాతో నెగ్గిన దక్షిణాఫ్రికా, మూడు వన్డేల సిరీస్‌లో1-0 ఆధిక్యంలో నిలిచిన సఫారీలు
Hazarath Reddyదక్షిణాఫ్రికాతో జరిగిన తొలి వన్డేలో భారత్ ఓడిపోయింది. 31 పరుగుల తేడాతో భారత్ పై దక్షిణాఫ్రికా గెలిచింది. మూడు వన్డేల సిరీస్‌లో(IND vs SA 1st ODI 2022) సౌతాఫ్రికా 1-0 ఆధిక్యంలో నిలిచింది. తొలుత బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా 4 వికెట్లు కోల్పోయి 297 పరుగులు చేసింది.
U19 Cricket World Cup: భారత యువ క్రికెట్ జట్టులో కరోనా కలకలం, కెప్టెన్ యశ్ ధుల్‌, వైస్ కెప్టెన్ షేక్ రషీద్‌ సహా మొత్తం ఆరుగురు భారత క్రికెటర్లకు కరోనా
Hazarath Reddyఅండర్-19 ప్రపంచ కప్ ఆడుతున్న భారత యువ జట్టులో కరోనా కలకలం రేపింది. కెప్టెన్ యశ్ ధుల్‌, వైస్ కెప్టెన్ షేక్ రషీద్‌ సహా మొత్తం ఆరుగురు భారత క్రికెటర్లకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు తెలుస్తోంది. దీంతో వీరంతా ఇవాళ ఐర్లాండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌కు దూరమయ్యారని సమాచారం.
ICC Under-19 cricket World Cup: టీమిండియాలో కరోనా కలకలం, అండర్ -19 కెప్టెన్, వైస్ కెప్టెన్ సహా ఆరుగురికి సోకిన వైరస్, ఐర్లాండ్‌తో మ్యాచ్ కు దూరమైన ఆటగాళ్లు
Naresh. VNSఅండర్-19 ప్రపంచ కప్ ఆడుతున్న భారత యువ జట్టులో కరోనా కలకలం రేపింది. కెప్టెన్ యశ్ ధుల్‌, వైస్ కెప్టెన్ షేక్ రషీద్‌ సహా మొత్తం ఆరుగురు భారత క్రికెటర్లకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో వీరంతా ఐర్లాండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌కు దూరమయ్యారు.
Sania Mirza Retirement: సానియా మీర్జా సంచలన ప్రకటన, ప్రస్తుత సీజన్ తర్వాత రిటైర్ అవుతున్నట్లు ప్రకటించిన భారత క్రీడాకారిణి
Hazarath Reddyభారత టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా సంచలన ప్రకటన చేసింది. తన కెరీర్ కు ముగింపు (Sania Mirza Retirement) పలకబోతున్నట్టు ప్రకటించింది. ప్రస్తుత సీజన్ తర్వాత రిటైర్ అవుతున్నట్టు తెలిపింది. ప్రస్తుతం ఆస్ట్రేలియన్ ఓపెన్ లో ఆమె ఆడుతోంది.
Kapil Dev on Virat Kohli: విరాట్‌ కోహ్లి ఇకపై ఇగోని పక్కన పెట్టాలి, జూనియర్ల కెప్టెన్సీలో ఆడేందుకు నామోషీగా ఫీల్ కాకూడదు, ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన కపిల్ దేవ్
Hazarath Reddyకోహ్లీపై టీమిండియా దిగ్గజం కపిల్‌ దేవ్‌ మిడ్‌ డే లో ఆసక్తికర వ్యాఖ్యలు (Kapil Dev issues BOLD statement ) చేశారు. కోహ్లి తన ఇగోను పక్కనపెట్టి (Virat Kohli will have to give up his ego) జూనియర్ల కెప్టెన్సీలో ఆడాల్సి ఉంటుందని పేర్కొన్నారు. తాను కూడా శ్రీకాంత్‌, అజారుద్దీన్‌ వంటి ఆటగాళ్ల సారథ్యంలో ఆడినవాడినేనని, అయితే అందుకు ఏమాత్రం ఫీలవలేదని చెప్పుకొచ్చారు.
Kohli Steps Down As Test Captain: విరాట్ కోహ్లీ సంచలన నిర్ణయం, టెస్టు కెపెన్సీకి గుడ్ బై, షాక్ లో ఫ్యాన్స్...
Krishnaటీమిండియా క్రికెటర్ విరాట్ కోహ్లీ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఆయన తీసుకున్న నిర్ణయానికి అభిమానులు షాక్ కు గురయ్యారు.
India vs South Africa 3rd Test: దక్షిణాఫ్రికాలో టీమిండియాకు తప్పని ఓటమి, మూడో టెస్టులో కోహ్లిసేన 7 వికెట్ల పరాజయం, 2-1 తేడాతో సిరీస్ పరాజయం
Krishnaదక్షిణాఫ్రికా గడ్డపై టీమిండియాకు ఓటమి పాలైంది. మూడో టెస్టులో కోహ్లిసేన(Virat Kohli) 7 వికెట్లతో ఓటమిని చూసింది. భారత్(Team India) విధించిన 212 పరుగుల టార్గెట్‌ను సౌతాఫ్రికా 3 వికెట్లు కోల్పోయి సునాయాసంగా చేధించింది.
IND vs SA: విరాట్ కోహ్లికి ఏమాత్రం పరిపక్వత లేదు, యువ క్రికెటర్లకు అస్సలు ఆదర్శవంతుడివి కాలేవు, కోహ్లీపై మండిపడిన మాజీ క్రికెటర్ గౌతం గంభీర్
Hazarath Reddyటీమిండియా మాజీ క్రికెటర్‌ గౌతమ్‌ గంభీర్‌ భారత టెస్టు కెప్టెన్‌ విరాట్‌ కోహ్లిపై మండిపడ్డాడు. మరీ ఇంత చెత్తగా ప్రవర్తించడం ఏమిటని ప్రశ్నించాడు. ఇలా చేయడం ద్వారా యువ ఆటగాళ్లకు ఏం సందేశం ఇస్తున్నావంటూ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తాడు.
Virat Kohli Completes 100 Test Catches: విరాట్‌ కోహ్లి టెస్ట్‌ల్లో మరో అరుదైన రికార్డు, 100 క్యాచ్‌లు అందుకున్న ఆరో ఆటగాడిగా గుర్తింపు
Hazarath Reddyటీమిండియా టెస్ట్‌ సారధి విరాట్‌ కోహ్లి టెస్ట్‌ల్లో మరో అరుదైన మైలురాయిని అధిగమించాడు. టెస్ట్‌ల్లో క్యాచ్ ల్లో సెంచరీ మార్కును అందుకున్న ఆరో భారతీయ క్రికెటర్‌గా రికార్డుల్లోకెక్కాడు. దక్షిణాఫ్రికాతో మూడో టెస్ట్‌లో షమీ బౌలింగ్‌లో టెంబా బవుమా క్యాచ్‌ అందుకోవడం ద్వారా కోహ్లి టెస్ట్‌ల్లో 100 క్యాచ్‌లు పూర్తి చేశాడు.
Chris Morris: అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్ బై చెప్పిన దక్షిణాప్రికా ఆల్ రౌండర్ క్రిస్ మోరిస్
Hazarath Reddyదక్షిణాప్రికా ఆల్ రౌండర్ క్రిస్ మోరిస్ అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలికాడు. అన్ని ఫార్మాట్లకు గుడ్ బై చెబుతున్నట్లు ప్రకటించాడు. 2016లో టెస్టు ఆరంగ్రేటం చేసిన మోరిస్ కేవలం నాలుగు మ్యాచ్ లు ఆడాడు. సఫారీ జట్టు తరపున 42 వన్డేలు, 23, టీ20లో ఆడాడు. వన్డేల్లో 467, టీ 20ల్లో 133 పరుగులు చేశాడు.
Saina Nehwal: ఇలాంటి వాటిని నేను పట్టించుకోను, హీరో సిద్ధార్థ్ ట్వీట్‌పై స్పందించిన సైనా నెహ్వాల్, మహిళలను లక్ష్యంగా చేసుకుని అలాంటి పనులు చేయకూడదని తెలిపిన బ్యాడ్మింటన్ స్టార్
Hazarath Reddyసైనా స్పందిస్తూ... ఆయనే ట్విట్టర్లో అలా అన్నారని... ఇప్పుడు క్షమాపణలు చెపుతున్నారని అన్నారు. సిద్ధార్థ్ ట్వీట్ చేసిన రోజున తాను ట్విట్టర్ లో ట్రెండ్ కావడం తనకు ఆశ్చర్యంగా ఉందని చెప్పారు. ఇప్పటి వరకు తాను సిద్ధార్థ్ తో మాట్లాడలేదని తెలిపారు.
Novak Djokovic Visa Controversy: ఆన్‌లైన్ కోర్టులో పోర్న్ వీడియోలు, ఒక్కసారిగా షాక్ తిన్న జడ్జీలు, నోవాక్ జోకోవిచ్‌కు వింత అనుభవం, వీసా రద్దు కేసులో సెర్బియా టెన్నిస్ స్టార్‌కు ఊరట
Hazarath Reddyనోవాక్ జొకోవిచ్ కు ఆన్లై‌న్ కోర్టులో వింత అనుభవం ఎదురయింది. తన వీసా రద్దుకు వ్యతిరేకంగా ఆయన ఈ రోజు కోర్టు విచారణలో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా నోవాక్ జొకోవిచ్ కోర్టు వ్యవహారాల వర్చువల్ సమావేశాన్ని ఒక హ్యకర్ హ్యాక్ చేశాడు. స్ట్రీమింగ్ లింక్‌లో సంగీతం, పోర్న్‌లను ప్రసారం చేశారు. దీంతో జడ్జీలు ఒక్కసారిగా షాక్ తిన్నారు. వెంటనే స్పందించిన మైక్రోసాఫ్ట్ బృందం దాన్ని తొలగించింది.