క్రీడలు

Saurabh Tiwary Retires: ప్రొఫెషనల్‌ క్రికెట్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించిన భారత క్రికెటర్, టీమిండియా తరపున, ఐపీఎల్ మ్యాచ్‌ల్లో సౌరభ్‌ తివారి రికార్డు ఇదిగో..

Hazarath Reddy

జార్ఖండ్‌ ఆటగాడు, టీమిండియా క్రికెటర్‌ సౌరభ్‌ తివారి ప్రొఫెషనల్‌ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాడు. ప్రస్తుత రంజీ సీజన్‌లో తన జట్టు ప్రస్తానం ముగిసిన అనంతరం 34 ఏళ్ల తివారి తన రిటైర్మెంట్‌ నిర్ణయాన్ని జంషెడ్‌పూర్‌లో వెల్లడించాడు.

U-19 World Cup 2024: ప్రపంచకప్ ఫైనల్లో తెలుగులో మాట్లాడుకున్న భారత ప్లేయర్స్, వీడియో సోషల్ మీడియాలో వైరల్

Hazarath Reddy

ఆదివారం దక్షిణాఫ్రికాలోని బెనోనీలో అండర్ 19 వరల్డ్ కప్ ఫైనల్ భారత్-ఆస్ట్రేలియా మధ్య జరిగిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్లో భారత్ పరాజయం పాలైంది. ఈ మ్యాచ్ లో ఇద్దరు టీమిండియా ఆటగాళ్లు తెలుగులో మాట్లాడే వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.టీమిండియా వికెట్ కీపర్ అవనీశ్ రావు, బౌలర్ మురుగన్ అభిషేక్ మధ్య తెలుగులో సంభాషణ జరిగింది.

Footballer Dies by Lightning: మ్యాచ్ ఆడుతుండగా ఆటగాడిపై పడిన పిడుగు, స్టేడియంలోనే కుప్పకూలి మృతి చెందిన పుట్ బాల్ ఆటగాడు, షాకింగ్ వీడియో ఇదిగో

Hazarath Reddy

జనవరి 11 ఆదివారం నాడు ఇండోనేషియాలో జరిగిన ఫుట్‌బాల్ మ్యాచ్‌లో దిగ్భ్రాంతికరమైన, విషాదకరమైన సంఘటన జరిగింది. ఒక ఫుట్‌బాల్ ఆటగాడు మ్యాచ్ ఆడుతున్నప్పుడు పిడుగుపాటుకు గురై అక్కడికక్కడే మరణించినట్లు తెలుస్తోంది.

Uday Saharan: ట్రోఫీ అంతా రాణించాడు, ఫైన‌ల్ లో మాత్రం చ‌తికిలా ప‌డ్డాడు! తుదిపోరులో చేతులెత్తేసిన కెప్టెన్ల స‌ర‌స‌న చేరిన అండ‌ర్-19 కెప్టెన్ ఉద‌య్ స‌హ‌ర‌న్

VNS

ప్పటిలాగే ఫైనల్‌ దాకా సూపర్‌ డూపర్‌ ఆటతో రెచ్చిపోయి.. తీరా తుదిపోరులో చేతులెత్తేసే భారత సారథుల జాబితాలో ఉదయ్‌ సహరన్‌ (Uday Saharan) చేరాడు. ఈ టోర్నీలో ఉదయ్‌ సహరన్‌ టాప్‌ స్కోరర్‌. ఫైనల్‌కు ముందు ఆడిన మ్యాచ్‌లలో ఉదయ్‌ (Uday Saharan) అంచనాలకు మించి రాణించాడు.

Advertisement

ICC Under-19 World Cup 2024: అండ‌ర్-19 ప్ర‌పంచ‌క‌ప్ విజేత‌గా ఆస్ట్రేలియా, గ‌తేడాది రెండు ట్రోఫీలు, ఈ సంవ‌త్సరం మ‌రో ఐసీసీ ట్రోఫీ టీమిండియాకు ద‌క్క‌కుండా చేసిన ఆసిస్

VNS

దక్షిణాఫ్రికా వేదికగా జరిగిన అండర్‌ – 19 మెన్స్‌ వరల్డ్‌ కప్‌లో కంగారూలు.. భారత్‌ను (India) ఓడించి విశ్వవిజేతలుగా నిలిచారు. ఈ టోర్నీలో ఓటమన్నదే లేకుండా ఫైనల్‌కు వచ్చిన మన కుర్రాళ్లు.. తుది పోరులో బౌలింగ్‌లో ఫర్వాలేదనిపించినా బ్యాటింగ్‌లో విఫలమై ఆరో టైటిల్‌ను అందుకునే అవకాశాన్ని చేజేతులా వదులుకున్నారు.

U-19 CWC Final:అండర్ -19 వరల్డ్ కప్‌ లో సిక్సర్ కొట్టేందుకు టీమిండియా తహతహ, నిలువరించేందుకు ఆసిస్ వ్యూహాలు, వరల్డ్ కప్ ఫైనల్ ఇవాళ ఆసక్తికరపోరు

VNS

అప్రతిహత విజయాలతో దూకుడు మీద ఉన్న యువ భారత జట్టు.. ఆదివారం అండర్‌-19 ప్రపంచకప్‌ ఫైనల్లో(U19 CWC 2024) ఆస్ట్రేలియాతో తలపడనుంది. టోర్నీ చరిత్రలో మరే జట్టుకు సాధ్యం కాని రీతిలో ఇప్పటి వరకు ఐదుసార్లు జగజ్జేతగా నిలిచిన యంగ్‌ఇండియా సిక్సర్‌ బాదాలని చూస్తుంది.

IND vs ENG Test series, Indian Team: ఇంగ్లండ్‌తో 3 టెస్ట్ మ్యాచ్‌లకు భారత జట్టును ప్రకటన, సిరీస్ కు కోహ్లీ దూరం..

sajaya

ఇంగ్లండ్‌తో జరిగే మిగిలిన మూడు టెస్టుల కోసం 17 మంది సభ్యులతో కూడిన భారత జట్టును భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) శనివారం ప్రకటించింది. రోహిత్ శర్మ నేతృత్వంలోని భారత జట్టు నుండి శ్రేయాస్ అయ్యర్ , సౌరభ్ కుమార్‌లను జట్టు నుంచి దూరం పెట్టారు.

David Warner: డేవిడ్ వార్నర్ సరికొత్త రికార్డు, అన్ని ఫార్మాట్లలో 300 మ్యాచ్‌లు ఆడిన మూడో ఆటగాడిగా, తొలి ఆస్ట్రేలియా క్రికెటర్‌గా రికార్డు

Hazarath Reddy

ఆస్ట్రేలియా వెటరన్‌ ఆటగాడు డేవిడ్‌ వార్నర్‌ అంతర్జాతీయ క్రికెట్‌లోని అన్ని ఫార్మాట్లలో 100కు పైగా మ్యాచ్‌లు ఆడిన మూడో ఆటగాడిగా, తొలి ఆస్ట్రేలియా ప్లేయర్‌గా రికార్డు నెలకొల్పాడు.

Advertisement

Indian Veteran Premier League: తెలంగాణ టైగ‌ర్స్ జ‌ట్టు కెప్టెన్‌గా క్రిస్ గేల్, ఫిబ్ర‌వ‌రి 23 నుంచి ప్రారంభం కానున్న ఇండియన్ వెటరన్ ప్రీమియర్ లీగ్

Hazarath Reddy

వెస్టిండీస్‌ క్రికెట్‌ దిగ్గజం, యూనివర్సల్‌ బాస్‌ క్రిస్‌ గేల్‌ మరోసారి భారత్ లో మెరుపులు మెరిపించేందుకు రెడీ అయ్యాడు. ఇండియన్ వెటరన్ ప్రీమియర్ లీగ్ ప్రారంభ ఎడిషన్‌లో తెలంగాణ టైగ‌ర్స్ జ‌ట్టుకు క్రిస్ గేల్ కెప్టెన్‌గా వ్య‌వ‌హ‌రించనున్నాడు. ఈ విషయాన్ని ‍క్రిస్‌ గేల్‌ స్వయంగా వెల్లడించాడు.

AB De Villiers on Virat Kohli Second Child: విరాట్ కోహ్లీ 2వ సారి తండ్రి కాబోతున్నారనే వార్త నిజం కాదు, తప్పుడు సమాచారం పంచుకున్నానని తెలిపిన ఎబి డెవిలియర్స్

Hazarath Reddy

విరాట్ కోహ్లి, అనుష్క శర్మలపై చేసిన వ్యాఖ్యలపై ఏబీ డివిల్లర్స్ యూటర్న్ తీసుకున్నాడు.తాజాగా విరాట్ కోహ్లి, అనుష్క శర్మలు తమ రెండో బిడ్డకు జన్మనివ్వబోతున్నారనే వార్తలు నిజం కాదని ఏబీ డివిల్లర్స్ చెప్పారు.

India vs South Africa, Under 19 World Cup Semi-final 2024: అండర్ 19 వరల్డ్ కప్ సెమీస్‌లో సౌతాఫ్రికాపై 3 వికెట్ల తేడాతో విజయం సాధించిన యంగ్ టీమిండియా జట్టు..

sajaya

Under 19 World Cup సెమీస్‌లో దక్షిణాఫ్రికాపై భారత జట్టు 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది. తద్వారా ఉదయ్ సహారన్ సారథ్యంలోని టీమిండియా ఫైనల్‌కు చేరుకుంది. దీంతో భారత్‌కు 245 పరుగుల విజయ లక్ష్యం ఉంది. లక్ష్యాన్ని భారత్ 49 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి ఛేదించింది. భారత్‌కు వరుసగా 5వ సారి ఫైనల్‌కు టికెట్ లభించింది.

IND vs ZIM T20I Series 2024: టీ20 వరల్డ్‌కప్‌ తర్వాత జింబాబ్వే పర్యటనకు టీమిండియా, భారత పర్యటన ద్వారా జింబాబ్వే బోర్డు భారీ లబ్ది పొందే అవకాశం

Hazarath Reddy

టీ20 వరల్డ్‌కప్‌ 2024 ముగిసిన అనంతరం భారత క్రికెట్‌ జట్టు జింబాబ్వే పర్యటనకు వెళ్లనుంది. ఈ పర్యటలో భారత్‌ ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ ఆడనుంది. హరారే వేదికగా జులై 6, 7, 10, 13, 14 తేదీల్లో మ్యాచ్‌లు జరుగనున్నాయి.ఈ పర్యటన వివరాలను జింబాబ్వే క్రికెట్‌ బోర్డు కొద్ది సేపటి క్రితం వెల్లడించింది.

Advertisement

Hockey Player Varun Kumar: ఆ భారత ఆటగాడు ఐదేళ్లుగా నాపై అత్యాచారం చేస్తున్నాడు, హకీ ప్లేయర్ వరుణ్‌ కుమార్‌పై పోలీసులకు యువతి ఫిర్యాదు, కేసు నమోదు చేసిన పోలీసులు

Hazarath Reddy

భారత హాకీ జట్టు క్రీడాకారుడు (Hockey Player), అర్జున అవార్డు గ్రహీత వరుణ్‌ కుమార్‌ (Varun Kumar)పై అత్యాచారం కేసు నమోదైంది. గత ఐదేళ్లుగా వరుణ్‌ తనపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడని ఓ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు అతడిపై బెంగళూరు (Bengaluru) పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు.

Labuschagne Diving Catch Video: పక్షిలా గాల్లో ఎగురుతూ మార్నస్‌ లబుషేన్‌ కళ్లు చెదిరే క్యాచ్ వీడియో ఇదిగో, ఒక్కసారిగా షాక్ అయిన విండీస్ బ్యాటర్ కార్టీ

Hazarath Reddy

బ్యాక్‌వర్డ్‌ పాయింట్‌కు కొంచెం వైడ్‌గా ఉన్న లబుషేన్‌.. పక్షిలా గాల్లో ఎగురుతూ మెరుపు వేగంతో క్యాచ్‌ను అందుకున్నాడు. వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

Rachin Ravindra 200 Video: టెస్టుల్లో తొలి డబుల్ సెంచరీ నమోదు చేసిన రచిన్‌ రవీంద్ర, సౌతాప్రికాకు చుక్కలు చూపిస్తున్న న్యూజిలాండ్‌ యువ సంచలనం

Hazarath Reddy

మౌంట్‌ మాంగనుయ్‌ వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టులో న్యూజిలాండ్‌ యువ సంచలనం రచిన్‌ రవీంద్ర తొలి ఇన్నింగ్స్‌లో అద్భుతమైన డబుల్‌ సెంచరీతో చెలరేగాడు.340 బంతుల్లో 21 ఫోర్లు, 1 సిక్స్‌తో డబుల్‌ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు.

Ben Stokes Run Out Video: వీడియో ఇదిగో, శ్రేయాస్ అయ్యర్ డైరెక్ట్‌ త్రోకు బలైన ఇంగ్లండ్ కెప్టెన్‌ బెన్‌ స్టోక్స్‌, రెండో టెస్టులో భారత్ అద్భుత‌ విజ‌యం

Hazarath Reddy

సోమవారం నాటి ఆటలో అద్భుతమైన ఫీల్డింగ్‌ నైపుణ్యం ప్రదర్శించాడు. ఇంగ్లండ్‌ రెండో ఇన్నింగ్స్‌లో 52.4 ఓవర్‌ వద్ద అశ్విన్‌ బౌలింగ్‌లో వికెట్‌ కీపర్‌ బెన్‌ ఫోక్స్‌ సింగిల్‌ తీసేందుకు ప్రయత్నించాడు.అయితే, నాన్‌స్ట్రైకర్‌ ఎండ్‌లో ఉన్న కెప్టెన్‌ బెన్‌ స్టోక్స్‌ బద్దకంగా కదిలాడు.

Advertisement

India vs England 2nd Test Highlights: ఇంగ్లండ్‌పై 106 ప‌రుగుల‌ తేడాతో ప్రతీకారం తీర్చుకున్న రోహిత్ సేన, రెండో టెస్టులో ఘన విజయంతో సీరిస్ సమం

Hazarath Reddy

ఉప్ప‌ల్ టెస్టులో అనూహ్యంగా ఓట‌మి పాలైన టీమిండియా(Team India) వైజాగ్‌లో జరిగిన రెండో టెస్టులో అద్భుత‌ విజ‌యం సాధించింది. 106 ప‌రుగుల‌తో రోహిత్ సేన ప్ర‌తీకారం తీర్చుకుంది. నాలుగో రోజు భార‌త బౌల‌ర్లు చెల‌రేగ‌డంతో ఇంగ్లండ్ 292 ప‌రుగుల‌కు ఆలౌట‌య్యింది.

IND Vs ENG 2nd Test: రెండో టెస్టులో అరుదైన రికార్డుకు ద‌గ్గ‌ర‌ల్లో ఇంగ్లండ్, విశాఖ టెస్టులో గెలిస్తే ఆ ఫీట్ సాధించిన తొలి జట్టుగా చ‌రిత్ర‌

VNS

ఒకవేళ ఇంగ్లండ్ జట్టు లక్ష్యాన్ని చేధిస్తే చరిత్ర సృష్టించడం ఖాయం. భారత్ గడ్డపై 387 పరుగుల కంటే ఎక్కువ ఛేజింగ్ ను ఏ జట్టు సాధించలేదు. భారత్ గడ్డపై టెస్టు మ్యాచ్ లలో 387 పరుగులు అత్యధిక ఛేజింగ్ లక్ష్యం. 2008లో ఇంగ్లండ్ (England) తో జరిగిన చెన్నై టెస్టు మ్యాచ్ లో భారత్ జట్టు 387 పరుగుల లక్ష్యాన్ని ఛేధించింది.

Yashasvi Jaiswal 200 Video: యశస్వీ జైశ్వాల్‌ తొలి డబుల్ సెంచరీ వీడియో ఇదిగో, భారత్‌ తరపున డ‌బుల్ సెంచ‌రీ బాదిన మూడో అతి పిన్న వయస్కుడిగా రికార్డు

Hazarath Reddy

విశాఖ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా యువ ఓపెనర్‌ యశస్వీ జైశ్వాల్‌ డబుల్ సెంచరీతో కదం తొక్కాడు. తన కెరీర్‌లో తొలి డబుల్‌ సెంచరీని సాధించాడు. 277 బంతుల్లో 18 ఫోర్లు, 7 సిక్స్‌లతో యశస్వీ తన డబుల్‌ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. ఓవరాల్‌గా ఈ మ్యాచ్‌లో 290 బంతుల్లో 209 పరుగులు చేసి జైశ్వాల్‌ ఔటయ్యాడు.

IND vs ENG 2nd Test 2024: స్టంప్ ఔట్ మిస్ చేసిన వికెట్ కీపర్ భరత్, కెప్టెన్ రోహిత్ శర్మ రియాక్షన్ ఎలా ఉందో చూడండి..

Hazarath Reddy

ఇంగ్లండ్‌ ఇన్నింగ్స్‌ 11 ఓవర్ వేసిన కుల్దీప్‌ యాదవ్‌ రెండో బంతికి డకెట్‌ను ఔట్‌ చేశాడు. అనంతరం పోప్‌ క్రీజులోకి వచ్చాడు. అయితే తన ఎదుర్కొన్న తొలి బంతినే అద్బుతమైన డెలవరీగా కుల్దీప్‌ సంధించాడు. ఆ బంతిని అంచనా వేయడంలో పోప్‌ విఫలమయ్యాడు. బంతి పోప్‌ బ్యాట్‌ను మిస్‌ అయ్యి వికెట్‌ కీపర్‌ చేతికి వేళ్లింది.వికెట్‌ కీపర్‌ భరత్‌ సైతం బంతిని అందుకోవడంలో విఫలమయ్యాడు

Advertisement
Advertisement