క్రీడలు

U-19 Asia Cup: పాక్ జ‌ట్టు చేతిలో టీమిండియా ఓట‌మి, భార‌త్ సెమీస్ వెళ్లాలంటే 50-50 ఛాన్స్, అండ‌ర్ -19 ఆసియా కప్ పాయింట్ల ప‌ట్టిక‌లో పాకిస్థాన్ అగ్ర‌స్థానం

VNS

260 ప‌రుగుల ల‌క్ష్యాన్ని పాకిస్తాన్ 47 ఓవ‌ర్ల‌లో రెండు వికెట్లు మాత్ర‌మే కోల్పోయి ఛేదించింది. పాక్ బ్యాట‌ర్ల‌లో అజాన్‌ అవైస్‌ (Azan Awais) శ‌త‌కంతో చెల‌రేగాడు. కెప్టెన్ సాద్ బేగ్ (68 నాటౌట్; 51 బంతుల్లో 8 ఫోర్లు, 1 సిక్స్‌), షాజైబ్ ఖాన్ హాఫ్ సెంచ‌రీల‌తో రాణించారు. భార‌త బౌల‌ర్ల‌లో మురుగన్ అభిషేక్ రెండు వికెట్లు తీశాడు. మిగిలిన వారు దారుణంగా విఫ‌లం అయ్యారు.

7 Runs In One Ball Video: వీడియో ఇదిగో, ఒక్క బంతికే ఏడు పరుగులు సమర్పించుకున్న పాకిస్తాన్, సిక్స్ కొట్టకుండానే ఏడు పరుగులు పిండుకున్న ఆస్ట్రేలియా

Hazarath Reddy

ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లిన దాయాది పాకిస్తాన్‌ జట్టు.. కాన్‌బెర్రా వేదికగా ప్రైమ్ మినిస్టర్స్ ఎలెవన్‌తో ప్రాక్టీస్‌ మ్యాచ్‌లో తలపడతోంది.ఈ వార్మప్‌ మ్యాచ్‌లో ప్రైమ్ మినిస్టర్స్ తొలి ఇన్నింగ్స్ మూడో రోజు ఆట సందర్బంగా ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది.

U-19 Asia Cup 2023: ఆసియాకప్‌లో టీమిండియా బోణీ, అఫ్గానిస్తాన్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో అండర్‌-19 టీమిండియా ఘన విజయం

Hazarath Reddy

అండర్‌-19 ఆసియాకప్‌లో టీమిండియా బోణీ కొట్టింది. దుబాయ్‌ వేదికగా అఫ్గానిస్తాన్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో భారత యువ జట్టు ఘన విజయం సాధించింది. కెప్టెన్‌ కులకర్ణి ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో కీలక పాత్ర పోషించడంతో భారత్ ఈజీగా విజయం సాధించింది.

AB De Villiers Retirement: నా కొడుకు వల్లే అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాను, సంచలన వ్యాఖ్యలు చేసిన సౌతాఫ్రికా స్టార్ ఏబీ డివిలియర్స్‌

Hazarath Reddy

నా చిన్న కొడుకు కాలి మడమ ప్రమాదవశాత్తూ నా ఎడమ కంటికి తాకింది. అందువల్ల నా దృష్టి కాస్త లోపించింది. ఆ తర్వాత సర్జరీ చేయించుకున్నాను. సర్జరీ అనంతరం డాక్టర్‌ ఇకపై ఆటకు దూరంగా ఉండమని చెప్పాడు. అందుకే డాక్టర్‌ సలహా మెరకు అంతర్జాతీయ క్రికెట్‌ నుంచి తప్పుకున్నానని వెల్లడించాడు.

Advertisement

Virat Kohli Most Viewed Asian: వికీపీడియాలో అత్యధికంగా వీక్షించిన పేజీ విరాట్ కోహ్లీదే, ట్వీట్ ఇదిగో..

Hazarath Reddy

2023లో ఆసియన్లలో వికీపీడియాలో అత్యధికంగా వీక్షించిన పేజీ విరాట్ కోహ్లీ నంబర్ వన్ స్థానంలో నిలిచారు. కాగా ప్రపంచకప్ లో తన ప్రదర్శనతో అభిమానులను మరింతగా ఆకట్టుకున్నాడు విరాట్ కోహ్లీ.

Glenn Maxwell on IPL: తాను చచ్చేవరకు ఐపీఎల్ ఆడుతూనే ఉంటా, ఆర్సీబీ ఆటగాడు గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌ సంచలన వ్యాఖ్యలు

Hazarath Reddy

తన ఒంట్లో ఓపిక ఉన్నంత వరకు ఐపీఎల్‌ ఆడతానంటూ రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు ఫ్రాంచైజీ స్టార్‌ ఆటగాడు గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌ కీలక వ్యాఖ్యలు చేశాడు. తనకెంతో ఇష్టమైన ఐపీఎల్‌ను 'ఇక నడవలేను' అనుకునే వరకు ఆడతానని తెలిపాడు.

Mushfiqur Rahim Dismissed Video: వీడియో ఇదిగో, చేతితో బంతిని అడ్డుకుని ఔటైన ముష్ఫికర్‌ రహీం, 11వ ఆటగాడిగా, బంగ్లా తొలి ఆటగాడిగా రికార్డు

Hazarath Reddy

ఈ రోజు బంగ్లాదేశ్‌ వెటరన్‌ ఆటగాడు, ఆ జట్టు వికెట్‌కీపర్‌ ముష్ఫికర్‌ రహీం ఓ అరుదైన పద్దతిలో ఔటయ్యాడు. బంతికి చేతితో అడ్డుకుని ముష్ఫికర్‌ పెవిలియన్‌కు చేరాడు.

CSA Announces Squads For India Tour: దక్షిణాఫ్రికాకు భారీ షాక్, భారత్‌తో టెస్ట్ సీరిస్‌కు దూరం కానున్న కెప్టెన్ బావుమా, ఫాస్ట్ బౌలర్ కగిసో రబడా, టీమిండియా పోరుకు సౌతాఫ్రికా టీం ఇదిగో..

Hazarath Reddy

దక్షిణాఫ్రికా ODI కెప్టెన్ టెంబా బావుమా, ఫాస్ట్ బౌలర్ కగిసో రబడా ఈ నెలాఖరులో భారత్‌తో జరగనున్న రెండు టెస్టులకు సన్నద్ధం కావడానికి వారి వైట్-బాల్ సిరీస్ నుండి విశ్రాంతి తీసుకున్నారు. బావుమా ఇటీవలే పూర్తయిన ప్రపంచ కప్‌లో దక్షిణాఫ్రికాకు నాయకత్వం వహించాడు.

Advertisement

IND vs AUS 5th T20I: ఉత్కంఠ రేపిన ఐదో టీ-20లోనూ ఓట‌మి పాలైన ఆసిస్, చివరి ఓవ‌ర్ లో అర్ష్ దీప్ స్ట‌న్నింగ్ బౌలింగ్,6 ప‌రుగుల తేడాతో టీమిండియా విజ‌యం

VNS

భార‌త్ – ఆసీస్ మ‌ధ్య బెంగ‌ళూరులోని చిన్న‌స్వామి స్టేడియం (Chinnaswamy Stadium) వేదిక‌గా ముగిసిన ఐదో టీ20లో (IND Vs AUS) యువ భార‌త్ ఉత్కంఠ విజ‌యం సాధించింది. భార‌త్ నిర్దేశించిన 161 ప‌రుగుల ఛేద‌న‌లో ఆసీస్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 8 వికెట్లు కోల్పోయి 154 ప‌రుగులు చేయ‌డంతో భార‌త్ ఆరు ప‌రుగుల తేడాతో విజ‌యం (India Win) సాధించింది.

IPL 2024 Auction: ఐపీఎల్ వేలం తేదీ ఖరారు, తొలిసారి విదేశాల్లో వేలం నిర్వ‌హ‌ణ‌కు నిర్ణ‌యం, వేలంలో రిజిస్ట్ర‌ర్ చేసుకున్న 830 మంది భార‌త ఆట‌గాళ్లు

VNS

ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (IPL) – 2024లో భాగంగా కీల‌క‌మైన వేలం ప్ర‌క్రియను (IPL 2024 Auction) డిసెంబ‌ర్ 19న నిర్వ‌హించ‌నున్న‌ట్టు బీసీసీఐ తెలిపింది. ఈ మేర‌కు ఐపీఎల్ అధికారిక ట్విట‌ర్ ఖాతాలో ఈ విష‌యాన్ని వెల్ల‌డించింది. ఐపీఎల్ చ‌రిత్ర‌లో తొలిసారి వేలం (IPL 2024 Auction) ప్ర‌క్రియ భార‌త్ ఆవ‌ల జ‌రుగ‌నుండ‌టం గ‌మ‌నార్హం

Rahul Dravid: వ‌ర‌ల్డ్ క‌ప్ లో టీమిండియా ఓట‌మిపై రాహుల్ ద్ర‌విడ్, రోహిత్ శ‌ర్మ‌ల‌ను వివ‌ర‌ణ కోరిన బీసీసీఐ, అప‌జ‌యానికి గ‌ల కార‌ణాల‌పై బోర్డుకు ద్ర‌విడ్ సుదీర్ఘ వివ‌ర‌ణ‌

VNS

అటు బ్యాట‌ర్ల‌కు గానీ, ఇటు బౌల‌ర్ల‌కు గానీ ఏ మాత్రం స‌హ‌కారం ల‌భించ‌లేద‌న్నాడు. రోహిత్ శ‌ర్మ కూడా ఇదే విష‌యం చెప్పిన‌ట్లు వార్త‌లు వ‌చ్చాయి. లీగ్ ద‌శ‌లో పాకిస్తాన్‌తో ఆడిన మ్యాచ్‌కు ఉప‌యోగించిన పిచ్ పైనే భారత జ‌ట్టు ఫైన‌ల్ మ్యాచ్ ఆడ‌డం గ‌మ‌నార్హం. పాకిస్తాన్‌తో మ్యాచులో భార‌త జ‌ట్టు ఈజీగానే విజ‌యం సాధించింది.

IND vs AUS 4th T20I:టీ-20 సిరీస్ భార‌త్ కైవ‌సం, మ‌రో మ్యాచ్ మిగిలి ఉండ‌గానే సిరీస్ చేజిక్కింకున్న టీమిండియా, చెల‌రేగిన రింకూ సింగ్, ఆసిస్ న‌డ్డివిరిచిన అక్ష‌ర్ ప‌టేల్

VNS

రాయ్‌పుర్‌ లోని షాహీద్‌ వీర్‌ నారాయణ్‌ సింగ్ స్టేడియంలో ఆస్ట్రేలియాతో (IND Vs AUS) జ‌రిగిన నాలుగో టీ20 మ్యాచులో 20 ప‌రుగుల తేడాతో భార‌త్ (India Win) విజ‌యం సాధించింది. దీంతో ఐదు మ్యాచుల టీ20 సిరీస్‌లో భార‌త్ 3-1తో ఆధిక్యంలోకి దూసుకువెళ్లింది.

Advertisement

Ruturaj Gaikwad: అరుదైన రికార్డు సృష్టించిన టీమిండియా యువ ఓపెన‌ర్, టీ-20ల్లో 4వేల క్ల‌బ్ లోకి రుతురాజ్ గైక్వాడ్

VNS

భార‌త యువ ఓపెన‌ర్ రుతురాజ్ గైక్వాడ్(Ruturaj Gaikwad) మ‌రో మైలురాయికి చేరువ‌య్యాడు. టీ20ల్లో వేగంగా 4 వేల ప‌రుగుల క్ల‌బ్‌లో చేరాడు. పొట్టి ఫార్మాట్‌లో వేగంగా 4 వేల ర‌న్స్ కొట్టిన ఐదో క్రికెట‌ర్‌గా గైక్వాడ్ రికార్డు సృష్టించాడు. రాయ్‌చూర్‌లో ఆస్ట్రేలియాతో జ‌రుగుతున్న నాలుగో టీ20లో గైక్వాడ్ ఈ ఫీట్ సాధించాడు

Mitchell Marsh Controversy: అందులో త‌ప్పేముంది! వ‌ర‌ల్డ్ క‌ప్ పై కాళ్లు పెట్ట‌డాన్ని స‌మ‌ర్ధించుకున్న ఆస్ట్రేలియా క్రికెట‌ర్, మ‌రోసారి వార్త‌ల్లోకి మిచెల్ మార్ష్

VNS

నేను సోషల్ మీడియాను ఎక్కువ‌గా చూడ‌ను. ప్ర‌పంచ‌క‌ప్ పై నేను కాళ్లు పెట్టి దిగిన ఫోటో వైర‌ల్ అయ్యింది. దీని గురించి నా స్నేహితులు చెప్పారు. అయితే.. అందులో నాకు ఎలాంటి అగౌర‌వం క‌నిపించ‌లేదు.’ అని మార్ష్ వెల్ల‌డించాడు. మార్ష్ చేసిన ఈ వ్యాఖ్య‌లు వైర‌ల్‌గా మారాయి. దీనిపై నెటీజ‌న్లు మండిప‌డుతున్నారు.

India Tour of SA: డిసెంబర్‌ 10 నుంచి టీమిండియా దక్షిణాఫ్రికా టూర్ ప్రారంభం...సఫారీ పర్యటన జట్టు ఖరారు

ahana

భారత క్రికెట్ జట్టు డిసెంబర్‌లో దక్షిణాఫ్రికాలో పర్యటించనుంది. అక్కడ భారత క్రికెట్ జట్టు 3 టీ20, 3 వన్డేలు, 2 టెస్టు మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. డిసెంబర్ 10 నుంచి ప్రారంభం కానున్న ఈ టూర్‌లో తొలి టీ20 మ్యాచ్‌లు జరగనున్నాయి. దక్షిణాఫ్రికాతో భారత్‌ తొలి టీ20 మ్యాచ్‌ డిసెంబర్‌ 10న డర్బన్‌లోని కింగ్స్‌మీడ్‌లో జరగనుంది.

Telangana Assembly Election 2023: ఓటు హక్కును వినియోగించుకున్న మాజీ భారత కెప్టెన్ ముహమ్మద్ అజహరుద్దీన్, వీడియో ఇదిగో..

Hazarath Reddy

తెలంగాణ శాసనసభకు జరుగుతున్న ఎన్నికల పోలింగ్ రాష్ట్రవ్యాప్తంగా జోరుగా కొనసాగుతోంది. కొన్ని చోట్ల ఈవీఎంల మొరాయింపు మినహా ప్రశాంతంగా కొనసాగుతోంది. పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ఉదయాన్నే పోలింగ్ బూత్‌లకు చేరుకుని తమ ఓటుహక్కు వినియోగించుకున్నారు. జూబ్లీహిల్స్ కాంగ్రెస్ అభ్యర్థి , మాజీ ఇండియన్ క్రికెటర్ ముహమ్మద్ అజహరుద్దీన్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.

Advertisement

BCCI: టీమిండియా ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్ పదవీ కాలం పొడిగిస్తూ బీసీసీఐ కీలక నిర్ణయం, సహాయక సిబ్బంది కాంట్రాక్ట్ కూడా పొడిగిస్తున్నట్లు ప్రకటన

Hazarath Reddy

భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్, టీం ఇండియా (సీనియర్ మెన్) సహాయక సిబ్బందికి కాంట్రాక్టులను పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (WTC) మరియు ODI ప్రపంచ కప్ రెండింటిలోనూ భారతదేశం రన్నరప్‌గా నిలిచిన ద్రావిడ్, అతని కోచింగ్‌లో, గత రెండేళ్లలో మంచి రికార్డును కలిగి ఉన్నాడు.

IND VS AUS 3rd T20I : భారత్ చేతుల్లోంచి చివరి ఓవర్లో మ్యాచ్ లాగేసుకున్న మాక్స్ వెల్...3వ టీ20 మ్యాచులో ఆస్ట్రేలియా చేతిలో భారత్ పరాజయం..

ahana

టీ20 సిరీస్‌లో భాగంగా గౌహతి వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన మూడో మ్యాచ్‌లో సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలోని భారత జట్టు 5 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. దీంతో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో ఆస్ట్రేలియా జట్టు తొలి విజయాన్ని నమోదు చేసింది.

T20 World Cup 2024: వచ్చే ఏడాది టీ20 వరల్డ్ కప్‌కు అర్హత పొందిన జట్లు ఇవిగో, తొలిసారిగా బరిలోకి అమెరికా జట్టు, చివరి నిమిషంలో క్వాలిఫై అయిన నమీబియా

Hazarath Reddy

టీ20 వరల్డ్ కప్ 2024 టోర్నీకి ఇప్పటివరకు 19 జట్లు అర్హత పొందాయి. 2022 టీ20 వరల్డ్ కప్ పాయింట్ల పట్టికలో రెండు గ్రూపుల్లో టాప్-4లో నిలిచిన మొత్తం 8 జట్లు నేరుగా అర్హత సాధించాయి.బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్థాన్ జట్లు ర్యాంకింగ్స్ ఆధారంగా టోర్నీలో ఆడేందుకు బెర్తులు దక్కించుకున్నాయి.

Gujarat Titans New Captain: గుజరాత్‌ టైటాన్స్‌ కొత్త కెప్టెన్‌గా శుభ్‌మన్‌ గిల్‌, హార్దిక్‌ పాండ్యా ముంబై ఇండియన్స్‌కు బదిలీ

Hazarath Reddy

2024 ఐపీఎల్‌ సీజన్‌ కోసం గుజరాత్‌ టైటాన్స్‌ తమ కొత్త కెప్టెన్‌గా శుభ్‌మన్‌ గిల్‌ ను ప్రకటించింది. గత రెండు సీజన్లలో గిల్‌ తమ జట్టుకు ఎన్నో అపురూపమైన విజయాలు అందించాడని, బ్యాటర్‌గానే కాకుండా అన్ని విషయాల్లో పరిణతి సాధించాడని ఫ్రాంచైజీ డైరెక్టర్‌ విక్రమ్‌ సోలంకీ అన్నాడు.

Advertisement
Advertisement