క్రీడలు

ICC Shares Five Match Ups: వ‌ర‌ల్డ్ క‌ప్ ఫైన‌ల్ లో అస‌లు ఫైట్ ఈ ఐదుగురి మ‌ధ్య‌నే, భార‌త్ వ‌ర్సెస్ ఆస్ట్రేలియా కాకుండా ఏయే ప్లేయ‌ర్లు త‌ల‌ప‌డ‌నున్నారంటే? ఐసీసీ ఆస‌క్తిక‌ర‌మైన పోస్ట్

VNS

అహ్మ‌దాబాద్‌లో జ‌రిగే ఫైన‌ల్లో టీమిండియా టాపార్డర్‌కు, కంగారూ జ‌ట్టు బౌలింగ్ యూనిట్ మ‌ధ్య ఆస‌క్తిక‌ర పోరు ఖాయ‌మంటున్నారు విశ్లేష‌కులు. ఆదివారం అహ్మ‌దాబాద్‌లో ఐదుగురి మ‌ధ్య ‘నువ్వా నేనా’ అనే రేంజ్‌లో ఫైట్ సాగుతుంద‌ని శ‌నివారం ఐసీసీ ఒక పోస్ట్ పెట్టింది

Ahmadabad Weather Forecast: వ‌ర‌ల్డ్ క‌ప్ ఫైన‌ల్ మ్యాచ్ కు వాన‌గండం ఉందా? ఇంత‌కీ అహ్మ‌దాబాద్ లో వాతావ‌ర‌ణంపై ఐఎండీ ఏం చెప్పిందంటే?

VNS

వన్డే ప్రపంచకప్‌ ఫైనల్‌ మ్యాచ్‌కు (ODI Worldcup Final) సర్వం సిద్ధమైంది. అహ్మదాబాద్‌లోని నరేంద్రమోదీ స్టేడియం (Narendra Modi Stadium) వేదికగా భారత్‌-ఆస్ట్రేలియా (Ind vs Aus) మధ్య ఆదివారం జరగనున్న మ్యాచ్‌ కోసం ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానులంతా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.

World Cup Trophy: వ‌ర‌ల్డ్ క‌ప్ ట్రోఫీ డిజైన్ ఎందుకు మార‌దు? అస‌లు విజేత‌ల‌కు ఇచ్చేది నిజ‌మైన ట్రోఫీ కాద‌ని మీకు తెలుసా? వ‌ర‌ల్డ్ క‌ప్ డిజైన్ వెనుక ఉన్న క‌థ ఇది!

VNS

మరి ప్రతిసారి ప్రపంచకప్‌ విజేత కోసం ఈ హుంగూ ఆర్భాటాలతో ట్రోఫీని తయారు చేస్తారా..? అనే అనుమానం ప్రతి ఒక్కరికీ వచ్చే ఉంటుంది. దీనికి సమాధానం ముమ్మాటికీ కాదు! ప్రస్తుతం ప్రపంచ విజేతకు అందిస్తున్న ట్రోఫీని 1999లో రూపొందించారు.

World Cup Final: వ‌ర‌ల్డ్ కప్ ఫైన‌ల్ మ్యాచ్ లో కీల‌కం కానున్న సెంచ‌రీ, ఏ జ‌ట్టు నుంచి సెంచ‌రీ చేస్తే వాళ్త‌దే క‌ప్, ప్రారంభం నుంచి కొన‌సాగుతున్న సెంటిమెంట్

VNS

ఓ సెంటిమెంట్‌ అభిమానులలో ఆసక్తిని రేకెత్తిస్తున్నది. వన్డే వరల్డ్ కప్‌ ఫైనల్‌ గెలవాలంటే ఆ మ్యాచ్‌లో సెంచరీ (Century) చేసిన బ్యాటర్‌కు సంబంధించిన జట్టు తుదిపోరులో నెగ్గి విశ్వవిజేతగా నిలుస్తోంది. గత 13 ఎడిషన్లలో ఒకే ఒక్కసారి తప్ప మిగిలిన ప్రతీసారి ఒక ఆటగాడు సెంచరీ చేసిన జట్టే గెలిచింది. చరిత్ర చెప్పిన సత్యం ఇది.

Advertisement

ICC Cricket World Cup 2023 Final Ceremony Date, Time and Venue: వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‌ కు మోదీ, ధోనీ.. స్పెషల్‌ అట్రాక్షన్‌ గా వాయుసేన విన్యాసాలు.. ఇంకా ఎన్నెన్నో విశేషాలు

Rudra

ఐసీసీ వన్డే ప్రపంచకప్‌ ఫైనల్‌ (ICC World Cup Final)కు చేరింది. ఆదివారం అహ్మదాబాద్‌ ( Ahmedabad)లోని నరేంద్ర మోదీ స్టేడియంలో (Narendra Modi Stadium) భారత్‌ – ఆస్ట్రేలియా (India Vs Australia) మధ్య ప్రపంచకప్‌ ఫైనల్‌ మ్యాచ్‌ జరగనుంది.

Sri Lanka Govt Apologies To Jay Shah: జై షా కు సారీ చెప్పిన శ్రీలంక ప్రభుత్వం, శ్రీలంక పార్లమెంట్ లో జై షా ను క్షమాపణ కోరిన మంత్రులు, ఇంతకీ ఎం జరిగిందంటే?

VNS

జైషా పై (Jay Shah) శ్రీలంక మాజీ కెప్టెన్ అర్జున రణ‌తుంగ వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేసిన సంగ‌తి తెలిసిందే. ఈ వ్యాఖ్య‌ల‌పై తాజాగా శ్రీలంక ప్ర‌భుత్వం క్ష‌మాప‌ణ‌లు చెప్పింది. పార్ల‌మెంట్ స‌మావేశాల్లో మంత్రులు హరీన్ ఫెర్నాండో, కాంచన విజేశేఖ‌ర‌లు ఘ‌ట‌న పై విచారం వ్య‌క్తం చేశారు. ప్ర‌భుత్వం త‌రుపున జైషాకు క్ష‌మాప‌ణ‌లు తెలుపుతున్న‌ట్లు చెప్పారు.

IND vs AUS, World Cup Final: నరేంద్ర మోడీ స్టేడియంపై సూర్యకిరణ్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌లు అద్భుత విన్యాసాల వీడియోలు ఇవిగో, రెండు రోజుల ముందే రిహార్సల్స్‌ షురూ చేసిన ఇండియన్ ఎయిర్‌ఫోర్స్

Hazarath Reddy

అహ్మదాబాద్‌ (Ahmedabad) వేదికగా భారత్‌ – ఆస్ట్రేలియా ( India Vs Australia) మధ్య ప్రపంచకప్‌ ఫైనల్‌ ఈ ఆదివారం జరగనున్న సంగతి విదితమే. అహ్మదాబాద్‌ నరేంద్ర మోదీ స్టేడియంలో జరగనున్న ప్రపంచకప్‌ ఫైనల్లో భారత ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన సూర్యకిరణ్‌ ఏరోబాటిక్‌ టీమ్‌ ప్రదర్శనలు ఇవ్వబోతోంది

Hardik Pandya Ruled Out: ప్రపంచకప్ ఫైనల్‌తో పాటు ఆస్ట్రేలియా టీ20 సిరీస్‌ నుంచి హార్దిక్ పాండ్యా ఔట్, కాలి మడమకు గాయం కారణంగా బీసీసీఐ కీలక నిర్ణయం

Hazarath Reddy

వ‌ర‌ల్డ్‌క‌ప్ 2023 మ్యాచ్‌లో గాయ‌ప‌డ్డ హార్దిక్ పాండ్యా(Hardik Pandya).. ఆస్ట్రేలియాతో జ‌ర‌గ‌నున్న టీ20 సిరీస్‌కు దూరం కానున్నాడు. కాలి మ‌డిమకు గాయం కావ‌డంతో.. వ‌ర‌ల్డ్‌క‌ప్‌లో బంగ్లాదేశ్‌తో మ్యాచ్ స‌మ‌యంలో అత‌ను గాయ‌ప‌డ్డాడు.

Advertisement

World Cup 2023: ఈ సారి టైటిల్ ఎగరేసుకుపోయేది మనోళ్లే, సంచలన వ్యాఖ్యలు చేసిన సౌత్ ఇండియా సూపర్ స్టార్ రజినీకాంత్

Hazarath Reddy

ఫైనల్స్‌లో భారత్‌ గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ‘న్యూజిలాండ్‌తో జరిగిన సెమీ ఫైనల్స్‌ మ్యాచ్‌లో మొదట కాసేపు టెన్షన్‌ పడ్డాం. మొదటి గంటన్నర చాలా ఆందోళనకు గురయ్యాం. ఆ తర్వాత వరుసగా వికెట్లు పడిపోవడంతో గేమ్‌ మనకు అనుకూలంగా మారింది.

Cricket World Cup: ఇండియా-ఆస్ట్రేలియా మధ్య ఆదివారం వరల్డ్ కప్ ఫైనల్.. ముఖ్య అతిథిగా ప్రధాని మోదీ.. క్రికెట్ దిగ్గజాలు ఎమ్ఎస్ ధోనీ, కపిల్ దేవ్ కూడా.. ఇప్పటికే అహ్మదాబాద్‌ కు చేరుకున్న టీమిండియా

Rudra

గుజరాత్ లోని అహ్మదాబాద్‌ లో మోదీ స్టేడియం వేదికగా భారత్-ఆస్ట్రేలియా మధ్య ఆదివారం జరిగే మ్యాచ్‌ కోసం క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. చరిత్రాత్మకమైన ఈ మ్యాచ్‌ కు అన్ని రంగాలకు చెందిన ప్రముఖులు హాజరయ్యే అవకాశం కనిపిస్తోంది.

World Cup 2023: భారత్‌తో ఫైనల్ పోరుకు సిద్ధమైన ఆస్ట్రేలియా, ఉత్కంఠభరిత పోరులో పోరాడి ఓడిన సఫారీలు, డేవిడ్ మిల్లర్ సెంచరీ వృధా

Hazarath Reddy

వన్డే ప్రపంచకప్‌లో భాగంగా కోల్‌కతా వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో సెమీఫైనల్లో ఆస్ట్రేలియా 3 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. దీంతో ఈనెల 19న అహ్మదాబాద్ వేదికగా జరగనున్న ఫైనల్లో టీమిండియాతో ఆస్ట్రేలియా తలపడనుంది.

World Cup 2023 Final: ప్రపంచకప్ 2023 ఫైనల్‌కు ప్రధాని నరేంద్ర మోదీ, ప్రత్యక్షంగా స్టేడియంలో కూర్చుని వీక్షించనున్నట్టు తెలిపిన దైనిక్ జాగరణ్

Hazarath Reddy

భారత్‌ వేదికగా జరుగుతున్న ఐసీసీ వన్డే వరల్డ్‌ కప్‌ సమరం తుది అంకానికి చేరుకుంది. రెండో సెమీస్‌ విజేత.. నవంబర్‌ 19న అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో భారత్‌తో జరుగబోయే మ్యాచ్‌లో అమీతుమీ తేల్చుకోనుంది. అయితే ప్రధాని నరేంద్ర మోడీ ఫైనల్‌ను ప్రత్యక్షంగా వీక్షించనున్నట్టు దైనిక్‌ జాగరణ్‌ ఓ కథనంలో పేర్కొంది.

Advertisement

Ashwin Kisses Shami's Hand: వీడియో ఇదిగో, ఏడు వికెట్లు తీసిన షమీ చేతికి ముద్దు పెట్టిన అశ్విన్, సోషల్ మీడియాలో క్లిప్ వైరల్

Hazarath Reddy

ICC ODI ప్రపంచ కప్ 2023 యొక్క మొదటి సెమీ-ఫైనల్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో మహ్మద్ షమీ ఏడు వికెట్లు పడగొట్టి భారత్ ను ఫైనల్ కు చేర్చాడు. పేసర్ తన మ్యాచ్ విన్నింగ్ స్పెల్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా ఎంపికయ్యాడు. భారత వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ షమీ అద్భుతమైన స్పెల్ తర్వాత అతని చేతిని ముద్దుపెట్టుకున్నాడు.

David Miller Century: ప్రపంచకప్‌ 2023లో తొలి సెంచరీ నమోదు చేసిన డేవిడ్ మిల్లర్, వీరోచిత శతకంతో దక్షిణాఫ్రికాను ఆదుకున్న స్టార్ బ్యాటర్

Hazarath Reddy

ప్రపంచకప్‌-2023 రెండో సెమీ ఫైనల్‌.. కోల్‌కతాలోని ఈడెన్‌ గార్డెన్స్‌ వేదికగా సౌతాఫ్రికా,ఆస్ట్రేలియా తలపడుతున్నాయి. ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో సెమీఫైనల్లో తొలుత బ్యాటింగ్‌ చేసిన దక్షిణాఫ్రికా నామమాత్రపు స్కోర్‌కే పరిమితమైంది.

World Cup Final: వీడియో ఇదిగో, ఫైనల్ మ్యాచ్ కోసం అహ్మదాబాద్‌ బయలుదేరిన టీమిండియా, నవంబర్ 19న మ్యాచ్

Hazarath Reddy

గుజరాత్‌లోని అహ్మదాబాద్‌కి విమానంలో వెళ్లేందుకు భారత క్రికెట్ జట్టు ముంబై విమానాశ్రయానికి చేరుకుంది. #ICCWorldCup2023 ఫైనల్ మ్యాచ్ నవంబర్ 19 ఆదివారం అహ్మదాబాద్‌లో జరుగుతుంది.

Rohit Sharma Lifting Shami Video: వీడియో ఇదిగో, మహ్మద్ షమీని అమాంతం గాల్లోకి ఎత్తేసి సంబరాలు జరుపుకున్న రోహిత్ శర్మ

Hazarath Reddy

ICC ప్రపంచ కప్ 2023 మొదటి సెమీ-ఫైనల్‌లో భారత్ 70 పరుగుల తేడాతో న్యూజిలాండ్‌ను ఓడించింది. ఈ విజయంతో భారత జట్టు ఐసీసీ క్రికెట్ ప్రపంచకప్ 2023లో ఫైనల్‌లోకి ప్రవేశించింది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఇది జరగనుంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు 4 వికెట్ల నష్టానికి 397 పరుగులు చేసింది.

Advertisement

SA vs AUS Semi-Final: పంజా విసురుతున్న ఆస్ట్రేలియా బౌలర్లు, 40 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి పీకలోతు క‌ష్టాల్లో పడిన ద‌క్షిణాఫ్రికా

Hazarath Reddy

వ‌ర‌ల్డ్ క‌ప్ రెండో సెమీఫైన‌ల్లో ద‌క్షిణాఫ్రికా పీకలోతు క‌ష్టాల్లో ప‌డింది. ఆస్ట్రేలియా బౌల‌ర్ల ధాటికి పన్నెండు ఓవర్లకే నలుగురు పెవిలియ‌న్ చేరారు. తొలి ఓవ‌ర్లోనే తెంబ బ‌వుమా(0)ను మిచెల్ స్టార్క్ గోల్డెన్ డ‌క్‌గా వెన‌క్కి పంపాడు.

Fans Sing Vande Mataram At Wankhede: వీడియో ఇదిగో, మ్యాచ్ చేజారుతుందనే సమయంలో వందేమాతర గీతంతో హోరెత్తిన వాంఖడే స్టేడియం, వీడియో వైరల్

Hazarath Reddy

హై-వోల్టేజ్ సెమీ-ఫైనల్‌లో భారత్ న్యూజిలాండ్‌ మ్యాచ్ లో ఓటమి వైపు పయనిస్తున్న తరుణంలో భారత జట్టు ఆటగాళ్లలో నైతిక స్థైర్యం తగ్గిపోయింది. ఎందుకంటే భారత్ వికెట్ల కోసం వెతుకుతోంది. డారిల్ మిచెల్ మరియు కేన్ విలియమ్సన్ సుదీర్ఘ భాగస్వామ్యంతో ఆడుతున్నారు. ఈ సమయంలో 'వందేమాతరం' ఆలపించడం ద్వారా అభిమానులు మనోధైర్యాన్ని పెంచుకున్నారు.

MS Dhoni Hugs Woman Video: ఆశీర్వాదం కోరుతూ మహిళను గుండెలకు హత్తుకున్న ఎంఎస్ ధోని, హృదయం హత్తుకునే వీడియో సోషల్ మీడియాలో వైరల్

Hazarath Reddy

హత్తుకునే వీడియోలో, చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ఆ మహిళతో చాట్ చేయడం, ఆమె ఆశీర్వాదం కోరే ముందు ఆమెను కౌగిలించుకోవడం కనిపించింది. ధోనీ, అతని భార్య సాక్షి సింగ్ రావత్ ఉత్తరాఖండ్‌లోని ల్వాలీకి వెళ్లారు, ఆ చిత్రాలను సాక్షి ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నారు.

IND vs NZ, World Cup 2023: మొహమ్మద్ షమీ దెబ్బకి రాహుల్‌, జడేజాల ఏడు క్యాచ్‌లు ప్రదర్శన తెర వెనక్కి, నిజానికి టీమిండియాను ఫైనల్‌కు చేర్చింది వాళ్లిద్దరే..

Hazarath Reddy

భారత్‌, న్యూజిలాండ్‌ మధ్య జరిగిన ప్రపంచకప్‌ 2023 తొలి సెమీఫైనల్లో మొహమ్మద్ షమీ ప్రదర్శన ముందు ఇద్దరు గ్రేట్ హీరోల ప్రదర్శన తెర వెనక్కి వెళ్లింది.వాళ్లిద్దరూ వికెట్‌కీపర్‌ కేఎల్‌ రాహుల్‌, రవీంద్ర జడేజా. మైదానంలో పాదరసంలా కదిలి అద్భుతమైన 7 క్యాచ్‌లు పట్టుకుని భారత్ ను ఫైనల్ కు చేర్చారు.

Advertisement
Advertisement