క్రీడలు

Dhoni Stumping Video: దటీజ్ ధోనీ కీపింగ్, మహేంద్రుడి టైమింగ్‌ దెబ్బకు బిత్తరపోయిన గిల్, మెరుపు వేగంతో గిల్‌ను స్టంపౌట్‌ చేసిన వీడియో వైరల్

Hazarath Reddy

శుభమాన్ గిల్ ని అద్భుతమైన టైమింగ్ తో పెవిలియన్ కి పంపాడు. తన కీపింగ్‌ టైమింగ్‌ ఎంత ఫాస్ట్‌గా ఉంటుందో మరోసారి రుచి చూపించాడు. గిల్‌ను ధోని స్టంపౌట్‌ చేసిన తీరు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

MS Dhoni Stumping Video: వీడియో ఇదిగో, ధోనీ వ్యూహం దెబ్బకు గిల్‌కి దిమ్మతిరిగింది, రవీంద్ర జడేజా బౌలింగ్‌లో షాట్ కోసం ముందుకు వచ్చి బోల్తా పడిన బ్యాటర్

Hazarath Reddy

ఐపీఎల్‌ 16వ సీజన్‌లో భాగంగా సీఎస్‌కే, గుజరాత్‌ టైటాన్స్‌ మధ్య ఫైనల్‌ మ్యాచ్‌ మొదలైంది. టాస్‌ గెలిచిన సీఎస్‌కే బౌలింగ్‌ ఎంచుకుంది.వృద్ధిమాన్ సాహా, శుభ్‌మ‌న్ గిల్‌లు దూకుడుగా ఆడుతున్నారు. ఇద్ద‌రూ పోటాపోటీగా బౌండ‌రీలు కొడుతున్నారు. ప‌వ‌ర్ ప్లే పూర్తి అయ్యింది.67 పరుగుల వద్ద గిల్ ఔట్ అయ్యారు. జడేజా బౌలింగ్ లో ముందుకు వచ్చి ఆడగా కీపర్ ధోనీ స్టంప్ ఔట్ చేశాడు.

IPL 2023 Final: శుభమాన్ గిల్ వర్సెస్ రుతురాజ్, ఈ సారి కప్ తీసుకుపోయేదెవరు, సీఎస్‌కే, గుజరాత్‌ టైటాన్స్‌ మధ్య మొదలైన ఫైనల్ పోరు, టాస్‌ గెలిచిన బౌలింగ్‌ ఎంచుకున్న సీఎస్‌కే

Hazarath Reddy

ఐపీఎల్‌ 16వ సీజన్‌లో భాగంగా సీఎస్‌కే, గుజరాత్‌ టైటాన్స్‌ మధ్య ఫైనల్‌ మ్యాచ్‌ మొదలైంది. టాస్‌ గెలిచిన సీఎస్‌కే బౌలింగ్‌ ఎంచుకుంది. ఇరుజట్లు ఇప్పటివరకు నాలుగుసార్లు తలపడగా.. గుజరాత్‌ టైటాన్స్‌ మూడుసార్లు.. సీఎస్‌కే ఒకసారి విజయం సాధించాయి.

IPL 2023 Final: గుజరాత్ అంటే బ్యాటింగ్‌లో పూనకాలతో ఊగిపోతున్న రుతురాజ్‌ గైక్వాడ్‌, ఈ సారి ఏం బాదుడు బాదుతాడోనంటూ వణిపోతున్న గుజరాత్‌ టైటాన్స్‌

Hazarath Reddy

ఐపీఎల్‌-2023 ఫైనల్‌ మ్యాచ్‌ రిజర్వ్‌ డే నేటికి వాయిదా పడిన సంగతి విదితమే. ఈ మ్యాచ్ లో సీఎస్‌కే ఓపెనర్‌ రుతురాజ్‌ గైక్వాడ్‌ను చూసి గుజరాత్ టైటాన్స్ వణికిపోతోంది. ఈ సీఎస్‌కే ఓపెనర్‌ ఐపీఎల్‌లో గుజరాత్‌తో ఆడిన 4 మ్యాచ్‌ల్లో 4 అర్ధ సెంచరీలు బాదాడు. దీంతో ఈ సారి ఏం బాదుడు బాదుతాడోనని గుజరాత్ వణుకుతోంది.

Advertisement

CSK Fans Sleeping at Railway Station: నిన్న మ్యాచ్ రద్దు, నేటి మ్యాచ్ కోసం రైల్వే స్టేషన్లో పడిగాపులు కాస్తున్న సీఎస్కే అభిమానులు, చిత్రాలు సోషల్ మీడియాలో వైరల్

Hazarath Reddy

చాలా మంది CSK అభిమానులకు, IPL 2023 ఫైనల్ మ్యాచ్ నిరాశపరిచింది, ఎందుకంటే ఆదివారం GT వర్సెస్ CSK మధ్య జరిగిన మెగా ఫైనల్ ఎన్‌కౌంటర్‌ను వర్షం ఆపేసింది. మ్యాచ్ వాష్ అవుట్ అవుతున్న సమయంలో, చాలా మంది CSK అభిమానులు రైల్వే స్టేషన్‌లో నిద్రిస్తున్న ఫోటో వైరల్ అవుతోంది.

IPL 2023 Final: సోమవారం కూడా ఫైనల్ మ్యాచ్‌ జరుగకపోతే పరిస్థితి ఏంటి? ఐపీఎల్‌ నిబంధనలు ఏం చెప్తున్నాయి? రూల్స్ ప్రకారం ట్రోఫీ ఎవరికి దక్కుతుందంటే!

VNS

ఐపీఎల్ 16వ సీజ‌న్ ఫైన‌ల్‌కు (IPL Final) వ‌ర్షం అంతరాయం క‌లిగిస్తోంది. అహ్మ‌దాబాద్‌లోని న‌రేంద్ర మోడీ స్టేడియంలో భారీ వ‌ర్షం కురుస్తోంది. దాంతో, ఒక‌వేళ వ‌రుణుడు శాంతించ‌కుంటే ప‌రిస్థితి ఏంటీ? ఇరుజ‌ట్లతో పాటు అభిమానుల్లో ఆందోళ‌న నెల‌కొంది. అయితే.. ఏమాత్రం అవ‌కాశం ఉన్నా మ్యాచ్ ఆడిస్తారు. అలా వీలుప‌డ‌న‌ప్పుడు ఏం చేస్తారంటే..?

Ambati Rayudu Retirement, IPL Final 2023: ఐపీఎల్ నుంచి అంబటి రాయుడు రిటైర్ అవుతున్నట్లు ప్రకటన, సుదీర్ఘ కెరీర్ కు స్వస్తి పలికిన తెలుగు క్రికెటర్..

kanha

CSK జట్టు ఆటగాడు అంబటి రాయుడు IPL నుండి రిటైర్మెంట్ ప్రకటించాడు. ఫైనల్ మ్యాచ్ తర్వాత రిటైర్మెంట్ నిర్ణయం తీసుకున్నట్లు అంబటి రాయుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.

What Is Written in Sanskrit on IPL Trophy: ఐపీఎల్ ట్రోఫీ మీద సంస్కృతంలో రాసి ఉన్న పద్యానికి అర్థం ఏంటో తెలిస్తే షాక్ తింటారు..

kanha

ఐపీఎల్ ట్రోఫీపై సంస్కృతంలో ఒక శ్లోకం రాసి ఉంది – 'యాత్ర ప్రతిభా ప్రాప్నోతి' దాని అర్థం తెలుసా? ఈ పద్యం యొక్క అర్థం యువతకు ప్రేరణ యొక్క మూలం - ప్రతిభ మరియు అవకాశం కలిసే చోట.

Advertisement

India vs Pakistan, Men's Junior Asia Cup 2023 Live Streaming Online: IND vs PAK హాకీ మ్యాచ్‌ని ఆన్‌లైన్‌లో ఉచిత టెలికాస్ట్ ద్వారా చూడండి, లింక్ ఇదే..

kanha

మే 28, శనివారం గ్రూప్ దశలో తమ విజయాల పరంపరను కొనసాగించే ప్రయత్నంలో భారత జూనియర్ పురుషుల హాకీ జట్టు తమ చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో తలపడనుంది.

Gujrat in IPl Final: ఫైనల్స్‌కు దూసుకెళ్లిన గుజరాత్‌, కీలక మ్యాచ్‌లో అదరగొట్టిన గిల్‌, భారీ లక్ష్యాన్ని చేధించలేక చతికిలపడ్డ ముంబై

VNS

ఐపీఎల్ 2023లో (IPL 2023) భాగంగా ముంబై ఇండియ‌న్స్‌తో (Mumbai Indians) జ‌రిగిన మ్యాచ్‌లో గుజ‌రాత్ టైటాన్స్ (Gujrat Titans) విజ‌యం సాధించింది. త‌ద్వారా వ‌రుస‌గా రెండో సీజ‌న్‌లోనూ గుజ‌రాత్ ఫైన‌ల్‌కు (GT in IPL Final) చేరుకుంది.

Subhman Gill Hits Third Century: మరోసారి విజృంభించిన శుభ్‌మన్‌ గిల్, ఐపీఎల్‌లో మూడో సెంచరీ నమోదు, ముంబై ముందు భారీ లక్ష్యం, ఆటమధ్యలోనే రిటైర్డ్ ఔట్ అయిన గుజరాత్ ప్లేయర్

VNS

ఐపీఎల్ 16వ సీజ‌న్ క్వాలిఫైయ‌ర్ 2 పోరులో గుజ‌రాత్ ఓపెన‌ర్ శుభ్‌మ‌న్ గిల్ (129) సెంచ‌రీ బాదాడు.కెరీర్‌లోనే భీక‌ర ఫామ్‌లో ఉన్న అత‌ను ఐపీఎల్‌లో మూడో సెంచ‌రీ కొట్టాడు. 30 ర‌న్స్ వ‌ద్ద ఔట‌య్యే ప్ర‌మాదం త‌ప్పించుకున్న అత‌ను.. ఆ త‌ర్వాత ముంబై బౌల‌ర్ల‌పై విరుచుకుప‌డ్డాడు. సాయి సుద‌ర్శ‌న్(43 రిటైర్డ్ ఔట్) రాణించ‌డంతో గుజ‌రాత్ (Gujrat) రెండు వికెట్ల న‌ష్టానికి 233 ప‌రుగులు చేసింది.

Akash Madhwal: స్టార్‌ పేసర్‌ జస్ప్రీత్‌ బుమ్రా ఎక్కడ..నేను ఎక్కడ, ముంబయి ఇండియన్స్‌ పేసర్‌ ఆకాశ్‌ మధ్వాల్‌ సంచలన వ్యాఖ్యలు

Hazarath Reddy

లక్నో సూపర్‌జెయింట్స్‌తో ఎలిమినేటర్‌లో 3.3 ఓవర్లలో కేవలం 5 పరుగులే ఇచ్చి 5 వికెట్లు తీసిన ఆకాశ్ మధ్వాల్‌ అందిరకీ గుర్తుండే ఉంటుంది. ఇప్పుడు ఈ స్టార్ పేసర్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. స్టార్‌ పేసర్‌ జస్ప్రీత్‌ బుమ్రాకు తాను ప్రత్యామ్నాయం కాదని... తన వంతు బాధ్యతను మాత్రమే నిర్వర్తిస్తున్నానని ముంబయి ఇండియన్స్‌ సంచలన పేసర్‌ అన్నాడు.

Advertisement

IPL 2023: ముంబైతో చావోరేవో తేల్చుకోనున్న గుజరాత్, ఆ స్టార్లు ఇద్దరినీ బరిలోకి దించి విక్టరీ కొట్టాలని భారీ వ్యూహం

Hazarath Reddy

IPL 2023 క్వాలిఫైయర్ 2లో రోహిత్ శర్మ ముంబై ఇండియన్స్, హార్దిక్ పాండ్యా గుజరాత్ టైటాన్స్ ఒకదానితో ఒకటి పోటీపడతాయి. శక్తివంతమైన ముంబైపై విజయం సాధించే ప్రయత్నంలో, గుజరాత్ వారి ఆటలో కొన్ని మార్పులను పరిగణించవచ్చు. GT IPL 2023 ఫైనల్‌కు తమ స్థానాన్ని బలోపేతం చేయడానికి ఐరిష్ పేసర్ జాషువా లిటిల్, భారత అన్‌క్యాప్డ్ బ్యాటర్ సాయి సుదర్శన్‌లను తీసుకురావచ్చు.

WTC Final 2023: భారత్‌-ఆస్ట్రేలియా మధ్య డబ్ల్యూటీసీ ఫైనల్, గెలిస్తే రూ. 13. 2 కోట్లు, ఓడిన జట్టుకు రూ. 6.61 కోట్లు, డబ్ల్యూటీసీ 2021-23 ప్రైజ్‌మనీ వివరాలు ప్రకటించిన ఐసీసీ

Hazarath Reddy

డబ్ల్యూటీసీ 2021-23 ప్రైజ్‌మనీ వివరాలను ఐసీసీ ఇవాళ (మే 26) ప్రకటించింది. భారత్‌-ఆస్ట్రేలియా మధ్య జూన్‌ 7న ప్రారంభంకానున్న ప్రతిష్టాత్మక ఫైనల్లో విజేతకు 1.6 మిలియన్‌ డాలర్ల ప్రైజ్‌మనీ (Rs 13.2 crore) దక్కనుండగా.. రన్నరప్‌కు 800,000 డాలర్లు ప్రైజ్‌మనీ ( Rs. 6.61 crore) రూపంలో దక్కనున్నాయి.

IPL 2023: రూ.18.50 కోట్లు పెట్టి కొంటే ఇక్కడ అట్టర్ ఫ్లాప్, అక్కడ మాత్రం ఫోర్లు, సిక్సర్లతో బౌలర్లను హడలెత్తించాడు, టీ20 బ్లాస్ట్‌లో సామ్‌ కర్రన్‌ విశ్వరూపం

Hazarath Reddy

పంజాబ్‌ కింగ్స్‌ ఆల్‌రౌండర్‌ సామ్‌ కర్రన్‌ ఐపీఎల్‌ చరిత్రలోనే అత్యధిక ధర (2023లో రూ. 18.50 కోట్లు) పలికిన ఆటగాడిగా రికార్డు సృష్టించిన సంగతి విదితమే. అయితే అనుకున్నంతగా రాణించలేకపోవడంతో పంజాబ్ ఇంటి దారి పట్టింది. ఈ ఆటగాడు ఇంగ్లండ్‌ వేదికగా జరుగుతున్న టీ20 బ్లాస్ట్‌లో చెలరేగిపోయాడు

IPL 2023, LSG vs MI : ప్లే ఆఫ్స్ లో లక్నోను చిత్తు చేసిన రోహిత్ సేన, ఫైనల్ కు మరో అడుగు దూరంలో నిలిచిన ముంబై ఇండియన్స్..

kanha

IPL 2023 ఎలిమినేటర్ మ్యాచ్ బుధవారం చెన్నైలో లక్నో సూపర్ జెయింట్ మరియు ముంబై ఇండియన్స్ మధ్య జరిగింది. ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్‌లో ముంబై జట్టు 81 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ విజయంతో రోహిత్ సేన రెండో క్వాలిఫయర్ మ్యాచ్‌లోకి అడుగుపెట్టింది.

Advertisement

IPL 2023, LSG vs MI: నేడు జరిగే ముంబై ఇండియన్స్, లక్నో సూపర్‌జెయింట్స్ మ్యాచులో ముంబైదే విజయం..ముందే జోస్యం చెప్పిన డివిలియర్స్

kanha

ఈ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ విజయం సాధిస్తుందని దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ ఏబీ డివిలియర్స్ జోస్యం చెప్పాడు.

IPL 2023: వీడియో ఇదిగో, ఆ బాల్ నోబాల్ కాకుండా ఉండి ఉంటే చెన్నై ఓటమి పాలయ్యేదా, రుతురాజ్ గైక్వాడ్ 60 పరుగులు ఎంత విలువైనవంటే..

Hazarath Reddy

ఐపీఎల్‌ 16వ సీజన్‌లో భాగంగా గుజరాత్‌టైటాన్స్‌తో క్వాలిఫయర్‌-1 పోరులో సీఎస్‌కే ఓపెనర్‌ రుతురాజ్‌కు ఇన్నింగ్స్‌ ఆరంభంలోనే నోబాల్‌ రూపంలో అదృష్టం కలిసొచ్చింది. రుతురాజ్ 2 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద దర్శన్‌ నల్కండే బౌలింగ్‌లో ఇన్నింగ్స్‌ రెండో ఓవర్‌ మూడో బంతికి ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు.

IPL 2023: ధోనీ దిమ్మతిరిగే వ్యూహానికి బలైన హార్దిక్ పాండ్యా, మహేష్ తీక్షణ బౌలింగ్‌లో బంతిని అంచనావేయలేక జడేజాకు క్యాచ్, వీడియో ఇదిగో..

Hazarath Reddy

MS ధోని ఒక మాస్టర్ వ్యూహకర్త, ఇది అందరికీ తెలిసిన వాస్తవం. మే 23, మంగళవారం నాడు గుజరాత్ టైటాన్స్ vs చెన్నై సూపర్ కింగ్స్ క్వాలిఫైయర్ 1 సందర్భంగా హార్దిక్ పాండ్యాను అవుట్ చేయడానికి అతను అద్భుతమైన ఫీల్డింగ్ మార్పు చేసాడు.

IPL 2023: రవీంద్ర జడేజా సరికొత్త రికార్డు, IPL చరిత్రలో 150 వికెట్లు తీసిన తొలి లెఫ్టార్మ్ బౌలర్‌గా నిలిచిన జడ్డూ భాయ్

Hazarath Reddy

మే 23, మంగళవారం జరిగిన గుజరాత్ టైటాన్స్ vs చెన్నై సూపర్ కింగ్స్ క్వాలిఫయర్ 1 మ్యాచ్‌లో రవీంద్ర జడేజా IPL చరిత్రలో 150 వికెట్లు తీసిన తొలి లెఫ్టార్మ్ బౌలర్‌గా నిలిచాడు. జడేజా తర్వాత అత్యధిక వికెట్లు తీసిన ఎడమచేతి వాటం బౌలర్ అక్షర్ పటేల్. మొత్తం 112 వికెట్లు తీసాడు.

Advertisement
Advertisement