క్రీడలు
RR Vs PBKS: రాజస్థాన్ ప్లే ఆఫ్స్‌ ఆశలు సజీవం, పంజాబ్‌తో మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో ఘనవిజయం, అర్ధసెంచరీలతో మెరిసిన యశస్వీ, పడిక్కల్
VNSఐపీఎల్ 2023 (IPL 2023)లో భాగంగా ధ‌ర్మ‌శాల వేదిక‌గా పంజాబ్ కింగ్స్‌తో (Punjab Kings) జ‌రిగిన మ్యాచ్‌లో రాజ‌స్థాన్ రాయ‌ల్స్ విజ‌యం సాధించింది. పంజాబ్ నిర్దేశించిన ల‌క్ష్యాన్ని రాజ‌స్థాన్ 19.4 ఓవ‌ర్ల‌లో 6 వికెట్లు కోల్పోయి ఛేదించింది. దీంతో రాజ‌స్థాన్ ప్లే ఆఫ్స్ ఆశలు స‌జీవంగా ఉన్నాయి. అయితే.. మిగిలిన జ‌ట్ల ఫ‌లితాల బ‌ట్టి రాజ‌స్థాన్ ప్లే ఆఫ్స్‌కు చేరేది లేనిది తెలుస్తుంది.
IPL 2023: కోహ్లీ సెంచరీతో ఫ్యాన్స్‌కు పండగ, వాళ్లిద్దర్నీ ఘోరంగా ట్రోల్ చేస్తూ ఆడుకుంటున్న ఆర్‌సీబీ అభిమానులుచ మీమ్స్ ఇవిగో..
Hazarath Reddyవిరాట్ కోహ్లీ గురువారం రాత్రి సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో సెంచరీతో చెలరేగిన సంగతి విదితమే. 63 బంతుల్లో 12 ఫోర్లు, 4 సిక్సర్లతో 100 పరుగులు చేశాడు. ఛేజింగ్‌లో ఒత్తిడికి లోనవకుండా చక్కగా ఆడి తన జట్టు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును గెలిపించాడు.
Virat Kohli Six Video: కోహ్లీ సిక్స్ వీడియో ఇదిగో, బిత్తరపోయి అలాగే చూస్తుండిపోయిన కెప్టెన్‌ ఫాఫ్‌ డుప్లెసిస్‌, సన్‌రైజర్స్‌పై 8 వికెట్ల తేడాతో ఆర్సీబీ విక్టరీ
Hazarath Reddyఐపీఎల్‌-2023లో భాగంగా ఆర్సీబీతో మ్యాచ్‌ సందర్భంగా సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ బౌలర్లకు విరాట్ కోహ్లీ చుక్కలు చూపించాడు. ప్లే ఆఫ్స్‌ రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో ఆర్సీబీ స్టార్‌ విరాట్‌ కోహ్లి సెంచరీతో మెరిశాడు. 63 బంతులు ఎదుర్కొని 100 పరుగులు చేసిన కోహ్లి ఇన్నింగ్స్‌లో 12 ఫోర్లు, 4 సిక్సర్లు ఉన్నాయి.
IPL 2023: గెలిస్తే ముందుకు, ఓడితే ఇంటికి, నేడు పంజాబ్‌తో చావో రేవో తేల్చుకోనున్న రాజస్తాన్‌, ఆశలన్నీ ట్రెంట్‌ బౌల్ట్‌ పైనే పెట్టుకున్న PBKS
Hazarath Reddyఐపీఎల్‌-2023లో భాగంగా నేడు ధర్మశాల వేదికగా కీలక మ్యాచ్‌లో పంజాబ్‌ కింగ్స్‌, రాజస్తాన్‌ రాయల్స్‌ తలపడనుంది. ఈ మ్యాచ్‌లో ఏ జట్టు ఓడినా ఇంటిముఖం పట్టక తప్పదు. ఇప్పటివరకు 13 మ్యాచ్‌లు ఆడిన రాజస్తాన్‌ రాయల్స్‌ ఆరింట విజయం సాధించి పాయింట్ల పట్టికలో ఆరో స్థానంలో ఉంది.అయితే రాజస్తాన్‌కు ప్లే ఆఫ్స్‌కు చేరే దారులు ఇంకా మూసుకుపోలేదు.
IPL 2023: రూ. 8 కోట్లు పెట్టి ముంబై కొనడం ఎందుకు, మధ్యలోనే వదిలేసి వెళ్లిపోవడం ఎందుకు, జోఫ్రా ఆర్చర్‌పై మండిపడిన సునీల్‌ గవాస్కర్‌, ఒక్క రూపాయి కూడా చెల్లించొద్దని హితవు
Hazarath Reddyఇంగ్లండ్‌ పేసర్‌, ముంబై ఇండియన్స్‌ స్టార్ బౌలర్ జోఫ్రా ఆర్చర్‌పై టీమిండియా దిగ్గజం సునీల్ గవాస్కర్మండిపడ్డాడు. కోట్లు కుమ్మరించి కొనుక్కుంటే ముంబై ఇండియన్స్‌కు అతడి వల్ల ఏమి ఒరిగిందని ప్రశ్నించాడు.అతడికి రూ. 8 కోట్ల మొత్తం చెల్లించాల్సిన అవసరం లేదని అభిప్రాయపడ్డాడు.
IPL 2023 Playoffs: ఐపీఎల్ ప్లే ఆఫ్‌కు వెళ్లే మిగతా మూడు జట్లు ఇవిగో, ఆ రెండు జట్లకు చావో రేవో తేల్చుకునే పరిస్థితి, ముంబై, ఆర్సీబీకి అవకాశాలు ఎలా ఉన్నాయంటే..
Hazarath Reddyఐపీఎల్ లీగ్ దశలో ఇంకా ఆరు మ్యాచులు మిగిలి ఉన్నాయి.ఈ నేపథ్యంలో ప్లే ఆఫ్ కు నాలుగు వెళ్లనున్నాయి. గుజరాత్ టైటాన్స్ ఇప్పటికే ఆడిన 13 మ్యాచులకు గాను 9 విజయాలు, 18 పాయింట్లతో ప్లే ఆఫ్ లోకి అడుగు పెట్టింది.మిగిలిన మూడు కోసం పోటీ తీవ్రంగా నెలకొని ఉంది.
IPL 2023: ప్లే ఆఫ్స్‌ రేసు ముందు ధోనీ సేనకు భారీ షాక్, చెన్నై సూపర్ కింగ్స్‌పై కేసు ఫైల్, ఐపీఎల్ టికెట్ల అమ్మకాల విషయంలో అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు
Hazarath Reddyఐపీఎల్‌-2023లో సీఎస్‌కేకు భారీ షాక్ తగిలింది. సీఎస్‌కే మెనెజ్‌మెంట్‌ ఐపీఎల్ టికెట్ల అమ్మకాల విషయంలో అక్రమాలకు పాల్పడినట్లు కేసు ఫైల్ అయింది. చెన్నైకు చెందిన ఓ న్యాయవాది కేసు దాఖలు చేశారు.సీఎస్‌కేతో పాటు బీసీసీఐ, తమిళనాడు క్రికెట్ అసోసియేషన్‌పై ఆయన చెన్నై సివిల్‌ కోర్టులో మే17న ఫిటిషిన్‌ వేశారు.
Spectator Watches IPL 2023: స్టేడియంలో ఎదురుగా మ్యాచ్ జరుగుతుండగానే అతను చేసిన పనికి షాకైన ఫ్యాన్స్, ట్విట్టర్‌లో వైరల్‌ వీడియోపై ఫన్నీ కామెంట్లు
VNSక్రికెట్ స్టేడియంలో జరుగుతున్న లక్నో, ముంబై మ్యాచ్ చూసేందుకు అతను వచ్చాడు. ఎదురుగానే మ్యాచ్ జరుగుతున్నప్పటికీ అతను మాత్రం ఫోన్‌ లో మ్యాచ్ లైవ్ చూస్తున్నాడు. దీన్ని అతని వెనుక ఉన్న వ్యక్తి వీడియో తీసి ట్విట్లర్‌ లో పోస్టు చేశాడు. దాంతో వైరల్‌గా మారింది
IPL 2023: మరీ ఇంత చెత్త బౌలింగ్ ఏంది సామి, 4 ఓవర్లకు 50 పరుగులా, క్రిస్‌ జోర్డాన్‌ దారుణ ప్రదర్శనపై మండిపడుతున్న ముంబై ఇండియన్స్‌ అభిమానులు
Hazarath Reddyఐపీఎల్‌-2023లో ఇంగ్లండ్‌ ఫాస్ట్‌ బౌలర్‌, ముంబై ఇండియన్స్‌ పేసర్‌ క్రిస్‌ జోర్డాన్‌ అత్యంత చెత్త ప్రదర్శన కనబరుస్తున్నాడు.అర్చర్‌ స్థానంలో జట్టులోకి వచ్చిన జోర్డాన్‌ తీవ్ర నిరాశపరుస్తున్నాడు.
KL Rahul on Social Media Trolls: చెత్తగా ఆడాలని ఎవరూ కోరుకోరు, సోషల్ మీడియా ట్రోలింగ్‌పై కన్నీటి పర్యంతమైన టీమిండియా క్రికెటర్ కేఎల్ రాహుల్
Hazarath Reddyఏడాది కాలంగా కెఎల్ రాహుల్ లక్ష్యంగా సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్ జరుగుతున్న సంగతి విదితమే. దీనిపై టీమిండియా క్రికెటర్ కేఎల్ రాహుల్ ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ ట్రోలింగ్ తనతోపాటు కొంతమంది ఇతర ప్లేయర్స్ ను కూడా అప్పుడప్పుడూ ప్రభావితం చేస్తుందని రాహుల్ వెల్లడించాడు.
No India-Pakistan Bilateral Series: పాకిస్తాన్‌తో ఎటువంటి సిరీస్ లు ఆడేది లేదు, స్పష్టం చేసిన బీసీసీఐ
Hazarath Reddyమే 17, బుధవారం నాడు భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) తటస్థ వేదికలో పాకిస్తాన్‌తో టెస్ట్ సిరీస్‌లో భారత్ ఆడుతుందనే చర్చల నివేదికలను కొట్టిపారేసింది.
Sourav Ganguly's Security Cover: సౌరవ్ గంగూలీ భద్రతను Z కేటగిరీకి అప్‌గ్రేడ్ చేయనున్నట్లు తెలిపిన పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం
Hazarath Reddyభారత క్రికెట్ మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ భద్రతను పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం Z కేటగిరీకి అప్‌గ్రేడ్ చేయనున్నట్లు అధికారులు తెలిపారు.
IPL 2023: గత సీజన్ స్టార్ ఉమ్రాన్ మాలిక్‌కి సన్ రైజర్స్ లో ఇంకా ఎందుకు అవకాశం రావడం లేదు? కోచ్ లారా అసలు నిజం చెప్పేశాడు..
kanhaగత సీజన్‌లో తుఫాను బౌలింగ్‌తో బ్యాట్స్‌మెన్‌ల గుండెల్లో భయం సృష్టించిన సన్‌రైజర్స్ హైదరాబాద్ యువ పేసర్ ఉమ్రాన్ మాలిక్.. ఐపీఎల్ 16వ ఎడిషన్‌లో ప్లేయింగ్ ఎలెవన్‌లో చేరాలని తహతహలాడుతున్నాడు. ఈ సీజన్‌లో తొలి మ్యాచ్‌ల్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ అతనికి అవకాశం ఇచ్చినప్పటికీ, ఆ తర్వాత అతనికి ప్లేయింగ్ ఎలెవన్‌లో స్థానం లేకుండా పోయింది.
IPL 2023 Playoffs Race: ఆ నాలుగు జట్లు ప్లేఆఫ్ రేసు నుంచి ఔట్, ప్లేఆఫ్ చేరే మిగతా మూడు జట్లు ఇవే, చివరి మ్యాచ్‌లో చావో రేవో తేల్చుకోవాల్సిన జట్లు ఇవిగో..
Hazarath Reddyఐపీఎల్ ప‌ద‌హారో సీజ‌న్ ర‌స‌వ‌త్త‌రంగా సాగుతోంది. ప్లే ఆఫ్స్‌లో నిలిచేందుకు ఆరు జ‌ట్లు పోటీ ప‌డుతున్నాయి. సీజ‌న్ చివ‌రి ద‌శ‌కు వ‌చ్చినా కూడా ప్లే ఆఫ్స్ బెర్తులు మాత్రం ఇంకా ఖ‌రారు కాలేదు.
IPL 2023: చివరి ఓవర్‌లో 2 పరుగులు ఇచ్చి 3 వికెట్లు, సరికొత్త రికార్డు నెలకొల్పిన భువనేశ్వర్ కుమార్, అయినా ప్లే ఆఫ్ రేసు నుంచి నిష్క్రమించిన సన్‌రైజర్స్‌
Hazarath Reddyటీమిండియాపేసర్‌, సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ స్టార్‌ బౌలర్‌ భువనేశ్వర్‌ కుమార్‌..ఐపీఎల్‌-2023లో భాగంగా గుజరాత్‌ టైటాన్స్‌ మ్యాచ్‌లో అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. ఐపీఎల్‌లో రెండో సారి ఫైవ్‌ వికెట్‌ హాల్‌ సాధించాడు. భువీ తన నాలుగు ఓవర్ల కోటాలో 30 పరుగులిచ్చి 5 వికెట్లు పడగొట్టాడు.
IPL 2023: ప్లేఆఫ్స్‌కు చేరిన గుజరాత్‌ టైటాన్స్‌కు బిగ్ షాక్, చీలమండ గాయంతో స్టార్ స్పిన్నర్ నూర్‌ ఆహ్మద్‌ దూరం, టోర్నీ నుంచి వైదొలిగే అవకాశం
Hazarath Reddyఐపీఎల్‌-2023లో ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించిన తొలి జట్టుగా గుజరాత్‌ టైటాన్స్‌ నిలిచింది.తాజాగా గుజరాత్‌ టైటాన్స్‌కు బిగ్‌షాక్‌ తగిలింది. ఆ జట్టు స్పిన్నర్‌ నూర్‌ ఆహ్మద్‌కు తీవ్రగాయమైంది. ఎస్‌ఆర్‌హెచ్‌ ఇన్నింగ్స్‌ 16 ఓవర్‌ వేసిన నూర్‌ ఆహ్మద్‌ బౌలింగ్‌లో హెన్రిచ్ క్లాసెన్ స్ట్రైట్‌గా భారీ షాట్‌ ఆడాడు.
MS Dhoni Retirement: ఎంఎస్ ధోని రిటైర్‌మెంట్ ఇప్పట్లో ఉండదు, వచ్చే సీజన్ కూడా ఆడుతాడని తెలిపిన CSK CEO కాశీ విశ్వనాథన్
Hazarath Reddyఎంఎస్ ధోని వచ్చే సీజన్ ఐపిఎల్‌లో ఆడబోతున్నాడా లేదా సీజన్ చివరిలో అతను తన ఐపిఎల్ కెరీర్‌కు సమయం ఇవ్వబోతున్నాడా అనేది మనలో చాలా మందిని వేధించే ప్రశ్న.తాజాగా దీనిపై CSK CEO స్పందించారు.
IPL 2023: చేతికి గాయమైన డ్యాన్స్ ఆపని చీర్లీడర్, సోషల్ మీడియాలో ఫోటో వైరల్, వివిధ రకాల కామెంట్లతో స్పందిస్తున్న నెటిజన్లు
Hazarath Reddyమే 15, సోమవారం నాడు IPL 2023లో గుజరాత్ టైటాన్స్ vs సన్‌రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్ సందర్భంగా, ఒక ఛీర్‌లీడర్ తన చేతిని స్లింగ్‌లో ఉంచినప్పటికీ ప్రదర్శన ఇవ్వడం కనిపించింది. సన్‌రైజర్స్ హైదరాబాద్ ఛీర్‌లీడర్ తన కుడి చేతిని స్లింగ్‌లో ఉంచి ఉన్న చిత్రం వైరల్‌గా మారింది
World Cup 2023: ప్రపంచకప్‌ నుంచి పాకిస్థాన్ వైదొలిగే అవకాశం, సంచలన వ్యాఖ్యలు చేసిన పీసీబీ చైర్మన్
Hazarath Reddyఈ ఏడాది భారత్‌లో జరగనున్న ప్రపంచకప్‌ నుంచి పాకిస్థాన్ వైదొలిగే అవకాశం ఉందని పీసీబీ చైర్మన్ హెచ్చరించారు.
IPL 2023, GT vs SRH: సన్ రైజర్స్ పై 34 పరుగుల తేడాతో గుజరాత్ విజయం, ప్లేఆఫ్‌కు చేరిన తొలి జట్టుగా గుజరాత్ సంచలనం..
kanhaఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023 ప్లేఆఫ్స్‌లోకి ప్రవేశించిన మొదటి జట్టును పొందింది. సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుపై గుజరాత్ టైటాన్స్ జట్టు ఘన విజయం సాధించి ప్లేఆఫ్స్‌లో చోటు దక్కించుకుంది.