Cricket
Michael Bracewell's Hat-Trick Video: వీడియో ఇదిగో.. కెరీర్‌లో వేసిన తొలి ఓవర్‌లోనే హ్యాట్రిక్ వికెట్లు సాధించిన న్యూజిలాండ్ ఆల్‌రౌండర్‌ మైఖేల్ బ్రేస్‌వెల్
Hazarath Reddyటీ20 క్రికెట్‌లో న్యూజిలాండ్ ఆల్‌రౌండర్‌ మైఖేల్ బ్రేస్‌వెల్ అరుదైన ఘనత సాధించాడు. తన కెరీర్‌లో వేసిన తొలి ఓవర్‌లోనే హ్యాట్రిక్ వికెట్లు సాధించిన మొదటి ఆటగాడిగా బ్రేస్‌వెల్ రికార్డు సృష్టించాడు.
KL Rahul: జింబాబ్వే సిరీస్‌కు టీమిండియా కెప్టెన్‌గా రాహుల్..!, ఈ టూర్‌లో జరగనున్న వన్డే సీరిస్‌లో సీనియర్లకు విశ్రాంతినిచ్చే యోచనలో బీసీసీఐ
Hazarath Reddyఇంగ్లండ్‌ పర్యటన ముగిసిన తర్వాత టీమిండియా నేరుగా కరేబియన్ టూర్‌కు వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ పర్యటలో భాగంగా మూడు వన్డేలు, 5 టీ20ల సిరీస్‌లో విండీస్‌తో భారత్‌ తలపడనుంది. జూలై 22న పోర్ట్‌ ఆఫ్‌ స్పెయిన్‌ వేదికగా జరగనున్న తొలి వన్డేతో భారత టూర్‌ ప్రారభం కానుంది.
Rishabh Pant: ఆసియాలో తొలి క్రికెటర్‌గా రికార్డు నెలకొల్పిన రిషబ్ పంత్, ఇంగ్లండ్ లో టెస్టులతో పాటు వన్డే ఫార్మాట్‌లో కూడా సెంచరీ చేసిన తొలి వికెట్ కీపర్ బ్యాటర్‌గా గుర్తింపు
Hazarath Reddyటీమిండియా వికెట్ కీపర్ రిషభ్ పంత్ అరుదైన ఘనత సాధించాడు. ఇంగ్లండ్ తో ఆదివారం ముగిసిన నిర్ణయాత్మక మూడో వన్డేలో సెంచరీ చేయడం ద్వారా.. ఇంగ్లండ్ లో టెస్టులతో పాటు వన్డే ఫార్మాట్ లో కూడా సెంచరీ చేసిన తొలి ఆసియా వికెట్ కీపర్ బ్యాటర్ గా అరుదైన గుర్తింపు దక్కించుకున్నాడు.
Ben Stokes Retirement: వ‌న్డేల‌కు గుడ్ బై చెప్పిన బెన్ స్టోక్స్, మంగ‌ళ‌వారం జ‌ర‌గ‌నున్న వ‌న్డే త‌న‌కు చివ‌రిద‌ని ప్రకటించిన స్టార్‌ ఆల్‌రౌండర్‌
Hazarath Reddyవ‌న్డేల‌కు మ‌రో స్టార్ ప్లేయ‌ర్ సోమ‌వారం గుడ్‌బై చెప్పాడు. ఇంగ్లండ్ టెస్టు జ‌ట్టు కెప్టెన్‌, ఆల్ రౌండ‌ర్ బెంజిమిన్ ఆండ్రూ స్టోక్స్ అలియాస్ బెన్ స్టోక్స్ వ‌న్డే క్రికెట్‌కు వీడ్కోలు ప‌లికాడు. ఈ మేర‌కు సోమ‌వారం సాయంత్రం అత‌డు ఓ ప్ర‌క‌ట‌న‌ను విడుద‌ల చేశాడు. మంగ‌ళ‌వారం జ‌ర‌గ‌నున్న వ‌న్డే త‌న‌కు చివ‌రిద‌ని అత‌డు ప్ర‌క‌టించాడు.
Lalit Modi: నా పుట్టుకే డైమండ్ పుట్టుక, ఆర్థిక నేరగాడు అంటారెందుకు, దేశానికి తాను ఓ గొప్ప బహుమతి ఇచ్చానని చెప్పుకువచ్చిన లలిత్ మోదీ, ఇద్దరు వ్యక్తులు స్నేహితులుగా ఉండకూడదా అంటూ ట్వీట్
Hazarath Reddyఐపీఎల్‌ సృష్టికర్త లలిత్‌ మోదీ.. మాజీ విశ్వసుందరి సుస్మితా సేన్‌తో డేటింగ్‌లో ఉన్న సంగతి విదితమే. ఈ నేపథ్యంలో కొంతమంది నెటిజన్లు ఆర్థిక నేరాలకు పాల్పడి విదేశాలకు పారిపోయిన లలిత్‌.. ఇప్పుడేమో కాలేజీ కుర్రాడిలా గర్ల్‌ఫ్రెండ్‌తో ఉన్నానంటూ ఫొటోలు షేర్‌ చేస్తున్నాడంటూ విపరీతంగా ట్రోల్‌ చేశారు.
India vs England 3rd ODI: 2021-22 ఇంగ్లండ్‌ పర్యటనను పరాజయం లేకుండా ముగించిన టీంఇండియా, మూడో వన్డేలో 5 వికెట్ల తేడాతో ఇంగ్లిష్‌ జట్టును చిత్తుచేసిన భారత్
Hazarath Reddyహార్దిక్‌ పాండ్యా (4/24; 71) ఆల్‌రౌండ్‌ మెరుపులకు.. రిషబ్‌ పంత్‌ (113 బంతుల్లో 125 నాటౌట్‌; 16 ఫోర్లు, 2 సిక్సర్లు) అజేయ శతకం తోడవడంతో మూడో వన్డేలో (India vs England 3rd ODI) టీమ్‌ఇండియా విజయభేరీ మోగించింది. హోరాహోరీగా సాగిన ఆఖరి మ్యాచ్‌లో భారత్‌ 5 వికెట్ల తేడాతో ఇంగ్లిష్‌ జట్టును చిత్తుచేసింది.
Virat Kohli: నీవు దానికి తప్ప ఎందుకు పనికిరావు, కోహ్లీపై విరుచుకుపడుతున్న నెటిజన్లు, ఇక అడ్వర్టైజ్‌మెంట్లు చేసుకుంటూ బతికెయ్‌ అంటూ ఘాటుగా ట్వీట్లు
Hazarath Reddyఇంగ్లండ్‌తో మూడో వన్డేలోనూ కోహ్లి మరోసారి విఫలం అయిన సంగతి విదితమే. ఆ నేపథ్యంలోనే ఓ యాడ్‌కు సంబంధించిన వీడియో షేర్‌ చేసిన కోహ్లి.నెటజన్ల ఆగ్రహానికి గురయ్యాడు. సోమవారం కోహ్లి ట్విటర్‌ వేదికగా హెల్త్‌ సప్లిమెంట్‌ వెల్‌మ్యాన్‌కు సంబంధించిన యాడ్‌ షేర్‌ చేశాడు
Sharapova Welcomes Son: తల్లైన టెన్నిస్ బ్యూటీ మరియా షరపోవా, మగబిడ్డకు జన్మనిచ్చిన రష్యన్ సంచలనం, పేరును కూడా ప్రకటించింది, ఇంతకీ షరపోవా కొడుకు పేరు ఎంత వెరైటీగా ఉందో తెలుసా?
Naresh. VNSటెన్నిస్ సూపర్ స్టార్ మారియా ష‌ర‌పోవా (Maria Sharapova) మ‌గ బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చింది. పిల్లోడికి థియోడ‌ర్ (Theodore) అని పేరు కూడా పెట్టేసింది. 5 సార్లు గ్రాండ్‌స్లామ్ టైటిళ్ల‌ు సాధించిన మాజీ వ‌ర‌ల్డ్ నెంబ‌ర్ వ‌న్ ష‌ర‌పోవా ఒక‌ప్పుడు టెన్నిస్‌లో(Tennis ) రికార్డులు క్రియేట్ చేసింది. ఇప్పుడు మగబిడ్డకు జ‌న్మ‌నిచ్చిన విష‌యాన్ని ఇన్‌స్టాగ్రామ్‌ (Instagram) వేదికగా వెల్లడించింది.
Sachin Tendulkar: వైరల్ ఫోటో ట్వీట్ చేసిన సచిన్ టెండూల్కర్, స‌ర్ గ్యారీ సోబ‌ర్స్‌ను కలిశానంటూ ఫోటో షేర్ చేసిన లెజెండ్
Hazarath Reddyభార‌త క్రికెట్ జ‌ట్టు ఇంగ్లండ్ టూర్‌లో భాగంగా ఆ దేశ జ‌ట్టుతో టీమిండియా గురువారం లండ‌న్‌లోని ప్ర‌తిష్ఠాత్మ‌క లార్డ్స్ వేదిక‌గా రెండో వ‌న్డే మ్యాచ్ జ‌రిగిన సంగ‌తి తెలిసిందే. మాస్ట‌ర్ బ్లాస్ట‌ర్ స‌చిన్ టెండూల్క‌ర్ కూడా ఈ మ్యాచ్‌ను వీక్షించేందుకు లార్డ్స్ వ‌చ్చాడు. త‌న స‌హ‌చ‌ర ఆట‌గాడు,
IND vs ENG 2nd ODI 2022: ఇంగ్లండ్ బౌలర్ల దెబ్బకు చేతులెత్తేసిన బ్యాటర్లు, 100 పరుగుల తేడాతో ఘోర పరాజయం పాలైన భారత్
Hazarath Reddyలార్డ్స్‌లో సీన్‌ రివర్స్‌ అయ్యింది. తొలి వన్డేలో మన పేస్‌కు తలవంచిన ఇంగ్లండ్‌ బ్యాటింగ్‌ లైనప్‌లాగే... ఇక్కడ ప్రత్యర్థి నిప్పులు చెరిగే బౌలింగ్‌కు భారత్‌ కుదేలైంది. ఇంగ్లండ్‌తో ప్రతిష్ఠాత్మక లార్డ్స్ మైదానంలో జరిగిన రెండో వన్డేలో (IND vs ENG 2nd) భారత జట్టు 100 పరుగుల భారీ తేడాతో ఓటమి పాలైంది.
Sushmita Sen Dating: బాలీవుడ్ హీరోయిన్ సుస్మితా సేన్‌తో లలిత్ మోడీ డేటింగ్, మాజీ ఐపీఎల్ ఛైర్మెన్ లలిత్ మోడీతో మాల్దీవుల్లో ఎంజాయ్ చేస్తున్న ముద్దుగుమ్మ
Hazarath Reddyఐపీఎల్ మాజీ ఛైర్మన్ లలిత్ మోడీ.. బాలీవుడ్ స్టార్ సుస్మితా సేన్‌ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారు. మాజీ ప్రపంచ సుందరి సుస్మితాసేన్, పరారీలో ఉన్న ఆర్ధిక నేరస్థుడు లలిత్ మోదీ ఇప్పటికే డేటింగ్‌లో ఉన్నారు. లలిత్ మోదీతో కలిసి వెడ్డింగ్ రింగ్‌తో ఉన్న సుస్మితా సేన్‌ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Lalit Modi – Sushmita Sen Dating: డేటింగ్‌లో లలిత్ మోడీ .. మాజీ ప్రపంచ సుందరి సుస్మితా సేన్‌తో మాల్దీవుల్లో ఎంజాయ్ చేస్తున్న ఐపీఎల్ మాజీ ఛైర్మెన్
Hazarath Reddyమాల్దీవుల పర్యటన ముగించుకుని ఇప్పుడే లండన్ చేరుకున్నామని, తన బెటర్ లుకింగ్ పార్ట్‌నర్ సుష్మితా సేన్‌తో కొత్త జీవితం ప్రారంభించబోతున్నాననంటూ లలిత్ మోదీ ఇన్‌స్టాగ్రామ్‌‌లో పోస్ట్ చేశాడు. ఆ తర్వాత కాసేపటికే ట్విటర్‌లో తమకు ఇంకా వివాహం కాలేదని, కానీ త్వరలోనే చేసుకుంటామంటూ ట్వీట్ చేశాడు
Lalit Modi Dating: లేటు వయసులో ఘాటు ప్రేమ, బాలీవుడ్ స్టార్ సుస్మితా సేన్‌తో డేటింగ్‌లో లలిత్ మోడీ, త్వరలో కొత్త జీవితం ప్రారంభించబోతున్నట్లు వెల్లడి
Hazarath Reddyఐపీఎల్ మాజీ ఛైర్మన్ లలిత్ మోడీ.. బాలీవుడ్ స్టార్ సుస్మితా సేన్‌తో కలిసి సోషల్ మీడియాలో ఒక ఫోటోను పంచుకున్నారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్‌కు మొదటి ఛైర్మన్ మరియు కమిషనర్‌గా ఉన్న మోడీ, నటితో డేటింగ్ లో ఉన్నట్లు ట్వీట్ లో తెలిపారు. నా బెటర్ హాఫ్ తో కొత్త జీవితం ప్రారంభమవుతుందని తెలిపారు. సుస్మితా సేన్‌తో కలిసి నా కొత్త జీవితం ప్రారంభించానని తెలిపారు.
IND vs WI 2022: టీ20ల నుంచి విరాట్ కోహ్లీ అవుట్, వెస్టిండీస్‌తో జ‌రిగే సీరిస్‌కు టీంను ప్రకటించిన బీసీసీఐ, రోహిత్‌కే భారత క్రికెట్ పగ్గాలు
Hazarath Reddyవెస్టిండీస్ సీరిస్లో‌ విరాట్ కోహ్లీకి సెలెక్ట‌ర్లు మొండిచేయి చూపారు. వెస్టిండీస్‌తో జ‌రిగే అయిదు టీ20ల‌కు కోహ్లీని ఎంపిక చేయ‌లేదు. విండీస్‌తో సిరీస్‌కు రోహిత్‌కే ప‌గ్గాల‌ను అప్ప‌గించారు. స‌ర్జ‌రీతో క్రికెట్‌కు దూరంగా ఉన్న కేఎల్ రాహుల్‌ను టీ20ల‌కు ఎంపిక చేశారు. కానీ చివ‌ర వ‌ర‌కు రాహుల్ ఆడేది లేనిది డౌటే.
India Edge Pakistan: పాకిస్తాన్‌ను వెనక్కి నెట్టిన భారత్, మూడు ఫార్మాట్లలో టాప్‌-3లో ఉన్న ఏకైక జట్టుగా అవతరణ, ఇంగ్లండ్‌తో తొలి వన్డేలో 10 వికెట్ల తేడాతో ఘన విజయం
Hazarath Reddyతొలి వన్డేలో ఇంగ్లండ్‌ను చిత్తు చేయడం ద్వారా టీమిండియా ఐసీసీ తాజా వన్డే ర్యాంకింగ్స్‌లో మూడో స్థానానికి ఎగబాకింది. దీంతో పాటు దాయాది పాక్‌కు కూడా షాకిచ్చింది.
Rohit Sharma: వైరల్ వీడియో.. చిన్న పాపకు బలంగా తగిలిన రోహిత్‌ శర్మ సిక్సర్‌ కొట్టిన బంతి, నొప్పితో విలవిలలాడిన చిన్నారి, ప్రథమ చికిత్స అందించడంతో కోలుకున్న పాప
Hazarath Reddyభారత్‌-ఇంగ్లండ్‌ జట్ల మధ్య తొలి వన్డే సందర్భంగా తండ్రితో పాటు స్టేడియంకు వచ్చిన ఓ చిన్నారి రోహిత్‌ శర్మ సిక్సర్‌ కొట్టిన బంతి తగిలి నొప్పితో విలవిలలాడింది.
Suryakumar Yadav: ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో దుమ్ము లేపిన సూర్యకుమార్‌ యాదవ్, ఏకంగా 44 స్థానాలు ఎగబాకి 5వ స్థానంలోకి, సూర్య మినహా టాప్‌-10లో చోటు దక్కించుకోని భారత బ్యాటర్లు
Hazarath Reddyఐసీసీ టీ20 క్రికెట్‌ బ్యాటింగ్‌ ర్యాంకింగ్స్‌లో టీమిండియా బ్యాటర్‌ సూర్యకుయార్‌ యాదవ్‌ దుమ్ములేపాడు. ఇటీవల ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్‌లో అదరగొట్టిన అతడు ఏకంగా 44 స్థానాలు ఎగబాకాడు. మొత్తంగా 732 పాయింట్లు సాధించిన సూర్య.. కెరీర్‌లోనే అత్యుత్తమ ర్యాంకు సాధించాడు.
Saif Ali Khan: వెస్టిండీస్‌ దిగ్గజంతో బాలీవుడ్ నటుడు సైఫ్‌ అలీఖాన్‌, మిస్టర్‌ కూల్‌ ధోనితో దిగిన ఫోటోలు వైరల్
Hazarath Reddyఇంగ్లండ్‌తో వన్డే మ్యాచ్‌ సందర్భంగా మిస్టర్‌ కూల్‌ ధోని, వెస్టిండీస్‌ దిగ్గజ ఓపెనర్‌ గోర్డాన్‌ గ్రీనిడ్జ్‌తో కలిసి బాలీవుడ్‌ నటుడు సైఫ్‌ అలీఖాన్‌ ఫొటోలు దిగాడు. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.
Jasprit Bumrah: వన్డేల్లో వరల్డ్ నంబర్ వన్ బౌలర్‌గా జస్‌ప్రీత్‌ బుమ్రా, టాప్‌-10లో చోటు దక్కించుకోలేకపోయిన ఇతర భారత్ ఆటగాళ్లు
Hazarath Reddyఐసీసీ వన్డే బౌలింగ్‌ ర్యాంకింగ్స్‌లో టీమిండియా పేసర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా అదరగొట్టాడు. ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌లో రాణించిన అతడు ఏకంగా అగ్రస్థానానికి చేరుకున్నాడు. మూడు స్థానాలు ఎగబాకి 718 పాయింట్లతో వరల్డ్‌ నంబర్‌ వన్‌ వన్డే బౌలర్‌గా నిలిచాడు.
Shoaib Akhtar: భారత్ మీద ఈ సారి గెలుపు అంత ఈజీ కాదు, పాకిస్తాన్ టీంకు వార్నింగ్ ఇచ్చిన షోయబ్ అక్తర్, ఇండియా పక్కా ప్రణాళికతో బరిలోకి దిగుతుందని వెల్లడి
Hazarath Reddyపాకిస్తాన్ మాజీ స్పీడ్ స్టర్ షోయబ్ అక్తర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గతేడాది దుబాయ్ వేదికగా ముగిసిన టీ20 ప్రపంచకప్ లో భాగంగా గ్రూప్ స్టేజ్ లో భారత్-పాకిస్తాన్ మధ్య జరగిన మ్యాచ్ లో టీమిండియా పది వికెట్ల తేడాతో దారుణ పరాజయం పాలైన సంగతి విదితమే.