క్రికెట్

PBKS vs SRH: దడ పుట్టిస్తున్న సన్‌రైజర్స్‌, వరుసగా నాలుగో విక్టరీ నమోదు చేసి టాప్‌-4లోకి, పంజాబ్‌ కింగ్స్‌ను ఏడు వికెట్లతో చిత్తుచేసిన హైదరాబాద్

Hazarath Reddy

సన్‌రైజర్స్‌ ఐపీఎల్‌ 15వ సీజన్‌లో వరుసగా నాలుగో విజయం నమోదు చేసుకుంది. ఆదివారం జరిగిన తొలి మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ 7 వికెట్ల తేడాతో పంజాబ్‌ కింగ్స్‌ను చిత్తు చేసింది. పాయింట్ల పట్టికలో టాప్‌-4లోకి దూసుకెళ్లింది. ఆదివారం జరిగిన మ్యాచ్‌లో పంజాబ్‌ కింగ్స్‌ను ఏడు వికెట్లతో చిత్తుచేసింది.

IPL 2022: అద్భుతమైన సీన్.. సచిన్ కాళ్లు మొక్కిన జాంటీరోడ్స్, ఒక్కసారిగా ఖంగుతిన్న టెండూల్కర్, సోషల్ మీడియాలో వీడియో వైరల్

Hazarath Reddy

ఐపీఎల్ 2022 సీజన్‌లో భాగంగా ముంబై ఇండియన్స్‌తో నిన్న (ఏప్రిల్‌ 14) జరిగిన రసవత్తర పోరులో పంజాబ్‌ కింగ్స్‌ 12 పరుగుల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. , పంజాబ్‌-ముంబై జట్ల మధ్య మ్యాచ్‌ అనంతరం మైదానంలో చోటు చేసుకున్న ఓ ఆసక్తికర సన్నివేశం ప్రస్తుతం నెట్టింట వైరలవుతోంది.

IPL 2022: రెండుసార్లు అదే యార్కర్‌కు బలైన జోస్ బ‌ట్ల‌ర్, లాకీ పెర్గూస‌న్ తెలివైన బౌలింగ్‌తో బ‌ట్ల‌ర్‌ను బోల్తా కొట్టించిన వీడియో వైరల్

Hazarath Reddy

ఐపీఎల్ 2022లో రాజ‌స్థాన్ రాయ‌ల్స్ బ్యాట‌ర్ జోస్ బ‌ట్ల‌ర్ మంచి ఊపు మీదున్నాడు. ప్ర‌స్తుతం 5 మ్యాచుల్లో 272 ర‌న్స్ చేసి ఆరెంజ్ క్యాప్ కొట్టేశాడు.తాజాగా గుజ‌రాత్‌తో జ‌రిగిన మ్యాచ్‌లోనూ ఆరంభంలో బ‌ట్ల‌ర్ అదిరిపోయే ఇన్నింగ్స్ ఆడుతూ వచ్చాడు. కేవ‌లం 23 బంతుల్లోనే అత‌ను 50 ర‌న్స్ చేశాడు.

IPL 2022: ఐపీఎల్‌లో అన్ని జట్లకు వణుకు పుట్టిస్తున్న కొత్త టీం గుజరాత్ టైటాన్స్, రాజస్తాన్‌ రాయల్స్‌పై 37 పరుగుల తేడాతో ఘన విజయం, పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలోకి..

Hazarath Reddy

ఐపీఎల్లో కొత్తగా అడుగుపెట్టిన గుజరాత్‌ టైటాన్స్‌ అదిరిపోయే ఆటతో తిరిగి అగ్రస్థానానికి చేరింది. తాజాగా రాజస్తాన్‌ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో గుజరాత్‌ టైటాన్స్‌ 37 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. మొదట బ్యాటింగ్‌ చేసిన గుజరాత్‌ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 192 పరుగులు చేసింది.

Advertisement

IPL 2022: ముంబైకి మళ్లీ భారీ షాక్, స్లో ఓవర్‌రేట్‌ కారణంగా కెప్టెన్‌ రోహిత్‌ శర్మకు రూ. 24 లక్షలు జరిమానా, . అతడితో పాటు జట్టు సభ్యలుకు రూ. 6 లక్షలు జరిమానా

Hazarath Reddy

ఐపీఎల్‌-2022లో వరుస ఓటుముల బాధలో ఉన్న ముంబై ఇండియన్స్‌కు మరో భారీ షాక్‌ తగిలింది. స్లో ఓవర్‌రేట్‌ కారణంగా ముంబై ఇండియన్స్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మకు మరోసారి భారీ జరిమానా పడింది. పంజాబ్‌ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 20 ఓవర్ల కోటాను నిర్ణీత సమయంలో పూర్తి చేయనందుకు అతడిపై రూ. 24 లక్షల జరిమానా ఐపీఎల్‌ నిర్వహకులు విధించారు.

IPL 2022: వరుసగా ఐదో మ్యాచ్‌లో ఓటమి పాలైన ముంబై, 12 పరుగుల తేడాతో ముంబైకి షాకిచ్చిన పంజాబ్‌ కింగ్స్‌, ఐపీఎల్‌ సీజన్‌లో తొలి ఐదు మ్యాచ్‌ల్లో రెండుసార్లు ఓడిన తొలి జట్టుగా ముంబై రికార్డు

Hazarath Reddy

ఐదుసార్లు చాంపియన్‌ ముంబై ఇండియన్స్‌ వరుస ఓటముల పరంపర కొనసాగుతున్నది. ఐదో మ్యాచ్‌లోనైనా గెలుపు బోణీ కొట్టాలన్న ఐదుసార్లు విజేత ముంబై ఇండియన్స్‌ ఆశలు నెరవేరలేదు. బుధవారం ఉత్కంఠ భరితంగా జరిగిన మ్యాచ్‌లో పంజాబ్‌ కింగ్స్‌ 12 పరుగులతో ముంబైకి షాకిచ్చింది. మొదట పంజాబ్‌ 20 ఓవర్లలో 198/5 స్కోరు చేసింది.

Six Wickets in 6 Balls: క్రికెట్ చరిత్రలో అద్భుతం, ఒకే ఒవర్‌లో ఆరు వికెట్లు తీసిన బౌలర్ వీరన్‌దీప్‌ సింగ్‌, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో

Hazarath Reddy

క్రికెట్‌లో హ్యాట్రిక్‌ తీయడం గొప్ప. అలాంటిది ఆరు బాల్స్ కు ఆరు వికెట్లు తీసే.. అందరూ నోరెళ్లబెట్టాల్సిందే.. మలేషియా క్లబ్‌ ఎలెవెన్‌కు చెందిన వీరన్‌దీప్‌ సింగ్‌ అనే బౌలర్ ఆరు బాల్స్ వేసి ఆరు వికెట్లు తీశాడు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

TATA IPL 2022: ఫీల్డింగ్ అంటే ఇదే కదా, ఫుల్ లెన్త్ డైవ్ చేస్తూ అద్భుతంగా క్యాచ్ పట్టిన అంబటి రాయుడు, సోషల్ మీడియాలో వీడియో వైరల్

Hazarath Reddy

వ‌రుస‌గా నాలుగు ఓట‌ముల త‌ర్వాత ఆర్సీబీతో జ‌రిగిన మ్యాచ్‌లో 23 ర‌న్స్ తేడాతో చెన్నై గెలిచింది. ఫీల్డింగ్ స‌మ‌యంలో చెన్నై ప్లేయ‌ర్స్ కేక పుట్టించారు. అంబ‌టి రాయుడు 16వ ఓవ‌ర్‌లో అద్భుత‌మైన క్యాచ్ అందుకున్నాడు. కుడి వైపు డైవ్ చేస్తూ వంటి చేతిలో ఆకాశ్ దీప్ ఇచ్చిన క్యాచ్‌ను ప‌ట్టేశాడు

Advertisement

IPL 2022: నాలుగు మ్యాచ్‌ల పరాజయాల తర్వాత బోణి కొట్టిన చెన్నై, 23 పరుగుల తేడాతో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరుపై ఘన విజయం

Hazarath Reddy

ఐపీఎల్‌ 15వ సీజన్‌ తొలి నాలుగు మ్యాచ్‌ల్లో పరాజయాలు చవిచూసిన సూపర్‌ కింగ్స్‌ ఎట్టకేలకు బోణీ కొట్టింది. మంగళవారం జరిగిన పోరులో 23 పరుగుల తేడాతో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరును చిత్తు చేసింది.

Ravi Shastri: అది వెంటనే ఆపు.. ధోనీపై మండిపడిన రవిశాస్త్రి, జీవితంలో అలా ఎవర్నీ కోప్పడలేదంటూ వెల్లడి, ఇంతకీ ఏం జరిగిందంటే ఆయన మాటల్లో..

Hazarath Reddy

టీంమిండియా మాజీ కోచ్ రవిశాస్త్రి ఎంతో సరదా మనిషి. ఆయన కోచ్ గా తప్పుకున్న వేళ ఆటగాళ్లు తీవ్ర భావోద్వేగాలకు గురయ్యారంటే ఆయన వారితో ఎంతలా కలిసిపోయారో అర్థమవుతోంది. అలాంటి రవిశాస్త్రి మిస్టర్ కూల్ మహేంద్ర సింగ్ ధోనీపై కోప్పడ్డారంటే ఆశ్చర్యం కలగకమానదు.

Mohammad Hussain Dies: పాకిస్థాన్‌ క్రికెట్‌లో తీవ్ర విషాదం, మాజీ క్రికెటర్ మహ్మద్ హుస్సేన్ కన్నుమూత, సంతాపం తెలిపిన పాకిస్థాన్‌ క్రికెట్‌ బోర్డు

Hazarath Reddy

పాకిస్థాన్‌ క్రికెట్‌లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఆ దేశ మాజీ క్రికెటర్‌ మహ్మద్ హుస్సేన్ 45 ఏళ్ల వయసులో ఆకాల మరణం చెందాడు. కిడ్నీ సంబంధిత వ్యాధితో పాటు డయాబెటిక్‌ కూడా అయిన హుస్సేన్‌.. సోమవారం అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో మృతి చెందాడు

IPL 2022: నువ్వేం కెప్టెన్‌వి పాండ్యా, ముందు ధోనీ‌ లాగా కూల్ గా ఉండటం నేర్చుకో, గుజరాత్‌ టైటాన్స్‌ కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్యా తీరుపై మండిపడుతున్న నెటిజన్లు

Hazarath Reddy

గుజరాత్‌ టైటాన్స్‌ కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్యా తీరుపై నెటిజన్లు మండిపడుతున్నారు. హార్దిక్‌లో నాయకుడి లక్షణాలు లేవని, జట్టు సభ్యుల పట్ల అమర్యాదగా ప్రవర్తించడం సరికాదని విమర్శిస్తున్నారు.

Advertisement

IPL 2022: అదిరిపోయే వీడియో చూడండి.. క‌ళ్లు చెదిరే క్యాచ్ పట్టిన రాహుల్ త్రిపాఠి, గాల్లోకి ఎగురుతూ ఒంటి చేత్తో సూపర్ క్యాచ్, గుజ‌రాత్‌పై ఘన విజయం సాధించిన హైదరాబాద్

Hazarath Reddy

స‌న్‌రైజ‌ర్స్ ఆటగాడు రాహుల్ త్రిపాఠి క‌ళ్లు చెదిరే క్యాచ్ ప‌ట్టాడు. గుజ‌రాత్ టైటాన్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో .. స‌న్‌రైజ‌ర్స్ ఫీల్డ‌ర్ రాహుల్ త్రిపాఠి.. గాల్లోకి ఎగురుతూ సూప‌ర్ క్యాచ్ అందుకున్నాడు. భువ‌నేశ్వ‌ర్ కుమార్ బౌలింగ్‌లో బ్యాట‌ర్ శుభ‌మ‌న్ గిల్‌.. ఆఫ్ సైడ్‌లో భారీ షాట్‌కు ప్ర‌య‌త్నించాడు.

IPL 2022: గుజరాత్‌ టైటాన్స్‌‌కు తొలి ఓటమి, 8 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించిన సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌, దుమ్మురేపిన కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌

Hazarath Reddy

ఐపీఎల్‌ 15వ సీజన్‌లో ఓటమి ఎరుగకుండా సాగుతున్న గుజరాత్‌ టైటాన్స్‌.. హైదరాబాద్‌ చేతిలో పరాజయం పాలైంది. ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో అదరగొట్టిన సన్‌రైజర్స్‌.. సోమవారం జరిగిన పోరులో 8 వికెట్ల తేడాతో గుజరాత్‌ టైటాన్స్‌ను చిత్తు చేసింది.

Suryakumar Yadav: ఇదేమి షాట్ బాబోయ్, 98 మీటర్ల వేగంతో హెలికాప్టర్ షాట్‌ బాదిన సూర్యకుమార్ యాదవ్, అయినా ఓటమి పాలైన ముంబై

Hazarath Reddy

ఆర్సీబీతో జరిగిన మ్యాచ్‌లో సూర్యకుమార్ యాదవ్ హెలికాప్టర్ షాట్‌తో మెరిశాడు. ముంబై ఇన్నింగ్స్‌ 19 ఓవర్‌ వేసిన మహ్మద్ సిరాజ్ బౌలింగ్‌లో.. సూర్య హెలికాప్టర్ షాట్‌ రూపంలో 98 మీటర్ల భారీ సిక్స్‌ బాదాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.అయితే ఈ మ్యాచ్‌లో ముంబై 7 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది

Yuzvendra Chahal: అంపైర్‌తో వాగ్వాదానికి దిగిన యుజవేంద్ర చాహల్‌, తరువాతి బంతికే వికెట్ తీసి కసి తీర్చుకున్న రాజప్థాన్ రాయల్స్ స్పిన్నర్, వీడియో వైరల్

Hazarath Reddy

ఫీల్డ్‌లో ఎప్పుడూ ప్రశాంతంగా కన్పించే యుజవేంద్ర చాహల్‌.. లక్నో సూపర్‌జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో మాత్రం కోపంతో ఊగిపోయాడు. లక్నో ఇన్నింగ్స్‌ 18 ఓవర్‌ వేసిన చాహల్‌ ఐదో బంతిని ఫుల్‌ ఆఫ్‌ సైడ్‌ వేశాడు. అయితే ఆనూహ్యంగా అంపైర్‌ ఆ బంతిని వైడ్‌గా ప్రకటించాడు.

Advertisement

IPL 2022, PBKS vs GT: ఉత్కంఠపోరులో గుజరాత్ థ్రిల్లింగ్ విక్టరీ, చివరి రెండుబాల్స్ సిక్స్‌లు కొట్టిన తెవాటియా, లాస్ట్ ఓవర్‌లో మలుపుతిరిగిన మ్యాచ్, వరుస విక్టరీలతో జోష్‌లో గుజరాత్

Naresh. VNS

ఐపీఎల్‌లో సూపర్ మజా వచ్చే మ్యాచ్ జరిగింది. గుజరాత్ టైటాన్స్, పంజాబ్ కింగ్స్ మధ్య జరిగిన మ్యాచ్ చివరివరకు ఉత్కంఠగా సాగింది. లాస్ట్ రెండు బాల్స్ సిక్స్ లు కొట్టి గుజరాత్‌కు సూపర్ విక్టరీ అందించాడు తెవాటియా. గుజరాత్ గెలవాలంటే చివరి ఓవర్లో 19 పరుగులు.. చివరి రెండు బంతుల్లో 12 పరుగులు అవసరం.. అలాంటి సమయంలో రాహుల్ తెవాటియా వరుసగా సిక్సర్లు బాది గుజరాత్‌ను గెలిపించాడు.

Rishabh Pant: ఢిల్లీ క్యాపిటల్స్‌కు మరో భారీ షాక్‌, స్లో ఓవర్‌ రేటు మెయింటెన్‌ చేసిన కారణంగా ఢిల్లీ కెప్టెన్‌ రిషభ్‌ పంత్‌కు రూ. 12 లక్షలు జరిమానా

Hazarath Reddy

వరుస ఓటములతో నిరాశలో కూరకుపోయిన ఢిల్లీ క్యాపిటల్స్‌కు మరో భారీ షాక్‌ తగిలింది. స్లో ఓవర్‌ రేటు మెయింటెన్‌ చేసిన కారణంగా ఐపీఎల్‌ నిర్వాహకులు ఢిల్లీ కెప్టెన్‌ రిషభ్‌ పంత్‌కు జరిమానా విధించారు. నిర్ణీత సమయంలో తమ బౌలింగ్‌ కోటా పూర్తి చేయనందున పంత్‌కు 12 లక్షల రూపాయల ఫైన్‌ విధించారు.

DC vs LSG, IPL 2022: లక్నో సూపర్‌ జెయింట్స్‌ హ్యాట్రిక్‌ విజయం, డికాక్‌ మెరుపులతో సునాయాసంగా విజయతీరాలకు చేరిన కొత్త ఫ్రాంచైజీ

Hazarath Reddy

ఐపీఎల్లో అత్యంత విజయవంతమైన జట్లుగా గుర్తింపు పొందిన చెన్నై సూపర్‌ కింగ్స్‌, ముంబై ఇండియన్స్‌ బోణీ కొట్టేందుకు తీవ్రంగా ఇబ్బంది పడుతున్న చోట కొత్త ఫ్రాంచైజీ లక్నో సూపర్‌ జెయింట్స్‌ హ్యాట్రిక్‌ విజయం నమోదు చేసుకుంది. కట్టుదిట్టమైన బౌలింగ్‌తో ఢిల్లీ హిట్టర్లను కట్టడి చేసిన లక్నో.. డికాక్‌ మెరుపులతో సునాయాసంగా విజయతీరాలకు చేరింది.

Yuzvendra Chahal: ఆ తాగుబోతు 15వ అంతస్తు నుంచి నన్ను వేలాడదీశాడు, సంచలన వ్యాఖ్యలు చేసిన లెగ్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్

Hazarath Reddy

టీంమిండియా లెగ్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్.. తనపై జరిగిన హత్యాయత్నాన్ని, ఒళ్లు గగుర్పొడిచే ఘటన గురించి వెల్లడించాడు. బెంగళూరుతో మ్యాచ్ అనంతరం జరిగిన పార్టీలో ‘ఆ తాగుబోతు ఆటగాడు’ తథేకంగా తనవైపే చూశాడని, తనను రమ్మని పిలిచి హోటల్ 15వ అంతస్తు నుంచి తనను వేలాడేశాడని చెప్పాడు.

Advertisement
Advertisement