Cricket

RCB Vs RR: చివరి ఓవర్ వరకు ఉత్కంఠ, సొంతగడ్డపై దుమ్మురేపిన ఆర్సీబీ, రాజస్థాన్ వెన్నువిరిసిన బెంగళూరు బౌలర్లు

VNS

రాయల్ ఛాలెంజర్స్‌ బెంగళూరు (RCB) మరోసారి అదరగొట్టింది. రాజస్థాన్‌ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ 7 పరుగుల తేడాతో విజయం సాధించింది. టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 189 పరుగులు చేసింది. 190 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్‌ (Rajasthan Royals) ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 182 పరుగులకు పరిమితమైంది.

Punjab Kings defeated Mumbai Indians: ముంబై వెన్నువిరిచిన అర్షదీప్, భారీలక్ష్యాన్ని చేధించలేక చతికిల పడ్డ ముంబై ఇండియన్స్, సొంత గ్రౌండ్‌లోనే MIని చిత్తుగా ఓడించిన పంజాబ్‌

VNS

వాంఖ‌డే వేదిక‌గా ముంబై ఇండియ‌న్స్‌తో (Mumbai Indians) జ‌రిగిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ (Punjab Kings) విజ‌యం సాధించింది. 215 ప‌రుగుల భారీ ల‌క్ష్యాన్ని ఛేదించేందుకు బ‌రిలోకి దిగిన ముంబై నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 6 వికెట్లు న‌ష్ట‌పోయి 201 ప‌రుగుల‌కే ప‌రిమిత‌మైంది. దీంతో పంజాబ్ 13 ప‌రుగుల తేడాతో విజయం సాధించింది.

MS Dhoni Retiring After IPL 2023: ఐపీఎల్ నుంచి రిటైర్మంట్ పై మహేంద్ర సింగ్ ధోనీ కీలక వ్యాఖ్యలు...త్వరలోనే నిర్ణయం..

kanha

శుక్రవారం సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను 7 వికెట్ల తేడాతో ఓడించిన తర్వాత ధోనీ తన కెరీర్‌లో ఇదే చివరి దశ అని కొన్ని మాటల్లో చెప్పాడు.

CSK vs SRH Highlights: హైదరాబాద్‌ను వెంటాడుతున్న ఓటములు, సొంతగ్రౌండ్‌లో చెలరేగిన చెన్నై బౌలర్లు, బ్యాట్స్‌మెన్, ఏడు వికెట్ల తేడాతో ఘనవిజయం

VNS

ఐపీఎల్‌లో (IPL) సన్‌రైజర్స్ హైదరాబాద్‌ టీమ్‌కు ఓటములు కొనసాగుతున్నాయి. ఈ సీజన్‌ లో నాలుగో ఓటమిని మూటగట్టుకుంది హైదరాబాద్. ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్‌(IPL) 2023లో భాగంగా చెన్నైలోని చిదంబరం స్టేడియం వేదిక‌గా స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్‌తో (Sunrisers Hyderabad) జ‌రిగిన మ్యాచ్‌లో చెన్నై సూప‌ర్ కింగ్స్ (Chennai Super Kings) 7 వికెట్ల తేడాతో ఘ‌న విజ‌యం సాధించింది.

Advertisement

IPL 2023 Playoffs Schedule: ఐపీఎల్ నుంచి సరికొత్త అప్‌డేట్, మే 22 నుంచి ప్లే ఆఫ్ మ్యాచ్‌లు, మే 28న నరేంద్ర మోదీ స్టేడియంలో ఫైనల్, షెడ్యూల్ విడుదల చేసిన బీసీసీఐ

Hazarath Reddy

మార్చి 31న ప్రారంభమైన ఐపీఎల్ 16వ సీజన్ పోటీలు అత్యంత ఆసక్తిగా సాగుతున్నాయి. కాగా, ఐపీఎల్ తాజా సీజన్ ప్లే ఆఫ్ మ్యాచ్ ల షెడ్యూల్ ను బీసీసీఐ నేడు విడుదల చేసింది. మొత్తం 70 మ్యాచ్ లతో కూడిన ఐపీఎల్ లీగ్ దశ మే 21న ముగియనుంది. మే 22 నుంచి ప్లే ఆఫ్ మ్యాచ్ లు జరగనున్నాయి.

IPL 2023: వీడియో ఇదిగో, సిరాజ్ డైరక్ట్ త్రో దెబ్బకి షాకయిన హర్‌ప్రీత్‌, పెద్దగా అరుస్తూ కోహ్లీ సెలబ్రేట్,బెస్ట్‌ బౌలింగ్‌ ఫిగర్స్‌ నమోదు చేసిన హైదరాబాదీ ఆటగాడు

Hazarath Reddy

ఐపీఎల్‌ 16వ సీజన్‌లో ఆర్‌సీబీ పంజాబ్‌ కింగ్స్‌తో మ్యాచ్‌లో 24 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన సంగతి విదితమే. ఈ మ్యాచ్ లో ఆర్‌సీబీ బౌలర్‌ సిరాజ్‌ పంజాబ్‌ బ్యాటర్‌ హర్‌ప్రీత్‌ సింగ్‌ బాటియాను రనౌట్‌ చేయడం మ్యాచ్‌కే హైలెట్‌గా నిలిచింది.

IPL 2023: వీడియో ఇదిగో, రేసులోకి వచ్చేసిన వెటరన్‌ పేసర్‌ ఇషాంత్‌ శర్మ, 4 ఓవర్లు బౌలింగ్‌ చేసి 19 పరగులిచ్చి రెండు కీలక వికెట్లు తీసుకున్న ఢిల్లీ పేసర్

Hazarath Reddy

టీమిండియా వెటరన్‌ పేసర్‌ ఇషాంత్‌ శర్మ దాదాపు 717 రోజుల తర్వాత ఐపీఎల్ మ్యాచ్‌ ఆడి ఆకట్టుకున్నాడు. గురువారం కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్‌లో 4 ఓవర్లు బౌలింగ్‌ చేసిన ఇషాంత్‌ 19 పరగులిచ్చి రెండు కీలక వికెట్లు తీశాడు. కాగా ఈ ఏడాది జరిగిన మినీ వేలంలో ఢిల్లీ క్యాపిటల్స్‌ ఇషాంత్‌ శర్మను రూ.50 లక్షలకు దక్కించుకుంది.

IPL 2023: తిన్నగా ఆడటం కూడా రాదు, చెత్త షాట్ ప్రయోగాలు మాత్రం చేస్తావు, కోల్‌కతా నైట్‌రైడర్స్‌ బ్యాటర్‌ మన్‌దీప్‌ సింగ్‌ పై మండిపడుతున్న కెకెఆర్ అభిమానులు

Hazarath Reddy

ఐపీఎల్‌-2023లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ బ్యాటర్‌ మన్‌దీప్‌ సింగ్‌ తన చెత్త ప్రదర్శనను కొనసాగిస్తున్నాడు. తాజాగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 11 బంతులు ఎదుర్కొని కేవలం 12 పరుగులు మాత్రమే చేశాడు. అక్షర్‌ పటేల్‌ బౌలింగ్‌లో అనవసర స్కూప్‌ షాట్‌ ఆడి క్లీన్‌ బౌల్డయ్యాడు.

Advertisement

IPL 2023, DC vs KKR: వార్నర్ మెరుపులు, మనీశ్ దూకుడు, ఎట్టకేలకు ఐపీఎల్ 2023లో గెలుపు ఖాతా ఓపెన్ చేసిన ఢిల్లీ, ఐదు ఓటముల అనంతరం తొలి విక్టరీ

Hazarath Reddy

ఎట్టకేలకు ఢిల్లీ క్యాపిటల్స్‌ ఐపీఎల్లో బోణీ కొట్టింది. ఐదు ఓటముల అనంతరం ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో అదరగొట్టిన వార్నర్‌ సేన గురువారం జరిగిన రెండో పోరులో 4 వికెట్ల తేడాతో కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ను చిత్తు చేసింది.మొదట బ్యాటింగ్‌ చేసిన కోల్‌కతా 20 ఓవర్లలో 127 పరుగులకు ఆలౌటైంది.

Twitter Blue Tick: ట్విట్టర్ బ్లూ టిక్ కోల్పోయిన విరాట్, సమంత, షారుఖ్, జగన్, పవన్ కల్యాణ్.. కారణం ఇదే!

Rudra

దేశంలోని పలువురు ప్రముఖ రాజకీయ నాయకులు, సినీనటులు ట్విట్టర్ బ్లూటిక్ ను కోల్పోయారు. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, సమంత, అలియా భట్, షారూఖ్ ఖాన్, అమితాబ్ బచ్చన్, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, ఏపీ సీఎం జగన్, పవన్ కల్యాణ్, చంద్రబాబు నాయుడు, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ట్విట్టర్ బ్లూటిక్ ను కోల్పోయిన వారి జాబితాలో ఉన్నారు.

IPL 2023,PBKS vs RCB: నిప్పులు చెరిగే బంతులతో పంజాబ్ బ్యాటర్ల భరతం పట్టిన సిరాజ్, 24 పరుగుల తేడాతో PBKSపై ఘన విజయం సాధించిన ఆర్సీబీ

Hazarath Reddy

రాయల్ చాలెంజర్స్ బెంగళూరు పేసర్ మహ్మద్ సిరాజ్ నిప్పులు చెరిగే బౌలింగ్ తో తన జట్టుకు విజయాన్నందించాడు. ఇవాళ పంజాబ్ కింగ్స్ తో మ్యాచ్ లో ఆర్సీబీ జట్టు విజయం సాధించింది.

IPL 2023: ఈ చెత్త బ్యాటింగ్ ఏంది సామి, జట్టులో నుంచి పీకేయకుండా ఇంకా ఎందుకు, దీపక్ హుడాపై మండిపడుతున్న లక్నో అభిమానులు

Hazarath Reddy

జైపూర్‌ వేదికగా లక్నో సూపర్‌ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 10 పరుగుల తేడాతో రాజస్తాన్‌ ఓటమి పాలైన సంగతి విదితమే. 155 పరుగుల స్వల్ప లక్క్ష్యంతో బరిలోకి దిగిన రాజస్తాన్‌.. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 144 పరుగులకే పరిమితమైంది.

Advertisement

IPL 2023: సొంత మైదానంలో ఓడిపోయినందుకు చాలా బాధగా ఉంది, భావేద్వేగానికి గురైన రాజస్తాన్‌ రాయల్స్‌ కెప్టెన్ సంజూ శాంసన్‌

Hazarath Reddy

జైపూర్ వేదికగా జరిగిన లక్నో సూపర్‌ జెయింట్స్‌తో మ్యాచ్‌లో రాజస్తాన్‌ రాయల్స్‌ 10 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. 155 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్తాన్‌ రాయల్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 144 పరుగులు చేసింది. జైశ్వాల్‌ 44, బట్లర్‌ 40 మినహా మిగతావారు రాణించడంలో విఫలమయ్యారు.

IPL 2023: రూ. 3 కోట్లు నీకు దండగ, ఫినిషర్‌గా పనికిరావు వెళ్లి డ్యాన్సులు వేసుకో, రియాన్ పరాగ్ పై మండిపడుతున్న రాజస్థాన్ రాయల్స్ అభిమానులు

Hazarath Reddy

జైపూర్‌ వేదికగా లక్నో సూపర్‌ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 10 పరుగుల తేడాతో రాజస్తాన్‌ ఓటమి పాలైన సంగతి విదితమే. 155 పరుగుల స్వల్ప లక్క్ష్యంతో బరిలోకి దిగిన రాజస్తాన్‌.. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 144 పరుగులకే పరిమితమైంది.

Jos Buttler Six Video: జోస్‌ బట్లర్‌ 112 మీటర్ల భారీ సిక్సర్ వీడియో ఇదిగో, బిత్తరపోయిన లక్నో బౌలర్ యుధ్వీర్, వైరల్ అవుతున్న షాట్ క్లిప్

Hazarath Reddy

ఐపీఎల్‌-2023లో రాజస్తాన్‌ రాయల్స్‌ ఓపెనర్‌ జోస్‌ బట్లర్‌ బ్యాటింగ్ లో దుమ్ము రేపాడు. రాజస్తాన్‌ ఇన్నింగ్స్‌ ఐదో ఓవర్‌ వేసిన యుధ్వీర్ బౌలింగ్‌లో బట్లర్‌ 112 మీటర్ల భారీ సిక్సర్‌ బాదాడు. ఈ ఏడాది సీజన్‌లో ఇది రెండవ అతి పెద్ద సిక్సర్‌ కావడం గమనార్హం.

IPL 2023: లక్నో సూపర్ జెయింట్స్ 10 పరుగుల తేడాతో రాజస్థాన్ రాయల్స్‌పై విజయం..సొంత గడ్డపై మట్టికరిచిన రాజస్థాన్ రాయల్స్

kanha

ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ 10 పరుగుల తేడాతో రాజస్థాన్ రాయల్స్‌పై విజయం సాధించింది. 155 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్ రాయల్స్ జట్టు 6 వికెట్లకు 144 పరుగులు మాత్రమే చేయగలిగింది.

Advertisement

Maharashtra Road Accident: మరో క్రికెటర్‌కు ఘోర రోడ్డు ప్రమాదం, స్పాట్‌లోనే కన్నుమూసిన మాజీ క్రికెటర్ భార్య, ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ప్రవీణ్‌ హింగానికర్‌

Hazarath Reddy

బంగ్లాదేశ్‌ క్రికెబ్‌ బోర్డుకు చీఫ్‌ క్యురేటర్‌గా వ్యవహరిస్తున్న ప్రవీణ్‌ హింగానికర్‌ బుధవారం ఘరో రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. మహారాష్ట్రలోని బుల్దానా జిల్లాలోని మెకర్‌ తాలుకా సమీపంలోని సంవృద్ది హైవేపై ఆగి ఉన్న ట్రక్‌ను కారు వెనుక నుంచి గుద్దింది

IPL 2023 Match Fixing Racket?: ఐపీఎల్‌లో మళ్ళీ మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం, ఫిక్సింగ్ చేయాలంటూ నన్ను సంప్రదించారని బిసిసిఐకి ఫిర్యాదు చేసిన మహ్మద్ సిరాజ్

Hazarath Reddy

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పేసర్ మహ్మద్ సిరాజ్ బిసిసిఐ అవినీతి నిరోధక విభాగం (ఎసియు)కి " మ్యాచ్ ఫిక్సింగ్" అంశాన్ని తెలిపాడు. IPL గేమ్ లో ఫిక్సింగ్ చేయాలంటూ తనకు కాల్ వచ్చిందని భారత పేసర్‌కు ACU అధికారులకు నివేదించాడు.

Abdul Azeem Passes Away: హైదరాబాద్‌ మాజీ క్రికెటర్‌ అబ్దుల్‌ అజీమ్‌ మృతి, దేశవాళీ క్రికెట్‌లో దూకుడుగా ఆడే ఓపెనర్‌గా పేరు

Hazarath Reddy

హైదరాబాద్‌ మాజీ క్రికెటర్‌ అబ్దుల్‌ అజీమ్‌ (62) మంగళవారం మృతి చెందాడు. అజీమ్‌ కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. దేశవాళీ క్రికెట్‌లో దూకుడుగా ఆడే ఓపెనర్‌గా అజీమ్‌ పేరు గడించాడు. 1986 రంజీ సీజన్‌లో తమిళనాడుపై ట్రిపుల్‌ సెంచరీ కూడా సాధించాడు.

IPL 2023: నువ్వు నీ చెత్త ఆట, గల్లీలో ఆడుకో పోయి, కీలక సమయంలో చేతులెత్తేసిన సమద్‌పై విరుచుకుపడుతున్న సన్‌రైజర్స్‌ అభిమానులు

Hazarath Reddy

ఐపీఎల్‌లో సన్‌రైజర్స్‌ ఖాతాలో మరో ఓటమి చేరింది. మంగళవారం ఉప్పల్‌ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ 14 పరుగుల తేడాతో హైదరాబాద్‌ను ఓడించింది. ముంబై విసిరిన 193 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సన్‌రైజర్స్‌ 178 పరుగులకు ఆలౌటైంది.

Advertisement
Advertisement