Oval, June 11: ఐసీసీ ఫైనల్స్‌లో తమకు తిరుగులేదని మరోసారి కంగారులు నిరూపించారు. ఇంగ్లండ్‌లోని ఓవల్(Oval) మైదానంలో జరిగిన ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్లో(WTC Final 2023) ఆస్ట్రేలియా అద్భుత విజయం సాధించింది. తొలిసారి డబ్ల్యూటీసీ ఫైనల్ చేరిన ఆ జట్టు సంచలన ఆటతో భారత్‌ను చిత్తుగా ఓడించింది. 209 పరుగలు తేడాతో గెలిచి టెస్టు గదను సాధించింది. దాంతో, రెండోసారైనా చాంపియన్‌గా నిలవాలనుకున్న టీమిండియా కల చెదిరింది. నాథన్ లియాన్ ఓవర్లో సిరాజ్ స్వీప్ షాట్ ఆడి బోలాండ్ చేతికి చిక్కాడు. దాంతో, ఆసీస్ ఆటగాళ్లు సంబురాలు చేసుకున్నారు. రెండో ఇన్నింగ్స్‌లో అజింక్యా రహానే(46), విరాట్ కోహ్లీ(49) ప్రతిఘటించినా స్వల్ప వ్యవధిలో 4 వికెట్లు పడడంతో భారత్‌కు ఓటమి తప్పలేదు. దాంతో, అన్ని ఫార్మాట్లలో ఐసీసీ ట్రోఫీలు నెగ్గిన తొలి జట్టుగా ఆస్ట్రేలియా అవతరించింది. నాథన్ లియాన్ ఓవర్లో సిరాజ్ స్వీప్ షాట్ ఆడి బోలాండ్ చేతికి చిక్కాడు. దాంతో, ఆసీస్ ఆటగాళ్లు సంబురాలు చేసుకున్నారు. రెండో ఇన్నింగ్స్‌లో అజింక్యా రహానే(46), విరాట్ కోహ్లీ(49) ప్రతిఘటించినా బోలాండ్, లియాన్ వెంట వెంటనే వికెట్లు తీసి భారత్‌ను ఒత్తిడిలోకి నెట్టారు. దాంతో, మరోసారి టైటిల్ వేటలో చతికిల పడిన టీమిండియా అభిమానులను తీవ్ర నిరాశపరిచింది.
The winning captain 🤩#WTC23 | #AUSvIND pic.twitter.com/1f9c2mxRP2
— ICC (@ICC) June 11, 2023
ఎన్నో అంచనాల మధ్య మొదలైన టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్ తొలిరోజు ఆసీస్ ఆటగాళ్లు దంచారు. ట్రావిస్ హెడ్(163), స్టీవ్ స్మిత్(121) సెంచరీలతో కదం తొక్కి భారీ స్కోర్ అందించారు. ఆ తర్వాత బౌలర్లు చెలరేగడంతో తొలి ఇన్నింగ్స్‌లో భారత్ వెంట వెంటనే ఐదు వికెట్లు కోల్పోయింది. అయితే.. అజింక్యా రహానే(89), శార్దూల్ ఠాకూర్(51) అసమాన పోరాటంతో ఆదుకున్నారు. వీళ్లు కీలక భాగసామ్యం నిర్మించడంతో భారత్ 269కు ఆలౌటయ్యింది. రెండో ఇన్నింగ్స్‌లో అలెక్స్ క్యారీ(66 నాటౌట్), మిచెల్ స్టార్క్(41) ధాటిగా ఆడారు. దాంతో, 270 వద్ద ప్యాట్ కమిన్స్ ఇన్నింగ్స్ డిక్లేర్ చేశాడు.
The celebrations are on 🎉🇦🇺#WTC23 | #AUSvIND pic.twitter.com/bJrfmiM2Tf
— ICC (@ICC) June 11, 2023
రెండో ఇన్నింగ్స్‌లో 444 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో భారత్‌కు ఆదిలోనే షాక్. శుభ్‌మన్ గిల్(18)ను బోలాండ్ వెనక్కి పంపాడు. ఆ తర్వాత వరుస ఓవర్లలో రోహిత్ శర్మ(43), ఛటేశ్వర్ పూజారా(27) వెనుదిరిగారు. ఆ తర్వాత కోహ్లీ, రహానే 20 ఓవర్లు ఆచితూచి ఆడి, మరో వికెట్ పడనీయలేదు. దాంతో, ఐదో రోజు 280 కొట్టి టెస్టు గదను పట్టుకొస్తారని అంతా అనుకున్నారు. కానీ, అలా జరగలేదు. ఐదో రోజు తొలి సెషన్‌లోనే బోలాండ్ దెబ్బకొట్టాడు. వరుస బంతుల్లో కోహ్లీ, జడేజాను ఔట్ చేశాడు. ఆ తర్వాత స్టార్క్ బౌలింగ్‌లో రహానే ఔట్ కావడంతో భారత ఓటమి ఖరారైంది. ఆసీస్ బౌలర్లలో లియాన్ 4, బోలాండ్ 3, స్టార్క్ 2, కమిన్స్ ఒక వికెట్ తీశారు.