ICC (Photo Credits: File Image)

ew Delhi, April 10: వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ 2027కు (ICC ODI World Cup 2027) ద‌క్షిణాఫ్రికా, జింబాబ్వే, న‌మీబియా దేశాలు ఆతిథ్యం ఇవ్వ‌నున్న సంగ‌తి తెలిసిందే. 14 దేశాలు పాల్గొనే ఈ మెగాటోర్నీకి సంబంధించి ప్ర‌స్తుతానికి ద‌క్షిణాఫ్రికాలో జ‌ర‌గ‌బోయే మ్యాచ్‌ల‌కు సంబంధించిన వేదిక‌లు ఖ‌రారు అయ్యాయి. ద‌క్షిణాఫ్రికాలో (South Africa) అంత‌ర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) గుర్తించిన మైదానాలు 11 ఉండ‌గా ఇందులో ఎనిమిది వేదిక‌ల్లో (Stadiums Across South Africa) ప్ర‌పంచ‌క‌ప్ మ్యాచ్‌లు జ‌ర‌గ‌నున్నాయి. జోహన్నెస్‌బర్గ్‌లోని వాండరర్స్, ప్రిటోరియాలోని సెంచూరియన్ పార్క్, డర్బన్‌లోని కింగ్స్‌మీడ్, గ్కెబెర్హాలోని సెయింట్ జార్జ్ పార్క్, పార్ల్‌లోని బోలాండ్ పార్క్, కేప్ టౌన్‌లోని న్యూలాండ్స్ బ్లూమ్‌ఫోంటైన్‌లోని మాంగాంగ్ ఓవల్, ఈస్ట్ లండన్‌లోని బఫెలో పార్క్ లు వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ 2027 మ్యాచ్‌ల‌కు వేదిక‌లు కానున్నాయి.

 

ఈ విష‌యాన్ని క్రికెట్ సౌతాఫ్రికా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీస‌ర్ ఫోలెట్సీ మోసెకీ చెప్పారు. ఇక జింబాబ్వే, న‌మీబియాలో జ‌ర‌గ‌నున్న మ్యాచ్‌ల‌కు సంబంధించి త్వ‌ర‌లోనే వేదిక వివ‌రాల‌ను వెల్ల‌డించ‌నున్న‌ట్లు తెలిపారు. 2027 వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్‌లో మొత్తం 14 దేశాలు పాల్గొన‌నున్నాయి. వీటిని రెండు గ్రూపులో విభ‌జించారు. ప్ర‌తి గ్రూపు నుంచి మొద‌టి మూడు స్థానాల్లో నిలిచిన జ‌ట్లు సూప‌ర్ సిక్స్ చేరుకుంటాయి. సూప‌ర్ సిక్స్‌లో మొద‌టి నాలుగు స్థానాల్లో నిలిచిన జ‌ట్లు సెమీపైన‌ల్స్ ఆడ‌తాయి. ఫైన‌ల్ మ్యాచ్ జ‌ర‌గ‌నుంది. గ్రూపు ద‌శ‌లో ఒక జ‌ట్టు మిగిలిన అన్ని జ‌ట్ల‌తో మ్యాచులు ఆడ‌నుంది.